Home /News /explained /

BUSINESS IDEAS WORK FROM HOME JOBS PART TIME EARN MONEY MK

Womens Day 2021: మహిళలు ఇంట్లో కూర్చొని డాలర్లు ఇలా సంపాదించుకోవచ్చు...

ప్రతీకాత్మక  చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మహిళలు సమయంలో ఇంట్లో ఉండే డబ్బు ఎలా సంపాదించుకునే మార్గాలు ఏంటో తెలుసుకుందాం.

    మహిళలు వ్యాపారవేత్తగా మారాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి అనేది ఒక కారణం మాత్రమే, అంతకన్నా ముఖ్యమైనది, సంకల్పం. నిజానికి వ్యాపారంలో మీ నిజమైన పెట్టుబడి …మొదటిది మీ సమయం కాగా, రెండవది మీ యొక్క నైపుణ్యాలు. అతి తక్కువ పెట్టుబడితో మీ కలలను సాకారం చేసే వ్యాపారాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో ఉండే డబ్బు ఎలా సంపాదించుకునే మార్గాలు ఏంటో తెలుసుకుందాం.

    ఆన్‌లైన్‌ టీచింగ్‌/ట్యూషన్‌ సెంటర్‌/ఆన్‌లైన్‌ కోర్సులు :

    ప్ర‌స్తుతం గూగుల్ లో వెతికితే ఎన్నో ఆన్‌లైన్ టీచింగ్ అవ‌కాశాలు ల‌భిస్తున్నాయి. ఇందులో మీకు అనుకూల‌మైన అంశం ఏమిటంటే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు పాఠాలు చెప్ప‌వ‌చ్చు. ఆన్‌లైన్ ట్యూట‌ర్ వెబ్‌సైట్ల‌లో న‌మోదు చేసుకునేందుకు కొన్ని ఉచితంగా అవ‌కాశాలు క‌ల్పిస్తుండ‌గా కొన్ని రుసుములు వ‌సూలు చేస్తున్నాయి. ఒక‌సారి ఆ వెబ్‌సైట్ల‌లో ట్యూట‌ర్‌గా నమోదు చేసుకున్న త‌ర్వాత మీకు అనుకూల‌మైన స‌మ‌యాన్ని అందులో పేర్కొన‌వ‌చ్చు. స్టేట్ సిల‌బ‌స్‌, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పదో త‌ర‌గ‌తి లోపు పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పేందుకు అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇంట్లోనే కూర్చొని డబ్బు సంపాదించొచ్చు. అవసరమైతే సోషల్‌ మీడియాను కూడా వినియోగించుకుని మీ బ్రాండ్ నేమ్ డెవలప్‌ చేయొచ్చు. సొంత ఇంట్లోనే క్లాసులు తీసుకొని రోజూ రెండు మూడు గంటలు కష్టపడితే చాలు. చక్కటి ఆదాయం సొంతం అవుతుంది.

    ఆన్‌లైన్‌ జాబ్స్‌, యూట్యూబ్‌ ఛానెల్‌ :

    ఇంట‌ర్నెట్ రాక‌తో ప్ర‌పంచం కుగ్రామం అయిపోయింది. దీంతో ఇక్క‌డ ఇంట్లో కూర్చొని వేరే దేశం వాళ్ల‌కు అవ‌స‌ర‌మైన ప‌నిచేసి పెట్టి గంట‌కు ప‌దుల‌ డాల‌ర్ల‌లో డ‌బ్బు సంపాదించే మార్గాలు వ‌చ్చాయి. కాస్త సాంకేతిక ప‌రిజ్ఞానం ఉండి ఒక కంప్యూట‌ర్ లేదా ల్యాప్‌ట్యాప్ ఉంటే చాలు ఆన్‌లైన్‌లో డ‌బ్బు ఆర్జించ‌వ‌చ్చు. మీ ఉద్యోగం ప‌నిగంట‌ల వ‌ర‌కే మీరు కార్యాల‌యంలో ప‌ని చేస్తూ ఉండి మీకు ఫ్రీ టైం ఉండేట్ల‌యితే అద‌న‌పు డ‌బ్బు సంపాదించ‌డానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొంచెం కష్టపడి మీలాంటి మరికొంతమందిని ఒక్కచోట చేర్చి చిన్న ఆఫీస్‌ను అద్దెకు తీసుకుని చిన్న చిన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి వ్యాపారంలో సక్సెస్‌ కావచ్చు. అలాగే బ్లాగులు, యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా కూడా డబ్బు సంపాదించే వీలుంది. అలాంటి ప్రయత్నాలు ప్రారంభించండి.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Womens day 2021

    తదుపరి వార్తలు