Home /News /explained /

BUSINESS IDEA EARN MONEY WITH WASTE PLASTIC BOTTLES AND MAKE BIG PROFITS NK

Business Ideas: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు... నష్టాలే లేని వ్యాపారం

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు (ప్రతీకాత్మక చిత్రం)

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు (ప్రతీకాత్మక చిత్రం)

Business Ideas: వ్యాపారం చెయ్యాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియదు. ఈ వ్యాపార ఐడియాతో మీరు అందరికీ మేలు చేసే అవకాశం లభిస్తుంది.

    మీరు చూసే ఉంటారు... కరోనా వచ్చాక... ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా వాటర్ బాటిళ్ల వాడకం ఎక్కువైంది. బస్టాపులు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లలో అంతటా ప్రజలు మినరల్ వాటర్ బాటిళ్లనే కొనుక్కుంటున్నారు. ఇలా కొనేవాటిలో 99 శాతం వృథాగానే పడి ఉంటున్నాయి. అలాంటి బాటిళ్లతో మీరు తక్కువ సమయంలోనే లక్షల కొద్దీ ఆదాయం సంపాదించవచ్చు. అదెలాగో చూద్దాం. మన దేశంలో వ్యవసాయ రంగం చాలా పెద్దది. కానీ చాలా మంది రైతులు పంట వేసినా... ఫలం దక్కట్లేదు. భూమి, ఎరువులూ లభిస్తున్నా... పంటలు పండకపోవడానికి కారణం నీటి కొరత. వర్షాలు తక్కువగా పడుతుంటే... పంటలు నాశనం అయిపోతున్నాయి. మీరు ఓ కొత్త టెక్నాలజీతో... ఆ రైతులకు మేలు చేయగలరు. అదే సమయంలో మీ వ్యాపారాన్ని అద్భుతంగా పెంచుకోగలరు.

    మధ్యప్రదేశ్... ఝబువార్ జిల్లాకు చెందిన ఓ రైతు... డ్రిప్ ఇరిగేషన్ (బిందుసేద్యం) ద్వారా భారీగా డబ్బు సంపాదించగలిగాడు. అతను ఉన్నది గిరిజన ప్రజలు ఉండే ప్రాంతం. ఖాళీ గ్లూకోజ్ బాటిళ్లను ఉపయోగించి... డ్రిప్ ఇరిగేషన్ చేపట్టాడు. స్థానిక కొండ ప్రాంతాల్లో గిరిజన రైతుల సమస్యల్ని చూసి... డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం చేసేందుకు గ్లూకోజ్ బాటిళ్లతో ఓ టెక్నాలజీని అతను తయారుచేశాడు.


    ఆ రైతు నేషనల్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ (NAIP) సైంటిస్టులను 2009-2010లో కలుసుకున్నాడు. వారి సలహాలు, సూచనలతో... చలికాలం, వానాకాలంలో డ్రిప్ ఇరిగేషన్ చేపట్టాడు. ఆ తర్వాత అతను ఇదే విధానం చేపట్టి... ఓ చిన్న నర్సరీ ఏర్పాటు చేశాడు.


    NAIP మీకు ఇస్తున్న సలహా ఇదే:
    తాను వేసిన పంటకు వర్షపు నీరు రాకపోతే... పంట నష్టపోవాల్సి ఉంటుందని భావించిన ఆ రైతు... NAIPని సంప్రదించాడు. వాళ్లు... గ్లూకోజ్ బాటిళ్లతో బిందు సేద్యం చెయ్యమని సలహా ఇచ్చారు. దాంతో ఆ రైతు... కేజీ 20 చొప్పున గ్లూకోజ్ ప్లాస్టిక్ బాటిళ్లను కొన్నాడు. వాటిని పై భాగంలో సగానికి కట్ చేశాడు. తర్వాత వాటి ద్వారా చుక్క చుక్క నీరు మొక్కకు చేరేలా పడేలా చేశాడు.


    NAIP సలహాతో... పొలంలోని అన్ని మొక్కలకు తక్కువ నీరు... సరైన మోతాదులో వెళ్లింది. రోజూ అతని కొడుకు... స్కూల్‌కి వెళ్లేముందు... బాటిళ్లలో నీరు నింపి వెళ్లేవాడు. తిరిగి సాయంత్రం వచ్చాక... మళ్లీ నీరు నింపేవాడు. ఫలితంగా మొక్కలకు సరిగ్గా సరిపడా నీరే లభించింది. అందువల్ల పంట బాగా పడింది. అతను 0.24 ఎకరాల స్థలంలో వేసిన పంటకు రూ.15,200 ఆదాయం పొందాడు.

    రైతులందరిదీ అదే బాట:
    ఈ బిందు సేద్యం వల్ల అన్నీ లాభాలే ఉండటంతో... ఇతర రైతులు కూడా ఇదే విధానం ప్రారంభించారు. గ్లూకోజ్ ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి... ఊరంతా వాటిని వాడుకున్నారు. ఇది తెలుసుకున్న మధ్యప్రదేశ్ వ్వసాయ మంత్రి రమేష్ బారియాక్ ఆ ఊరి రైతులకు ప్రత్యేకంగా అభినందన లేఖ పంపారు.

    ఇది కూడా చదవండి: Chicken Recipe: చికెన్ గ్రేవీ కర్రీ.. చాలా ఈజీ.. అదిరిపోయే టేస్ట్.. ఇలా చేసుకోండి

    మీరు కూడా ఇలా చెయ్యాలనుకుంటే... తెలంగాణ రాష్ట్రంలో... తెలంగాణ NAIP కోసం http://www.tsbiodiversity.org/NAIP-ICAR.html లింక్ క్లిక్ చెయ్యండి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ NAIP కోసం https://apsbb.org/who_is_who.html లింక్ క్లిక్ చెయ్యండి.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Business Ideas, Money

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు