BUDGET 2022 E PASSPORT TO BE ROLLED OUT IN 2022 2023 NIRMALA SITHARAMAN ANNOUNCES GH VB
Explained: త్వరలో దేశంలో ఈ-పాస్‌పోర్టులు.. అసలు ఈ-పాస్పోర్ట్స్ అంటే ఏంటి..? ఇవి ఎలా పనిచేస్తాయి..?
ప్రతీకాత్మక చిత్రం
టెక్నాలజీ, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన ఈ తరంలో ప్రతీది డిజిటల్, ఎలక్ట్రానిక్ రూపం సంతరించుకుంటోంది. డేటాను ఎలక్ట్రానిక్ మోడ్‌లో సేవ్ చేసుకునే ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ జాబితాలో పాస్‌పోర్టులు కూడా చేరనున్నాయి.
టెక్నాలజీ(Technology), ఇంటర్నెట్(Internet) అందుబాటులోకి వచ్చిన ఈ తరంలో ప్రతీది డిజిటల్, ఎలక్ట్రానిక్ రూపం సంతరించుకుంటోంది. డేటాను ఎలక్ట్రానిక్ మోడ్‌లో(Electronic Mode) సేవ్ చేసుకునే ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ జాబితాలో పాస్‌పోర్టులు కూడా చేరనున్నాయి. సంప్రదాయ పాస్‌పోర్టుల స్థానంలో త్వరలో ఈ-పాస్‌పోర్టులు(E Passports) ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 బడ్జెట్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు ఈ-పాస్పోర్ట్స్ అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి? వంటి వివరాలు తెలుసుకుందాం.
ఇంతకీ ఈ-పాస్‌పోర్టు అంటే ఏంటి?
ఈ-పాస్‌పోర్టులు మనకు కొత్తేమో కానీ అవి అమెరికా, బ్రిటన్, జర్మనీ సహ 120కి పైగా దేశాల్లో ఇప్పటికే బయోమెట్రిక్ ఈ-పాస్‌పోర్టు విధానం అందుబాటులో ఉంది. ఇది కూడా సంప్రదాయ పాస్‌పోర్టు తరహాలోనే పనిచేస్తుంది. కానీ ఇది మరింత సురక్షితంగా ఉంటుంది. ఇందులో ఒక ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. ప్రింట్ పాస్‌పోర్టులో ఉండే సమాచారమంతా ఈ చిప్‌లో నిక్షిప్తం చేస్తారు. ఈ మైక్రోచిప్‌లో పాస్‌పోర్టు కలిగిన వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, ఇతర వివరాలన్నీ ఉంటాయి. ఈ-పాస్‌పోర్టు ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కల్పిస్తుంది. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల ముందు పొడవాటి క్యూలైన్లలో నిల్చుని వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. నిమిషాల్లో ఈ పాస్‌పోర్టును స్కాన్ చేయవచ్చు. అంతే కాదు నకిలీ పాస్‌పోర్టులను కూడా వీటి ద్వారా అరికట్టవచ్చు.
ఈ-పాస్‌పోర్టు ఫీచర్లు
ఈ-పాస్‌పోర్టులో వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఒక చిప్‌తో సేవ్ అయ్యి ఉంటుంది. ఈ చిప్‌ను పాస్‌పోర్టు వెనుక అమర్చుతారు. 64 KB డేటా స్టోర్ చేయగల సామర్థ్యం దీనిలో ఉంటుంది. దీనిని ఒక యాంటెన్నాలో అమర్చుతారు. డ్రైవింగ్ లైసెన్స్ కార్డులో ఉండే తరహాలో ఈ చిప్ ఉంటుంది. ప్రారంభ దశలో ఈ చిప్‌లో విదేశీ పర్యటనలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. పాస్పోర్టుదారు ఫొటోతో పాటు వేలిముద్రల వంటి బయోమెట్రిక్ డేటా కూడా ఉంటుంది. దాన్ని ఎవరైనా మార్చాలని చూస్తే ఆ పాస్‌పోర్టు ధ్రువీకరణ విఫలమవుతుంది. మైక్రోచిప్‌లో రికార్డైన డేటాను మార్చడం చాలా కష్టం.
ఈ-పాస్‌పోర్టు ఎలా పనిచేస్తుంది?
- ఇది కూడా సంప్రదాయ పాస్‌పోర్టు తరహాలోనే పనిచేస్తుంది. కానీ ఇది మరింత సురక్షితంగా ఉంటుంది. ఇందులో ఒక ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. ప్రింట్ పాస్‌పోర్టులో ఉండే సమాచారమంతా ఈ చిప్‌లో నిక్షిప్తం చేస్తారు.
- ఈ మైక్రోచిప్‌లో పాస్‌పోర్టు ఓనర్ పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా ఇతర వివరాలన్నీ ఉంటాయి.
- ఈ చిప్‌ను పాస్‌పోర్టు బుక్ వెనుక భాగంలో అమర్చుతారు. 64 KB డేటా స్టోర్ చేయగల సామర్థ్యం దీనిలో ఉంటుంది. దీనిని ఒక రెక్టాంగ్యూలర్ యాంటెన్నాలో అమర్చుతారు. డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్‌లో ఉండే చిప్ తరహాలోనే ఈ పాస్‌పోర్ట్ చిప్ ఉంటుంది.
- ప్రారంభ దశలో ఈ చిప్‌లో 30 అంతర్జాతీయ పర్యటనలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆ తర్వాత దశల్లో ఈ చిప్‌లో పాస్పోర్టుదారు ఫొటోతో పాటు వేలిముద్రల వంటి బయోమెట్రిక్ డేటా కూడా ఉంటుంది. ఈ చిప్‌ను ఎవరైనా మార్చాలని చూస్తే ఆ పాస్‌పోర్టు ధ్రువీకరణ విఫలమవుతుంది.
- ఈ-పాస్‌పోర్టు ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కల్పిస్తుంది. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల ముందు పొడవాటి క్యూలైన్లలో నిల్చుని వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో భౌతికంగా జరిగే వెరిఫికేషన్‌తో పోల్చితే ఈ-పాస్‌పోర్టును నిమిషాల్లో స్కాన్ చేయవచ్చు. వీటి వల్ల ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో ప్రస్తుతం పడుతున్న సమయం సగానికి పైగా తగ్గుతుందని అంచనా.
- నకిలీ పాస్‌పోర్టులను అరికట్టడంలోనూ ఈ-పాస్‌పోర్ట్ సాయపడుతుంది. మైక్రోచిప్‌లో రికార్డైన డేటాను మార్చడం చాలా కష్టం.
- దొంగతనం, ఫోర్జరీ వంటివి నిరోధించేందుకు, క్రమబద్ధమైన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కోసం మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు అవసరమైన అప్‌గ్రేడెడ్ డాక్యుమెంట్లు, కావాల్సిన మౌలిక సదుపాయాలకు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ప్రమాణాలకు అనుగుణంగా ఈ-పాస్‌పోర్టులు ఉంటాయని విదేశాంగ శాఖ తెలిపింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) కూడా దీని కోసం ఉపయోగిస్తారు. వీటిని ముద్రణకు సంబంధించిన కాంట్రాక్టు నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌కు అప్పగించినట్టు సమాచారం. ఎలక్ట్రానిక్ కాంటాక్ట్‌లెస్ ఇన్లేస్తో పాటు చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్టులకు అవసరమైన ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.
- ఈ-పాస్‌పోర్టు ముద్రణకు అవసరమైన సదుపాయాలన్నీ నాసిక్‌లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ సమీకరించుకున్ తర్వాత ఈ-పాస్‌పోర్టుల జారీ ప్రారంభమవుతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ-పాస్‌పోర్టును TCS కూడా ప్రవేశపెట్టనుంది.
- ఈ-పాస్‌పోర్టు కోసం కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తాము తీసుకువస్తామని TCS తెలిపింది. అయితే, సార్వభౌమాధికార విధులతో ముడిపడ్డ పాస్‌పోర్టు జారీ, వాటి ముద్రణ వంటి ప్రక్రియలన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయని టీసీఎస్ ప్రతినిధి తేజ్ భాట్లా తెలిపారు.
- మిగిలిన ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ తరహాలో ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టులు కాగితరహితంగా ఉండబోవు. వీసా స్టాంపింగ్ వంటివి అవసరం కాబట్టి ప్రస్తుతం ఉన్న పాసుపోర్టుల్లోని పేపర్లు అలాగే ఉంటాయి. అయితే ఆటోమేషన్ ద్వారా ఎక్కడ వీలైతే అక్కడ పేపర్లు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.