హోమ్ /వార్తలు /Explained /

Gas Cylinder Discount: అలా బుక్ చేస్తే గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 డిస్కౌంట్... ఎలా పొందాలంటే..

Gas Cylinder Discount: అలా బుక్ చేస్తే గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 డిస్కౌంట్... ఎలా పొందాలంటే..

Gas Cylinder Discount: గ్యాస్ సిలిండర్‌పై డిస్కౌంట్... పొందండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Gas Cylinder Discount: గ్యాస్ సిలిండర్‌పై డిస్కౌంట్... పొందండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Gas Cylinder Discount | డిస్కౌంట్‌తో గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలనుకుంటున్నారా? ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.

మీరు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? డిస్కౌంట్‌పై గ్యాస్ సిలిండర్ కొనొచ్చు. ఇటీవల గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. గత 9 నెలల్లో హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.231.50 పెరిగింది. గతేడాది మేలో సిలిండర్ ధర రూ.590 ఉంటే ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.821.5. కొద్ది రోజుల క్రితం సిలిండర్‌పై రూ.50 పెరగడంతో ఈ ధరకు చేరుకుంది. ఫిబ్రవరిలోనే సిలిండర్ ధర రెండుసార్లు పెరిగింది. సిలిండర్ ధర ఇంతలా పెరిగిపోతుండటం సామాన్యులకు భారమవుతోంది. ఇలాంటి సమయంలో డిస్కౌంట్‌లో సిలిండర్ కొనే అవకాశం వస్తే వదులుకుంటారా? ఎవరూ వదులుకోరు. ఇలాంటి మంచి ఛాన్స్ వచ్చింది. గ్యాస్ సిలిండర్‌ను రూ.50 డిస్కౌంట్‌కే కొనొచ్చు.

మీకు అమెజాన్ అకౌంట్ ఉందా? అయితే అమెజాన్‌లో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ట్వీట్‌లో వెల్లడించింది. అందులోని సమాచారం ప్రకారం మీరు సిలిండర్ బుక్ చేస్తే రూ.50 తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.821.5 విలువైన సిలిండర్‌ను రూ.771 ధరకే కొనొచ్చు. రూ.50 డిస్కౌంట్ పొందొచ్చు.

LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిందా? వెంటనే తీసుకోవచ్చు ఇలా

Cylinder Booking on Paytm: పేటీఎంలో సింపుల్‌గా సిలిండర్ బుకింగ్... ఎలా చేయాలంటే

Gas Cylinder Booking on Amazon: అమెజాన్‌లో గ్యాస్ సిలిండర్ బుక్ చేయండి ఇలా


అమెజాన్‌లో గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి ముందుగా అమెజాన్ యాప్ ఓపెన్ చేయాలి.

ఆ తర్వాత Amazon Pay పైన క్లిక్ చేయాలి.

స్క్రోల్ డౌన్ చేస్తే Book your LPG Cylinder బ్యానర్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి.

ఆ తర్వాత Pay Now పైన క్లిక్ చేయాలి.

మీ గ్యాస్ ఆపరేటర్‌ను సెలెక్ట్ చేయాలి.

ఆ తర్వాత ఎల్‌పీజీ ఐడీ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Get Booking Details పైన క్లిక్ చేయాలి.

కస్టమర్ పేరు, బిల్ వివరాలు కనిపిస్తాయి.

Continue to Pay పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత పేమెంట్ పూర్తి చేయాలి.

Indane Gas Cylinder Booking: ఇండేన్ గ్యాస్ యూజర్లకు అలర్ట్... సిలిండర్ కావాలంటే ఈ నెంబర్‌కే కాల్ చేయాలి

LPG Cylinder: సిలిండర్ బుక్ చేశారా? ఈ కొత్త రూల్ తెలుసుకోండి

అమెజాన్‌లో సిలిండర్ బుక్ చేసిన తర్వాత రూ.50 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మొదటిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసినవారికే రూ.50 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్‌కు సంబంధించిన నియమనిబంధనలు అమెజాన్ యాప్‌లో ఉంటాయి. ఈ వివరాలను చదివిన తర్వాతే బుకింగ్ చేయాలి.

First published:

Tags: Amazon, AMAZON INDIA, AMAZON PAY, Bharat Gas, Gas, HP gas, Indane Gas, Indian Oil Corporation, LPG Cylinder

ఉత్తమ కథలు