• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • BLACK FUNGUS WHAT IS MUCORMYCOSIS HOW IT SPREAD WHAT ARE THE SYMPTOMS OF MUCORMYCOSIS HOW TO TREAT IT DOS AND DONTS FULL DETAILS NK

Black fungus: బ్లాక్ ఫంగస్ లక్షణాలేంటి? అది రాకుండా ఏం చెయ్యాలి? వస్తే ఏం చెయ్యాలి?

Black fungus: బ్లాక్ ఫంగస్ లక్షణాలేంటి? అది రాకుండా ఏం చెయ్యాలి? వస్తే ఏం చెయ్యాలి?

ఒంగోలుకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి కూడా బ్లాక్ ఫంగస్ సోకడంతో కన్ను దెబ్బతిని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒంగోలులోని ప్రభుత్వ వైద్యశాల రిమ్స్‌లో తాజాగా నాలుగు బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కరోనా సోకి కోలుకున్న కొందరిలో ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం.

Black fungus: బ్లాక్ ఫంగస్‌కి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కీలకమైన సూచనలు, నివారణ, నియంత్రణ చర్యలను తెలిపింది. అవేంటో తెలుసుకుందాం.

  • Share this:
    Black fungus: అసలే దేశం కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతుంటే... నెత్తిమీద పిడుగులా ఈ బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్ - Mucormycosis) ఒకటి తయారైంది. కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లకు ఇది ఎక్కువగా సోకుతోంది. కొన్ని మోల్డులు గుంపుగా ఉంటూ... ఈ వ్యాధిని వ్యాపింపజేస్తాయి. వాటిని మ్యూకర్ మైసెట్స్ (mucormycetes) అంటారు. ఇది పాతదే అయినా... ఇప్పుడు దీని వ్యాప్తి ఎక్కువైంది. తెలుగు రాష్ట్రాలకు కూడా ఇది వచ్చింది కాబట్టి... మనం దీని పూర్తి విషయాలు తెలుసుకుంటే... మన జోలికి రాకుండా చేసుకోవచ్చు. బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుంటే... కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ కొన్ని సూచనలు చేశారు. ట్విట్టర్ ద్వారా వాటిని పంచుకున్నారు. అవేంటో చూద్దాం.

    బ్లాక్ ఫంగస్ - కేంద్రం సూచనలు:
    - బ్లాక్ ఫంగస్ అనారోగ్యంతో బాధపడే వాళ్లకే (వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి) సోకుతుంది.
    - ఇది సోకితే... శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరింత తగ్గిపోతుంది.
    - దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి ఇది సోకే ప్రమాదం ఉంటుంది. అలాగే... వొరికొనజోల్ మందులు వాడుతున్న వారికి, డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవారికి, స్టెరాయిడ్లు వాడే వారికి, ICUలో ఎక్కువ కాలం ఉండే వారికి ఇది సోకగలదు.


    బ్లాక్ ఫంగస్ లక్షణాలు (Symptoms of Mucormycosis):
    - కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రగా అవ్వడం లేదా నొప్పి రావడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి సరిగా ఆడకపోవడం, రక్తపు వాంతులు, మానసిక సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయి. నాలికపై నల్లటి మచ్చలు ఉంటే... వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.
    - ఇది అంటు వ్యాధి కాదు. ఒకరి నుంచి ఇతరులకు సోకదు. వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటే... ఇది మనల్ని ఏమీ చెయ్యలేదు.

    ఈ వ్యాధి సోకితే... 24 గంటల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ బ్లాక్ ఫంగస్... ఎముకలను కూడా తినేయగలదు. ఇది తిన్నగా బ్రెయిన్‌ను దెబ్బతీసి... రోగిని చంపేయగలదు. వెంటనే ట్రీట్‌మెంట్ అందిస్తే... రోగిని బతికించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం కేంద్రం యాంఫోటెరిసిన్ B (Amphotericin B) అనే మందును ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచింది. ఈ మందు ఎలా వాడాలో డాక్టర్లు డిసైడ్ చేస్తారు. సరైన టైమ్‌కి ఈ మందు వాడితే... బ్లాక్ ఫంగస్ గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోతుంది.

    ఇది కూడా చదవండి: Tomato Health Benefits: టమాటాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

    ఇలా చెక్ పెట్టవచ్చు:
    - డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి.
    - కరోనా నుంచి రికవరీ అయిన డయాబెటిస్ ఉన్న వారు... డిశ్చార్జి అయ్యాక షుగర్ లెవెల్స్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
    - స్టెరాయిడ్లు ఇష్టమొచ్చినట్లు కాకుండా జాగ్రత్తగా వాడాలి.
    - బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే... వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
    - కరోనా సోకి ట్రీట్‌మెంట్ తీసుకునేటప్పుడు ముక్కు రంధ్రాలు మూసుకుపోతే... అది బ్లాక్ ఫంగస్ వల్ల కూడా కావచ్చని అనుకోవాలి.
    - వెంటనే ట్రీట్‌మెంట్ అందించడం ద్వారా రోగిని బతికించవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు