black fungus: బాబోయ్ బ్లాక్ ఫంగస్.. ఏపీలో 10పైనే బాధితులు.. ఎలా గుర్తించాలి? చికిత్స ఉందా?

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ ను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఇప్పటికై 10 మందికిపైగా వ్యక్తుల్లో ఫంగస్ లక్షణాలు గుర్తించారు. దీంతో ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. అయితే ఫంగస్ కేసులు పెరుగుతుండడంతో ఈ వ్యాధి ఎలా వస్తుంది? లక్షాణాలు ఏంటి? చికిత్స ఉందా అనే విషయాలు తెలుసుకునేందు జనం ఆసక్తి చూపిస్తున్నారు జనం.

 • Share this:
  ఓ వైపు కరోనా కాటు.. మరోవైపు బ్లాక్ ఫంగస్ పంజా.. దీంతో దేశం మొత్తం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా కరోనా వచ్చి తగ్గిపోయిన వారిలో... వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. నీరసంగా ఉండటంతో అలాంటి వారిని బ్లాక్ ఫంగస్ టార్గెట్ చేస్తోంది. ఇది పాత ఇన్ఫెక్షనే అయినప్పటికీ.. ఇండియాలో ఇప్పుడు దీని కేసులు ఎక్కువవుతున్నాయి. అంటువ్యాధి కాకపోయినా.. ఇది వచ్చిన వారికి 24 గంటల్లో ట్రీట్‌మెంట్ అందించకపోతే.. ప్రాణాలకే ప్రమాదం. దీంతో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తం అవుతున్నాయి. ఏపీ పైనా బ్లాక్ ఫంగస్ పడగ విప్పింది. దీంతో రాష్ట్రంలో కరోనాతో పాటు బ్లాక్‌ ఫంగస్‌ కేసుల సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 12 కేసులు నమోదైనట్లు సమాచారం..

  కొవిడ్‌ బాధితుల్లో ఎక్కువగా బ్లాక్‌ ఫంగస్‌ బయటపడుతోంది. ఎక్కువగా ఐసీయూలో ఉండడం, ఆక్సిజన్‌, స్టెరాయిడ్స్‌ వాడే వారిలో ఎక్కువగా బ్లాక్‌ ఫంగస్‌ బయటపడుతోందని వైద్యులు చెబుతున్నారు. మొదట శ్రీకాకుళం జిల్లాలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. తర్వాత గుంటూరులో 4, తూర్పుగోదావరి 3, ప్రకాశం 1, కర్నూలులో 2 కేసులు నమోదయ్యాయి. విశాఖ, పశ్చిమగోదావరిలోనూ లక్షణాలున్నవారిని ఇప్పటికే గుర్తించారు. మంత్రి సైతం బ్లాక్ ఫంగస్ గుర్తించే పనిలో ఉన్నామంటూ చెప్పుకొచ్చారు.. బ్లాక్ ఫంగస్ అనుమానాల నేపథ్యంలో పూర్తిగా అలర్ట్ అయ్యి ఉన్నామన్నారు..

  ఇదీ చదవండి: స్పీడ్ పెంచిన రోజా.. స్మాల్ స్క్రీన్ పై రీ ఎంట్రీ.. ఎప్పుడైనా ఇలా చూశారా?

  తాజాగా కర్నూలులో చికిత్స పొందుతున్న ఇద్దరు ఇప్పటికే మృతి చెందారు. వారిలో ఒకరు అనంతపురం, మరొకరు కడపకు చెందిన వారుగా తెలుస్తోంది. మరోవైపు ఆరోగ్యశాఖ ఇప్పటి వరకూ దీనిపై దృష్టిసారించ లేదనే విమర్శలు ఉన్నాయి. బ్లాక్‌ఫంగ్‌సపై ఇప్పటి వరకూ స్పష్టమైన ఆధారాలు లభ్యం కాలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ఏపీ నుంచి ఆరోగ్యశాఖ ప్రతినిధులు హాజరవుతున్నా, అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

  ఇదీ చదవండి: ఏపీలో ఒక్కొక్కరి ఖాతాలో 18,500.. వచ్చే నెల అమలయ్యే సంక్షేమ పథకాలు ఇవే... ఏ తేదీలో ఇస్తారు?

  మరోవైపు గుంటూరు జిల్లాలో నాలుగు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగు చూశాయి. ఈ నలుగురూ గత నెలలో కొవిడ్‌-19 బారిన పడి కోలుకున్న వారే. ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. విశాఖలోనూ బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. మధురవాడలోని సమీప వాంబేకాలనీ మల్లయ్యపాలెంకు చెందిన 35 ఏళ్ల మహిళకు దవడ భాగంలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించాయి. ఆరిలోవలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి అత్యవసర విభాగంలో ఆ మహిళ చేరారు.

  ఇదీ చదవండి:ఐ యామ్‌ సోనా... డోంట్ ఫియర్... మీకు ఏ విధంగా సాయపడగలను..

  పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇద్దరికి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి రాజమండ్రి, వైజాగ్‌ ఆస్పత్రుల్లో చూపించగా సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ తీయించారని, కన్ను, ముక్కు, మెదడుకు ఫంగస్‌ వ్యాపిస్తోందని వైద్యులు చెప్పినట్లు బాధితుడి భార్య తెలిపారు. అలాగే, పెదపాడు మండలం కలపర్రు గ్రామస్థుడికి బ్లాక్‌ ఫంగ్‌సగా అనుమానిస్తూ అవసరమైన ఇంజక్షన్లు, వైద్యానికి రిఫర్‌ చేశారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇద్దరు, కాకినాడలో ఒకరు బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడినట్టు జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి రమేష్ కిశోర్‌ తెలిపారు.

  బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలివీ...
  బ్లాక్‌ ఫంగ్‌సపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తోంది. ఫంగ్‌సకు సంబంధించి ఎలాంటి కొత్త విషయాలు బయటపడినా రాష్ట్రాలకు సమాచారం ఇస్తోంది. ఫంగస్‌ సోకిన వారికి ఎలాంటి అనారోగ్య లక్షణాలుంటాయో తెలియజేస్తూ ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ ఒక పోస్టర్‌ విడుదల చేసింది. కళ్లు, ముక్కు ఎరుపెక్కడంతోపాటు తీవ్రంగా నొప్పి చేస్తాయి. జ్వరం, తలనొప్పి, జలుబు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు రక్తపు వాంతులు, మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. ఇలాంటి లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది.

  బ్లాక్ ఫంగస్ రావడానికి కారణం ఏంటి?

  అయితే కోవిడ్ చికిత్సలో అధికంగా స్టెరాయిడ్ వాడటం, ఆక్సిజన్‌ అందించేప్పుడు స్టెరైల్‌ నీటికి బదులు తేమ అందించే పరికరం ద్వారా అందించడం బ్లాక్‌ ఫంగస్‌కు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. హ్యుమిడిఫయర్లేలో స్టెరైల్‌ నీటినే ఉపయోగించాలి. కానీ, ప్రైవేటు ఆసుపత్రులు, కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాలు, ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నవారు సాధారణ నల్లా నీటిని వాడేస్తున్నారు.

  బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఏంటి?
  ఎవరికైనా కళ్లు, ముక్కుచుట్టూ ఎర్రగా అవ్వడం లేదా నొప్పి రావడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి సరిగా ఆడకపోవడం, రక్తపు వాంతులు, మానసిక సమస్యలు వంటి లక్షణాలు ఉంటే.... నాలికపై నల్లటి మచ్చలు ఉంటే... వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను ఈ కేసులు భయపెడుతుండడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

  ట్రీట్​మెంట్​ ఉందా?
  బ్లాక్​ ఫంగస్​ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని సైంటిస్టులు చెబుతున్నారు. దీన్ని ముందే గుర్తించి యాంటీ ఫంగల్ ట్రీట్​మెంట్​ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చంటున్నారు. సమస్య తీవ్రంగా ఉన్న వారిలో యాఫోటెరిసన్​ ‘బీ’ వంటి యాంటీ ఫంగల్​ ఇంజెక్షన్లను ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ఈ మందుల కొరత ఉన్నందున చికిత్స కూడా పెద్ద సవాలుగా మారింది. దీనికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక రోగికి సాధారణంగా 21 రోజుల పాటు ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈ ఇంజెక్షన్​ కోసం రోజు సుమారు రూ. 9,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది వైద్య నిపుణులు చెబుతున్నారు.
  Published by:Nagesh Paina
  First published: