• Home
  • »
  • News
  • »
  • explained
  • »
  • BITCOIN EARN FREE BITCOINS BY WATCHING VIDEOS DOING SIMPLE TASKS TAKING PICTURES ETC HERE IS THE FULL DETAILS OF COINTIPLY WEBSITE NK

Bitcoin: వీడియోలు చూసి బిట్‌కాయిన్లు పొందండి.. అదిరే ఆఫర్

వీడియోలు చూసి బిట్‌కాయిన్లు పొందండి.. అదిరే ఆఫర్ (ప్రతీకాత్మక చిత్రం)

Bitcoin: వీడియోలు చూస్తూ బిట్‌కాయిన్లు సంపాదించే ఆఫర్ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. ఇది ఎలా సాధ్యమో, ఇందుకు ఏం చెయ్యాలో... ఉచితంగా ఇచ్చే ఈ సర్వీసు పూర్తి వివరాలు క్లారిటీగా తెలుసుకుందాం.

  • Share this:
    Bitcoin: క్రిప్టోకరెన్సీ లేదా డిజిటల్ కరెన్సీ‌ అని పిలుస్తున్న బిట్‌కాయిన్ విలువ ఇప్పుడు ఆకాశంలో ఉంది. మనకు ఒక డాలర్ కావాలంటే... మనం ఇప్పుడు 73.34 రూపాయలు చెల్లించాలి. అదే మనకు ఒక బిట్‌కాయిన్ కావాలంటే మనం 29,27,165 రూపాయలు చెల్లించాలి. అంతలా దాని ధర పెరిగింది. గత ఐదు రోజుల్లో దాని విలువ రూ.1,91,965 పెరిగింది. అందుకే ఇప్పుడు ప్రపంచ కుభేరులంతా బిట్‌కాయిన్లలో పెట్టుబడి పెడుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకుంటూ... బిట్‌కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీ ఎక్స్‌ఛేంజ్‌లు ప్రపంచమంతా పుట్టుకొచ్చాయి. ఇవి ఏంటంటే... బిట్‌కాయిన్ సహా... క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెట్టాలి అనుకునేవారిని ఇవి ప్రోత్సహిస్తున్నాయి. అందరూ లక్షల్లో పెట్టుబడి పెట్టలేరు కదా... అందువల్ల మినిమం రూ.100 నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టుకోమని కోరుతున్నాయి. ఇండియాలో అలాంటి వాటిలో WazirX (https://wazirx.com) పేరు బాగా వినిపిస్తోంది. సరే... మనం బిట్‌కాయిన్లు ఎలా ఫ్రీగా సంపాదించాలి అనేది అసలు టాపిక్. దాని సంగతి చూద్దాం.

    Cointiply:
    కాయింటిప్లై ఈ పేరు ఎప్పుడైనా విన్నారా... బహుశా వినకపోయి ఉండొచ్చు. దీని ద్వారానే మనం బిట్‌కాయిన్లను ఫ్రీగా సంపాదించవచ్చు. ఎలాగంటే... ఇందులో ఉచితంగా రిజిస్టర్ అవ్వాలి. అందుకోసం ఈ లింక్ https://cointiply.com లోకి వెళ్లి... మన ఈమెయిల్ ఐడీ ఇస్తే చాలు... రిజిస్టర్ అయినట్లే. ఈ వెబ్‌సైట్‌కి యాప్ కూడా ఉంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని కూడా రిజిస్టర్ అవ్వొచ్చు.

    కాయింటిప్లై వెబ్‌సైట్


    కాయింటిప్లై వెబ్‌సైట్‌లో చేయదగ్గ పనులు


    కాయింటిప్లై వెబ్‌సైట్ యాప్


    రిజిస్టర్ అయ్యాక ఏం చెయ్యాలి?
    కాయింటిప్లై చాలా పెద్ద వెబ్‌సైట్ ఇందులో.... ఫ్రీగా వీడియోలను చూడటం ద్వారా మనం డబ్బు సంపాదించవచ్చు. ఐతే... ఆ డబ్బును ఈ సైట్ మనకు రూపాయిల్లో లేదా డాలర్లలో ఇవ్వదు. బిట్ కాయిన్లలో ఇస్తుంది. వీడియోలు మాత్రమే కాదు... ఇంకా చాలా రకాలుగా సంపాదించవచ్చు. అంటే... చిన్న చిన్న టాస్కులను పూర్తి చేసి సంపాదించవచ్చు, అలాగే సర్వేల్లో పాల్గొని సంపాదించవచ్చు, కొన్ని రకాల ఆఫర్ల ద్వారా కూడా డిస్కౌంట్లు పొందవచ్చు. అలా ఎంతో కొంత సైడ్ మనీ సంపాదించేందుకు ఈ వెబ్‌సైట్ ఉపయోగపడుతోంది చాలా మందికి.




    ఇది కూడా చదవండి: Pi Network: పై క్రిప్టోకరెన్సీ... ఫ్రీగా పై కాయిన్లు సంపాదించాలా... ఇదిగో బంపర్ ఆఫర్

    ఎన్ని బిట్‌కాయిన్లు సంపాదించవచ్చు?
    ఇప్పుడు బిట్ కాయిన్ రేటు చాలా పెరిగిపోయింది కాబట్టి... మనం ఒక్క బిట్ కాయిన్ సంపాదించాలన్నా కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందువల్ల కొన్ని వీడియోలు చూడగానే బిట్‌కాయిన్ ఇవ్వడం కుదరదు కాబట్టి... ఈ సైట్... Satoshis అనే పేరుతో రివార్డులు ఇస్తోంది. ఎవరైనా 10 లక్షల శాటోషీలను సంపాదిస్తే... వాటితో ఒక బిట్ కాయిన్ పొందవచ్చు. ఇందుకు కూడా కాస్త టైమ్ పడుతుంది. కాకపోతే... బిట్‌కాయిన్ సంపాదించేందుకు ఫ్రీగా, నిజమైన, మోసపూరితం కాని మార్గం ఏదైనా ఉందా... అంటే అది ఇది అని కచ్చితంగా చెప్పుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published: