హోమ్ /వార్తలు /Explained /

Andhra Police: ఏపీలో బలహీనపడ్డ మావో ఉద్యమం.. ఏవోబీపై ఆంధ్రా పోలీసుల ఉక్కు పాదం

Andhra Police: ఏపీలో బలహీనపడ్డ మావో ఉద్యమం.. ఏవోబీపై ఆంధ్రా పోలీసుల ఉక్కు పాదం

మావోలపై ఆంధ్రా పోలీసుల పంజా

మావోలపై ఆంధ్రా పోలీసుల పంజా

ఏఓబీ పై ఆంద్రా పోలీసులు ఉక్కు పాదం మోపారా..? వరుస ఎన్ కౌంటర్లు.. లొంగుబాట్లు దేనికి సంకేతం.. పోలీసులపై ప్రతీకారం తీర్చుకునేందుకు మావోలు వేసే వ్యూహాలన్నీ ఫెయిల్ అవుతున్నాయా..? తాజాగా ఎన్ కౌంటర్ తరువాత మావోల పరిస్థితి ఏంటి..?

ఆనంద్ మోహన్, విశాఖపట్నం, న్యూస్ 18

ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడాలి అంటే మావోయిస్టుల భయపడే పరిస్థితి నెలకొందా..? ముఖ్యంగా విశాఖ ఏజన్సీలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా తగ్గాయా? వరుస ఎన్ కౌంటర్ లు, లోంగుబాటులతో ఏవోబిలో మావోయిస్టు ఉద్యమం బలహీన పడుతోందా..? మావోయిస్టులకు ఆంధ్రా పోలీసులు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదా..? దండకారణ్యాన్ని సైతం జల్లెడ పడుతున్నారా..? తాజా పరిస్థితులు చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. చిన్న అనుమానం వచ్చినా క్షణాల్లో పోలీసులు వాలిపోతున్నారు.. మావో కదలిక శబ్ధం వినిపిస్తే చాలు పంజా విసురుతున్నారు. ఇటీవల వరుస ఎన్ కౌంటర్లు.. లొంగుబాట్లే అందుకు నిదర్శనం. పోలీసుల వ్యూహాన్ని దెబ్బకొట్టేందుకు మావోల ప్లాన్ లు ఒక్కటి కూడా పని చేయడం లేదు. దీంతో ఉద్యమాన్ని పునర్మించేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు ముమ్మరం చెస్తున్నారు. 2019 సెప్టెంబర్ 22వ తేదీన విశాఖ ఏజన్సీలోని గుమ్మరేవుల దగ్గర ఎన్ కౌంటర్ జరిగింది.. ఈ ఎన్ కౌంటర్ లో 5 మావోయిస్టులు మృతి చెందారు. తరువాత దాదాపు ఏడాదిన్నరగా ఏజన్సీలో అంత పెద్ద ఘటనా ఏదీ జరుగలేదు.

ఇదే సమయంలో గుమ్మ రేవుల ఎన్ కౌంటర్ కు ప్రతీకారంగా మావోయిస్టులు పోలీసుల ఇన్ఫార్మర్స్ పేరుతో వరుస హత్యలకు పాల్పడ్డారు. ముఖ్యంగా చింతపల్లి మండలం వీరవరం గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు పోలీస్ ఇన్ ఫార్మర్ పేరిట హతమార్చారు. ఇంతే కాకుండా జీ మాడుగుల మండలంలో కూడా ఒక గిరిజనుడిని ఇన్ఫార్మర్ నేపంతో హత్య చెశారు మావోయిస్టులు.  గతంలో టీడీపీ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాల హత్యానంతరం ఏజెన్సీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఎర్పాట్లు చెశారు. దుంబ్రిగూడ హెడ్ క్వార్టర్ సమీపంలో ఇద్దరు తాజా, మాజీ ఎమ్మెల్యేల హత్య జరగడం పోలీసుల ఈమేజ్ ను దెబ్బతీసింది. మే నెలలో మావోయిస్టులు పోలీసులను, రాజకీయ నాయకులను హెచ్చరిస్తూ పలుమార్లు బ్యానర్లు, కరపత్రాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు.

ఇదీ చదవండి: విశాఖకు 3 వేల కోట్ల నిధులు.. త్వరలోనే రాజధాని తరలింపు.. సంకేతాలిచ్చిన ఎంపీ విజయసాయి

మే నెల 8వ తేదిన ఒడిష్షా - కొరాపుట్ జిల్లా పాడువా పోలీస్ స్టేషన్ పరిథిలో కిటుకబంటి గ్రామంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 5 మంది మావోయిస్టుల మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళ మావోయిస్టులు కాగా, ఇద్దరు పురుషులు ఉన్నారు. టీడీపీ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాల హత్య కేసులో కీలక మహిళ మావోయిస్టుగా స్వరూపగా గుర్తించారు. కిటుకబంటి గ్రామంలో జరిగిన ఎన్ కౌంటర్ ను వ్యతిరేకిస్తూ.. 25వ తేదిన బంద్ ను విజయవంతం చేయాలని ఎం.కె.వి.బి కమిటీ పిలుపునిచ్చింది. తరువాత టీడీపీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రవణ్ తో పాటు పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇతర టీడీపీ నేతలు కొర్రా బలరాం, మామిడి బాలయ్య, మహేష్ లను హెచ్చరిస్తూ... సిపిఐ మావోయిస్ట్ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో లేఖ విడుదల చేశారు.

ఇదీ చదవండి: విశాఖలో ఆ కీలక నేతకు త్వరలో కేబినెట్ బెర్త్? మరి మంత్రి అవంతి పరిస్థితి ఏంటి..?

ఇదే సమయంలో విశాఖ జిల్లా పోలిసులు ఎదుట మహిళా మావోయిస్ట్ నేత సాదన లోంగిపోయారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బలిమెల ఘటనతో పాటు పలు కేసులు సాదన పై ఉన్నాయి. సాదన పై 4 లక్షల రివార్డ్ ఉంది.. ఆంద్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్ట్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించిన సాదన అనారోగ్యకారణాల రిత్యా లోంగిపోయినట్లు తెలుస్తుంది.

ఇదీ చదవండి: ఆ టీడీపీ కీలక నేత ఇఫ్పుడెక్కడున్నారు? రాజకీయ వ్యూహమా..? అజ్ఞాతంలో ఉన్నారా..?

ప్రతి సంవత్సరం జులై 28 నుండి అగస్ట్ 3 వరకు మావోయిస్టు అమరవీరులు వారోత్సవాలు జరుగుతాయి. రెండెళ్లు క్రితం రామ్ గూడ ఎన్ కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు అమరులయ్యారు. దీంతో ఓడిశాలోని కటాప్ ఎరియాతో పాటు ఎన్ కౌంటర్ జరిగిన రామ్ గూడ ప్రాంతాంలో గత రెండెళ్లుగా అమర వీరులు వారోత్సవాలు మావోయిస్టు పార్టీ నిర్వహిస్తోంది. రామ్ గూడ ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత ఆర్ కే కుమారుడు మున్నా.. విశాఖ ఎజెన్సీ హుకుంపేట మండలానికి చెందిన మావోయిస్టు కీలకనేత బాకురు గణేష్ లతో పాటు అనేకమంది కీలకనేతలను మావోయిస్ట్ పార్టీ కోల్పోయింది. దీంతో అమరులైన మావో నేతలకు గతేడాది మావోయిస్ట్ పార్టీ స్తూపాలను కుడా నిర్మించింది.. వీటితో పాటు విశాఖ ఎజెన్సీలోని మారుమూల గ్రామాల్లో ఒడిశాలోను పెద్ద సంఖ్యలో మావోయిస్ట్ అమరవీరులు స్థూపాలు ఉన్నాయి వీటిన్నింటి దగ్గర ఎర్రజెండాలను ఎర్పాటు చేసి వారోత్సవాలు మావోలు జరుపుతారు..

ఇదీ చదవండి: విశాఖలో విరబూసిన బ్రహ్మ కమలం.. రాత్రి ప్రత్యేక పూజలు.. ఈ పుష్పం ప్రత్యేకత తెలుసా..?

ఇటీవల కాలంలో పోలీసులకు మావోలకు భీకర పోరు నడుస్తుంది.. ఆరేళ్ల కాలంలో మన్యంలోని మావోయిస్టులకు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు, లొంగుబాటులు, అరెస్టుల వంటి సంఘటనలు జరిగాయి. జిల్లా ఎస్పీ ఎదుట ఈ మూడు నెలల కాలంలో దాదాపు 20 మందికి పైగా మావోయిస్ట్ మిలిషియా సభ్యలు దళ సభ్యలు లోంగిపోతున్నారు. 2019 అక్టోబర్ నెలలో ఇన్పార్మర్ నెపంతో అనేక మంది మాజీ మిలీషియా సబ్యులను, మాజీ మావోయిస్టులను కూడా హత్య చెశారు మావోయిస్టులు.. నెల వ్యవధిలో మూడు హత్యలు చేసి పోలీసులకు సవాలు విసురుతున్నారు.. తాంబేలి లంబయ్య అలియాస్‌ దివుడు మావోయిస్టు పార్టీలో 12 ఏళ్లపాటు వివిధ స్థాయిల్లో పనిచేసి, చాలాకాలం అజ్ఞాతంలో గడిపాడు, అరెస్ట్‌ అయ్యి మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి చివరకు వారి చేతుల్లో బలయ్యాడు.

ఇదీ చదవండి: కుక్కు పిల్ల కొనివ్వలేదని యువకుడి మనస్థాపం.. చివరికి ఏం చేశాడో తెలుసా..?

విశాఖ ఏజన్సీలో మావోయిస్టులు టెక్నాలజీ వాడకంపై కూడా భారీగా దృష్టి పెట్టారని తెలుస్తుంది.. గతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో పోలీసులు ల్యాప్ టాప్ లు స్వాదీనం చెసుకున్న ఘటనలు ఉన్నాయి.. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమా హత్యలలో మావోయిస్టు నేత చలపతి హస్తం ఉందని ల్యాప్ ట్యాప్ చూసి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇటీవల కాలంలో ఏవోబీలోని పలు సీఆర్పీఎఫ్ క్యాంప్ లపై మావోయిస్టులు డ్రోన్ లను వినియోగించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మధ్య చత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ దృశ్యాలను కూడా మావోయిస్టులు డ్రోన్ ల సహాయంతో చిత్రికరించి మీడియాకు రిలీజ్ చెసినట్లుగా తెలుస్తుంది. 2019 జులై నెలలో మావోయిస్టులకు వ్యతిరేఖంగా మావోయిస్టుల చేతుల్లో హత్యకు గురైన వారి పేరుతో గిరిజనులు స్థూపాలను కూడా ఏర్పాటు చేశారు. కోరుకొండ వారంతపు సంతలో మావోలు చేతిలో మరణించిన గిరిజనులకు నివాళులు అర్పించేందుకు ఓ శాంతి స్థూపం వెలసింది..

ఇదీ చదవండి: విశాఖ నుంచి పాలనకు డేట్ ఫిక్స్.. సీఎం క్యాంప్ ఆఫీస్ ఇక్కడే.. రాజమార్గం ఇలా

గూడెం కొత్తవీధి మండలం లో మావోయిస్టు కమాండర్ కుంకుమ పూడి హరి ని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు.. చింతపల్లి మండలంలో బోనంగి నాగేశ్వరరావు అని సీనియర్ మావోయిస్టులు అరెస్ట్ చేశారు గూడెంకొత్తవీధి మండలం కొండ జర్త గ్రామ సమీపంలో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. మల్కనగిరి పోలీస్ స్టేషన్ ల సరిహద్దులో ఒక మావోయిస్టును ఎన్ కౌంటర్ చేశారు. మే 20వ తేదీన కొయ్యూరు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. తాజాగా బుధవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి ఇది కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Maoist, Maoist attack, Naxals

ఉత్తమ కథలు