Investment strategy: స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడి పెడుతున్నారా.. ఇలా చేస్తే అన్నీ లాభాలే..

గురువారం ఉదయం తన స్నేహితులతో కలిసి అక్కడకు వచ్చాడు. ఓ ఆటోలో రాజేశ్ ఇంటి ముందు టెంటు వేశాడు. ఓ పది కుర్చీలను కూడా తెచ్చుకున్నాడు. ఓ కుర్చీలో కూర్చుని నిరసన మొదలు పెట్టాడు. తన ఇంటి ముందే టెంటు వేసుకుని మరీ గణేష్ ఇలా నిరసనకు దిగడంతో రాజేశ్ కంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశాడు. (ప్రతీకాత్మక చిత్రం)

ఈ ఫార్ములా ప్రకారం, పెట్టుబడిదారులు తమ మొత్తం డబ్బును 50% ఈక్విటీ మార్కెట్లలో, మరో 50% డెట్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడులు ఎప్పుడూ బ్యాలెన్స్​గా ఉండేలా చూసుకోవాలి.

 • Share this:
  సాధారణంగా ఉద్యోగుల సంపాదన ఏడాదికి మహా అయితే 10 నుంచి 50 శాతం వరకు పెరుగుతుంది. కానీ, మార్కెట్​లో ధరలు మాత్రం అలా కాదు. ఏటా వీటి ధరలు రెట్టింపవుతుంటాయి. దీంతో ద్రవ్యోల్భణం ప్రభావం కుటుంబంపై పడుతుంది. మన సంపాదన దానికి తగ్గట్లు పెరగకపోవడంతో కొనుగోలు శక్తి తగ్గుతుంది. అప్పుడు మనం చేయాల్సిందల్లా మన సంపాదనకు తగ్గట్లు ఖర్చు చేస్తూ.. స్టాక్ మార్కెట్లలో కొంతమేర తెలివైన పెట్టుబడి పెట్టడమే. అయితే, స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మీ ఆర్థిక లక్ష్యాలు, మార్కెట్​ స్థితిగతులను అంచనా వేస్తూ పెట్టుబడులు పెట్టాలి. ప్రస్తుతం స్టాక్​ మార్కెట్ దూకుడు మీద ఉందనే ఉద్దేశ్యంతో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే మొదటికే మోసం రావొచ్చు. అందువల్ల, వేగంగా నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ఇన్వెస్ట్​ చేయడమే మంచిది. ఎందుకంటే స్టాక్​ మార్కెట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవి పూర్తి అస్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి. పెట్టుబడికి లాభమా? నష్టమా? అనేది ఖచ్చితంగా అంచనా వేయలేం. అందువల్ల, సురక్షిత మార్గంలో పెట్టుబడి పెట్టేందుకు ఆల్-టైమ్ హైస్, ఆల్-టైమ్ లోస్​, బుల్​ రన్స్​, బేర్​ రన్స్​ వంటి వాటిని క్షుణ్నంగా పరిశీలించాలి. దీనికి గాను అమెరికన్ ఆర్థికవేత్త బెంజమిన్ గ్రాహం వెల్లడించిన 50/50 పెట్టుబడి వ్యూహాన్ని అనుసరించాలి. ఇంతకీ 50/50 పెట్టుబడి వ్యూహం అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీనితో లాభాలేంటి? వంటి విషయాలను తెలుసుకుందాం.

  50/50 పెట్టుబడి వ్యూహం
  ఈ ఫార్ములా ప్రకారం, పెట్టుబడిదారులు తమ మొత్తం డబ్బును 50% ఈక్విటీ మార్కెట్లలో, మరో 50% డెట్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడులు ఎప్పుడూ బ్యాలెన్స్​గా ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు, ఒక పెట్టుబడిదారుడు స్టాక్ మార్కెట్లో మొత్తం రూ.1,000 ఇన్వెస్ట్​ చేయాలనుకుంటే, అతడు లేదా ఆమె రూ .500 డెట్​ ఫండ్​లో, రూ .500 ఈక్విటీ ఫండ్​లో పెట్టుబడి పెట్టాలి. కొంత కాలం తర్వాత -మీ డెట్​ ఫండ్ పెట్టుబడిపై రూ.10 లాభం వస్తే, అది రూ.510లకు పెరుగుతుంది. అదే, ఈక్విటీలో రూ.30 లాభం వస్తే రూ.530 అవుతుంది. ఇప్పుడు, మీ వద్ద మొత్తం పెట్టుబడి పెట్టేందుకు రూ .1040 ఉంటుంది. ఈ మొత్తాన్ని 50:50 ఈక్విటీ నిష్పత్తిలో బ్యాలెన్స్​ చేయడానికి, మీ ఈక్విటీ నుంచి రూ .10ను విత్​డ్రా చేసి దాన్ని డెట్​ ఫండ్​లోకి మళ్లించండి. తద్వారా, మరలా 50/50 పెట్టుబడి వ్యూహాన్ని అనుసరించండి. ఒకవేళ మీ పెట్టుబడిపై నష్టం వస్తే అనగా మీరు రూ.500ను ఈక్విటీలో పెట్టుబడి పెట్టగా -4% నష్టం వస్తే.. ఈక్విటీలోని మీ మొత్తం మార్కెట్ విలువ రూ. 480 కు చేరుకుంటుంది. ఈ సందర్భంలో, మీ డెట్​ ఫండ్​ నుండి రూ .15ను విత్​డ్రా చేసుకొని ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలి. తద్వారా అధిక నష్టం రాకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది ఈక్విటీ, డెట్​ ఫండ్​ రెండింటినీ రూ.495లకు చేస్తుంది. ఎక్కువ నష్ట భయం లేకుండా ఉండేందుకు, మంచి లాభాలను ఆర్జించేందుకు ఈ విధానం చక్కగా పనిచేస్తుంది. అయితే, 50/50 పెట్టుబడి వ్యూహంతో మార్కెట్ నుండి ఉత్తమ రాబడిని పొందటానికి పెట్టుబడిదారుడు ఎప్పటికప్పుడు తమ పోర్ట్‌ఫోలియోను సమీక్షించడం చాలా అవసరం.

  50/50 పెట్టుబడి వ్యూహం ప్రయోజనాలు

  50/50 పెట్టుబడి వ్యూహంతో ప్రధానంగా 3 ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం.

  1. మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియో ఎల్లప్పుడూ బ్యాలెన్స్​గా ఉంటుంది. మీ 50% పెట్టుబడి డెట్​ మార్కెట్‌లో ఉంటే మరో 50% ఈక్విటీ మార్కెట్లో ఉంటుంది. ఒక దాంట్లో నష్టం వచ్చినా, మరో దాంటో వచ్చిన లాభంతో దాన్ని పూడ్చుకోవచ్చు.
  2. ఒకవేళ, మార్కెట్​ స్థితిగతులు గరిష్ట స్థాయిలో ఉండి ఈక్విటీ, డెట్​ ఫండ్లు రెండిట్లో మీకు లాభం వస్తే.. మీరు ఎక్కువ రాబడిని పొందవచ్చు. ఈ వ్యూహం మీకు లాభాలను సంపాదించడానికి పెద్ద అవకాశాన్ని కల్పిస్తుంది. ఒకవేళ మార్కెట్ భారీగా పడిపోయినా సరే భారీ నష్టానికి లోనవ్వకుండా మీ డబ్బును కాపాడుతుంది.
  3. ఈక్విటీ మార్కెట్ పతనావస్థలో ఉంటే 50:50 పెట్టుబడి వ్యూహంతో, మీ డబ్బును ఎప్పుడైనా డెట్​ ఫండ్​ నుండి విత్​డ్రా చేసుకొని ఈక్విటీ ఫండ్​కి మళ్లించవచ్చు. ఈ వ్యూహాన్ని ఉపయోగించడం ద్వారా మీరు ఈక్విటీని తక్కువ స్థాయి వద్ద కొనుగోలు చేసి, భవిష్యత్తులో పెద్ద అధిక లాభాలకు అమ్మవచ్చు. ముఖ్యంగా, స్టాక్​ మార్కెట్‌లో కొత్తగా పెట్టుబడి పెట్టేవారు, అనుభవం లేనివారు 50:50 డెట్ విధానంలో పెట్టుబడి పెట్టడం చాలా శ్రేయస్కరం అని మార్కెట్​ నిపుణులు చెబుతున్నారు.
  Published by:Krishna Adithya
  First published: