హోమ్ /వార్తలు /Explained /

Andhra Pradesh: విశాఖ మేయర్ గా మహిళ? ఎవరో తెలుసా? ఆరుగురు లేదా నలుగురు డిప్యూటీ మేయర్లు?

Andhra Pradesh: విశాఖ మేయర్ గా మహిళ? ఎవరో తెలుసా? ఆరుగురు లేదా నలుగురు డిప్యూటీ మేయర్లు?

విశాఖ మేయర్ గా మహిళ?

విశాఖ మేయర్ గా మహిళ?

గ్రేటర్ విశాఖ మేయర్ గా మహిళకే అవకాశం ఇస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పేరును కూడా అధిష్టానం ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన మహిళను మేయర్ గా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే నలుగురు లేదా ఆరుగురు డిప్యూటీ మేయర్ల ఫార్ములాను తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ ను ప్రత్యేకంగా చూస్తోంది. అందుకే మేయర్ ఎంపికపై ఆచి తూచి అడుగులు వేస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పదవిని ఎవరికి ఇవ్వాలి అన్నదానిపై సుదీర్ఘ కసరత్తు చేసినట్టు సమాచారం. ఇప్పటికే దీనిపై అధినేత జగన్ తో ఎంపీ విజయసాయి రెడ్డి చర్చించినట్టు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న వార్డులు.. వైసీపీ తరపున గెలచిన అభ్యర్థుల క్రేజ్ అన్నింటిపైనా జగన్ ఆరా తీసినట్టు వైసీపీ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

సీఎం జగన్ తో భేటీ తరువాత రాత్రికి రాత్రే విశాఖకు తిరిగిన వచ్చిన విజయసాయిరెడ్డి. బుధవారం మధ్యాహ్నంలోపే ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని భావిస్తున్నారు. అప్పుడే 18వ తేదీన మేయర్ ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. మేయర్ పీఠానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ దే తుది నిర్ణయమని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా విశాఖ తూర్పు నియోజకవర్దానికి చెందిన వారికే మేయర్ పీఠం అన్నది 100 శాతం పక్కా అని తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే వెలగపూడి.. వైసీపీ పెద్దలకు ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల విషయానికి వస్తే దక్షిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇప్పటికే జగన్ కు జై కొట్టారు. ఉత్తర ఎమ్మెల్యే గంటా అసలు పార్టీలో ఉన్నారా? లేదా అన్నది ఎవ్వరికీ అంతుచిక్కని ప్రశ్న.. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సైతం అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. ప్రస్తుతం టీడీపీ తరపున పోరాడుతున్నది వెలగపూడి మాత్రమే.. అతడికి కేడర్ నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో తూర్పు నుంచి మేయర్ అభ్యర్థి ఉంటే ఎమ్మెల్యే వెలగపూడికి చెక్ చెప్పవచ్చని విశాఖ స్థానిక వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన యాదవ సామాజిక మహిళకు కీలకమైన మేయర్ పీఠాన్ని కేటాయిస్తారని విశ్వసనీయ సమాచారం.

కార్పొరేషన్ ఎన్నికల్లో 11వ వార్డు నుంచి 4,850 ఓట్ల అత్యధిక మెజార్టీతో గొలగాని హరి వెంకట కుమారి గెలుపొందారు. ప్రధానంగా ఆమె పేరునే మేయర్ పదవికి పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె బీఎస్సీ బీఈడీ పూర్తి చేసి టీచర్ గా సేవలందిస్తున్నారు. ఇప్పటికే అధిష్టానం వారి కుటుంబానికి సంబంధించిన సమాచారం కూడా సేకరించినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు అదే సమాజిక వర్గానికి చెందిన అక్కరమాని రోహిణి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక 59వ వార్డు పి. పూర్ణశ్రీ పేర్లపై అధిష్టానం కసరత్తు చేస్తునట్టు తెలుస్తోంది. అయితే మొన్నటి వరకు వంశీ శ్రీనివాస్ పేరు ప్రచారంలో ఉండేది. అయితే ఇప్పటికే ఆయనకు ఆశలు పెట్టుకోవద్దని చెప్పినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఇదీ చదవండి: విశాఖలో సరికొత్త ఫార్ములకి సీఎం జగన్ శ్రీకారం! ఎందుకో తెలుసా?

స్థానిక నేతల అభిప్రాయ సేకరణలోనూ అధికంగా గొలగాని హరివెంకట కుమారి పేరునే సూచించినట్టు సమాచారం. ఏదీ ఏమైనా విశాఖ తూర్పు నియోజవకర్గానికే యేయర్ పదవిని కేటాయించడం ఖాయమైనట్టే చెప్పాలి. అందులోను యాదవ సమాజిక వర్గానికే పెద్ద పీట వేయనున్నారు. మేయర్ పదవికి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాపు సమాజిక వర్గంలో ఎక్కువమంది డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఓవరాల్ గా చూస్తే యాదవ, కాపు సామాజిక వర్గాలకు సమానంగా వార్డులు లభించాయి. దీంతో ఆ రెండు సమాజీక వర్గాలకు సమన్యాయం చేయాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీ బలపడాలి అన్న ఈ రెండు వర్గాల మద్దతు చాలా అవసరమని అధిష్టానం గుర్తించింది. అందుకే డిప్యూటీ మేయర్ రేసులో యాదవ సమాజిక వర్గానికి జియ్యాని శ్రీధర్, బాణాల శ్రీనివాసుతో పాటు మమ్మన దేవుడు పేరును కూడా పరిశీలిస్తునట్టు సమాచారం.

మరోవైపు తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో 30 స్థానాలు లభించాయి. దీంతో ఆ పార్టీ కౌన్సిల్ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. సీనియర్ కార్పరేటర్లు టీడీపీలో ఉండడంతో కౌన్సిల్ రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీ ప్లోర్ లీడర్ గా పీలా శ్రీనివాసరావును ఎంపిక చేసుకున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Visakha, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు