Bachpan ka pyara car gift: అంతా ఫేక్.. ‘‘బచ్​పన్​ కా ప్యారా’’ బాలుడికి కారు గిఫ్టు ఇవ్వలేదు.. అసలు ఏం జరిగిందంటే..

బచ్​పన్​కా ప్యారా బాయ్​​​ కారు తీసుకున్నట్లు సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన చిత్రం

ఇటీవల సోషల్​ మీడియాలో ట్రెండ్​ అయిన బచ్​పన్​ కా ప్యారా బాలుడు కారు ముందు నిలబడి ఉన్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. నెటిజన్లు అతడికి ఎంజీ హెక్టర్ ఎకే మోరిస్ గ్యారేజ్ మోటార్ కారును బహుమతిగా ఇచ్చారని భావించారు. విషయం ఏంటంటే బాలుడికి కారు ఇవ్వలేదు. ఆ కార్యక్రమానికి వచ్చినందుకు రూ. 21,000 ఇచ్చారు.

  • Share this:


    సోషల్‌ మీడియా.. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేస్తోంది. మారుమూలల్లోని టాలెంట్ చూపించుకోవటానికి వేదికగా మారింది. ఎవరూ అవకాశం ఇవ్వక్కర్లా. ఉన్నది ఒకటే దారి. అదే సోషల్ మీడియా. అలా ఓ పిల్లాడు సరదాగా పాడిన పాటతో నార్త్ ఇండియాలో ఫేమస్ అయిపోయాడు. ‘ జానే మేరీ జానేమన్‌.. బస్‌పన్‌ క్యా ప్యార్‌ మేరా..’ అంటూ ఛత్తీస్ గడ్ పిల్లాడు పాడిన పాటకు సీఎం కూడా ఫిదా అయిపోయాడు. స్వయంగా పిలిపించుకుని ఘనంగా సన్మానించారు సీఎం భూపేష్ బాఘేల్. ఆ పిల్లాడి పేరు సహదేవ్ డిర్దో. వయస్సు 14 ఏళ్లు. ఇటీవల ఆ బాలుడు కారు ముందు నిలబడి ఉన్న వీడియో ఒకటి సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టింది. నెటిజన్లు అతడికి ఎంజీ హెక్టర్ ఎకే మోరిస్ గ్యారేజ్ మోటార్ కారును బహుమతిగా ఇచ్చారని భావించారు. విషయం ఏంటంటే బాలుడికి కారు ఇవ్వలేదు. ఆ కార్యక్రమానికి వచ్చినందుకు రూ. 21,000 ఇచ్చారు. MG కంపెనీ ప్రతినిధి ఓ మీడియా ఛానల్​తో మాట్లాడుతూ.. తన కంపెనీ సహదేవ్‌కు కారును అందించలేదని, బదులుగా అతనికి రూ. 21,000 బహుమతిగా ఇచ్చామని చెప్పారు. ఇదే విషయాన్ని బాలుడు సంబంధీకులు కూడా ధ్రవీకరించారు. అయితే ఆ బాలుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. అవేంటంటే..

    రెండేళ్ల తర్వాత వైరల్​..

    కమలేష్‌ బారోత్‌ అనే ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ సింగర్‌ కమ్‌ ఆర్టిస్ట్‌ కంపోజ్‌ చేసిన ‘బచ్‌పన్‌ కా ప్యార్‌’ సాంగ్‌ 2019లో యూట్యూబ్‌లో రిలీజ్‌ అయ్యింది. ఉత్తరాదిలో రూరల్ జనాలకు బాగా కనెక్ట్‌ అయ్యింది. ఆ టైంలో ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా చింద్‌ఘడ్‌కు చెందిన సహదేవ్ డిర్దో తన టీచర్‌ కోసం ‘బచ్‌(స్‌)పన్‌ క్యా ప్యార్‌’ అంటూ స్కూల్​లో పాడాడు. అప్పటికే సహదేవ్ 7th క్లాస్ చదువుతున్నాడు. ఆ పాట ఆ టీచర్‌ను బాగా ఆకట్టుకుంది. ఆ పిల్లాడి గొంతుకు ఫిదా అయిపోయారు. దాన్ని ఫోన్‌లో రికార్డు చేసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేసారు. కానీ, అది వైరల్‌ అవ్వడానికి రెండేళ్లు పట్టింది. సహదేవ్‌ డిర్దో నార్త్‌ ఇండియాలో ఇప్పుడు ఇంటర్నెట్‌ స్టార్‌. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ పిల్లాడి పాటకు రీమిక్స్‌తోడై సోషల్‌ మీడియాని ఊపేస్తోంది. టీవీ షోల దగ్గరి నుంచి ఫిల్మ్‌ సెలబబ్రిటీల దాకా ఈ చిన్నారి గొంతుకు ఫిదా అయిపోతున్నారు. బుల్లితెర రియాలిటీ షోలు సైతం ఈ పాటను తెగ వాడేసుకుంటున్నాయి.రెండేళ్ల క్రితం పాడిన ఆ పాట వైరల్‌ అవ్వటం కూడా ఓ వైరల్ అనే చెప్పాలి.

    ఆ పాట అలా అలా ర్యాపర్‌ బాద్‌షా చెవిలో పడింది. అంతే దాని రూపే మారిపోయింది. దాన్నీ రీమిక్స్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలాడు. అంతే ఇక చూసుకోవాలి. వైరల్ మామూలుగా అవ్వలేదు. ఎవరి నోట విన్నా ఇదే పాట. దీంతో ఆ చక్కటి గొంతు ఎవరిదా? అని తెలుసుకోవటం జనాలు బిజీ అయిపోయారు. చివరికి మీడియా హౌజ్‌ల చొరవతో ఎట్టకేలకు చిన్నారి సహదేవ్‌ వెలుగులోకి వచ్చాడు. సరదాగా టీచర్ కోసం పాడిన పాటతో సహదేవ్ ఇప్పుడు నార్త్ ఇండియాని షేక్ చేస్తున్నాడు. 'ఇండియన్ ఐడల్'కి పిల్లాడిని ఆహ్వానించారు, బాద్షా తన పాఠని రీమిక్స్​ చేశాడు. ర్యాపర్ బాద్షా తన కొత్త పాటలో సహదేవ్​ 'బచ్‌పాన్ కా ప్యార్' ముఖచిత్రంతో ఇప్పటికే ప్రమోషన్​ ప్రారంభించాడు. ఓటర్ ప్రోస్ దర్శకత్వం వహించారు, ఈ పాటలో సహదేవ్, బాద్షా, గాయకుడు ఆస్తా గిల్​, సంగీతకారుడు రికో ఉన్నారు. ఇదన్న మాట బచ్​పాన్​ కా ప్యారా పాట పిల్లాడి కథ.
    Published by:Prabhakar Vaddi
    First published: