Azadi ka Amruth Mahotsav: పండుగలు, ముఖ్యమైన వేడుకల్ని ఘనంగా చెయ్యడంలో తెలంగాణ ప్రభుత్వానికి తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటికే బతుకమ్మ సహా చాలా పండుగల్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీఆర్ఎస్ సర్కార్... మరో ఘనమైన పండుగను అత్యంత ఘనంగా నిర్వహించాలని డిసైడైంది. అదే 75వ స్వాతంత్ర్య దినోత్సవం. మీకు తెలుసుగా... మనకు స్వాతంత్ర్యం వచ్చి... ఈ సంవత్సరం ఆగస్ట్ 15 నాటికి 74 ఏళ్లు పూర్తై... 75వ సంవత్సరంలోకి అడుగుపెడతాం. ఆ సందర్భంగా... తెలంగాణ ప్రభుత్వం... మొత్తం 75 ముఖ్యమైన ప్రదేశాల్లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తామని ప్రకటించింది. వాటిలో ఓ కీలక లొకేషన్... సంజీవయ్య పార్క్. తెలంగాణలోనే అతి పెద్ద జెండా అక్కడే ఉంది. ఈ వేడుకలను ఆజాదీ కా అమృత మహోత్సవం అని పిలుస్తోంది.
జెండా ఎగరేసి సరిపెట్టేయకుండా... ఎస్సే రైటింగ్, డిబేట్ కాంపిటీషన్లు, ఎలక్యూషన్లు, డ్రాయింగ్ కాంపిటీషన్లు, పోయిట్రీ సెషన్స్ వంటి కార్యక్రమాలన్నీ నిర్వహించేలా రెడీ అవ్వమని అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) కోరారు.
వేడుకలు ప్రారంభమయ్యే తేదీ?
మార్చి 12 అంటే... ఈ శుక్రవారం నుంచి ఆజాదీ కా అమృత మహోత్సవం మొదలవుతుంది.
వేడుకలు ఎప్పటివరకూ కొనసాగుతాయి?
ఈ సంవత్సరం ఆగస్ట్ 15 వరకూ వేడుకలు కొనసాగుతాయి.
ప్రధాని మోదీ... కేసీఆర్‌కి ఏం చెప్పారు?
మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌తో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. వేడుకలు అద్భుతంగా చేద్దామన్నారు.
75 వారాల టార్గెట్ ఎందుకు?
ప్రజల్లో దేశ భక్తిని నింపేందుకు 75 వారాలపాటూ కార్యక్రమాలు చేద్దామని ప్రధాని మోదీ... కేసీఆర్‌ని కోరారు. మార్చి 12 నుంచి ఆగస్ట్ 15కి 75 వారాలు పూర్తవుతాయి.
వేడుకలకు ఎంత డబ్బు కేటాయిస్తున్నారు?
సీఎం కేసీఆర్ ఈ వేడుకల కోసం రూ.25 కోట్లు కేటాయించారు.
మార్చి 12న ఎలా మొదలుపెడతారు?
హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో మార్చి 12న ప్రారంభ ఫంక్షన్ ఉంటుంది. అందులో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
మార్చి 12న అది ఒక్కటే ఉంటుందా?
కాదు... మరొకటి కూడా ఉంటుంది. అది వరంగల్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో అదే రోజు ఉంటుంది.
మార్చి 12న సీఎం ఏం చేస్తారు?
జెండా వందనం చేస్తారు. పోలీసుల మార్చ్ ఫాస్ట్ ఉంటుంది. గాల్లోకి బెలూన్లు వదులుతారు. కరోనా రూల్స్ పాటిస్తారు.
ప్రధాని మోదీ మీటింగ్ తర్వాత సీఎం కేసీఆర్ ఏం చేశారు?
ప్రధాని ఇలా హింట్ ఇవ్వగానే... ఇక మాకు వదిలేయండి... మేం చూసుకుంటాంగా అంటూ... కేసీఆర్ వెంటనే ఉన్నతస్తాయి సమీక్షా సమావేశం పెట్టేశారు. అధికారులకు అన్నీ చెప్పేసి... రెడీ అవ్వాలని ఆదేశించేశారు.
ఏదైనా కమిటీ వేశారా?
వేశారు. ఓ కమిటీ వేశారు. అందులో వివిధ విభాగాల అధికారులు ఉన్నారు. సాంస్కృతిక శాఖ సలహాదారు కేవీ రమణాచారి దానికి హెడ్ గా ఉన్నారు.
తెలంగాణ మాత్రమేనా?
కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటివి చెయ్యాలని కేంద్రం కోరుతోంది. మిగతా రాష్ట్రాలూ రెడీ అవుతాయి. ముందుగా తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది.
మరి కేంద్రం ఏమీ చెయ్యట్లేదా?
చేస్తోంది. రకరకాల కార్యక్రమాలతోపాటూ... ఎగ్జిబిషన్లు పెట్టాలనుకుంది, ర్యాలీలు, టూరిజం కార్యక్రమాలు కూడా జరపాలనుకుంటోంది. మార్చి 12న గుజరాత్లో వీటికి శ్రీకారం చుట్టబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
మార్చి 12కి ఏదైనా ప్రత్యేకత ఉందా?
ఉంది. దండి సత్యాగ్రహం జరిగి... ఆ రోజుకు 91 సంవత్సరాలు అవుతుంది. ఇక ఆ రోజు నుంచి స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్, సుభాష్ చంద్ర బోస్ పటేల్ వంటి వారికి సంబంధించిన ఎగ్జిబిషన్లు కూడా ఉంటాయి. వీటిని దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి... టీవీల్లో ప్రసారం చేస్తారు.
ఇది కూడా చదవండి:Shivaratri 2021: పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఏయే పూలతో పూజలు చెయ్యాలి...
దండి సత్యాగ్రహం అంటే?
బ్రిటిష్ పాలకులు ఉప్పుపై పన్ను వేసినందుకు నిరసనగా... 1930లో మహాత్మాగాంధీ... దండి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అది ఏప్రిల్ 5న ముగిసింది. ఆ తర్వాత దేశ ప్రజల్లో స్వాతంత్ర పోరాట పటిమ మరింత పెరిగింది. అందుకే... కేంద్రం మార్చి 12 నుంచి 25 రోజుల పాటూ కొన్ని వేడుకలు జరపబోతోంది. ఇప్పుడు రాష్ట్రాల సీఎస్‌లు తమ రాష్ట్రంలోని మూడు చారిత్రక ప్రదేశాల్ని గుర్తించి కేంద్రానికి చెప్పాలి. అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా మొత్తం 75 కేంద్రాల్ని కేంద్రం ఎంపిక చేస్తుంది. యూత్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్తో కలిసి యూత్ క్లబ్బులు, నేషనల్ సర్వీస్ స్కీమ్, నేషనల్ కాడెట్ కార్ప్స్ (NCC) వాలంటీర్లు సైకిల్ ర్యాలీలు చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే... 75వ స్వాతంత్ర్య దినోత్సవం... ఇదివరకూ ఎప్పుడూ లేనంత గ్రాండ్‌గా జరగనుంది.