హోమ్ /వార్తలు /Explained /

Adverse Climate Events: ఆంధ్రప్రదేశ్​తో పాటు ఈ రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తుల ముప్పు ఎక్కువే!..

Adverse Climate Events: ఆంధ్రప్రదేశ్​తో పాటు ఈ రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తుల ముప్పు ఎక్కువే!..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని పలు రాష్ట్రాలపై ఇటీవలి కాలంలో పకృతి విపత్తులు ముప్పేట దాడి చేస్తున్నాయి. వరుసగా ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రభావం కొన్ని రాష్ట్రాలపై అధికంగా ఉంది. వరదలు, తుఫాన్లు, కరువు వంటి ప్రకృతి వైపరిత్యాలు తలెత్తే ప్రమాదం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉందని ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ నివేదిక పేర్కొంది.

ఇంకా చదవండి ...

దేశంలోని పలు రాష్ట్రాలపై ఇటీవలి కాలంలో పకృతి విపత్తులు ముప్పేట దాడి చేస్తున్నాయి. వరుసగా ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రభావం కొన్ని రాష్ట్రాలపై అధికంగా ఉంది. వరదలు, తుఫాన్లు, కరువు వంటి ప్రకృతి వైపరిత్యాలు తలెత్తే ప్రమాదం ఆంధ్రప్రదేశ్​లో ఎక్కువగా ఉందని ఢిల్లీకి చెందిన థింక్​ ట్యాంక్​ నివేదిక పేర్కొంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్​ను వణికించిన గులాబ్​ తుఫాన్​ ఇందుకు ఉదాహరణగా నివేదిక పేర్కొంది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్​ పైనే కాదు అస్సాం, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలపై కూడా ఉండనుందని నివేదిక స్పష్టం చేసింది. తుఫాన్లు, వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల వల్ల దెబ్బతినే ముప్పు ఈ 5 రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉందని తెలిపింది ఈ మేరకు కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (CEEW) అనే సంస్థ ‘క్లైమేట్ వల్నరబిలిటీ ఇండెక్స్’ను విడుదల చేసింది. కాగా, దేశంలోని 80 శాతం జనాభా వాతావరణ ప్రమాదాలకు గురయ్యే జిల్లాల్లో నివసిస్తున్నారని నివేదిక అభిప్రాయపడింది. భారతదేశంలోని 463 జిల్లాలు తీవ్రమైన వరదలు, కరువులు, తుఫానుల బారిన పడే అవకాశం ఉందని నివేదిక హైలైట్ చేసింది. 2021 అక్టోబరు 31 నుండి నవంబర్ 12 వరకు గ్లాస్గోలో జరగనున్న వాతావరణ సదస్సు COP-26 లో ఈ నివేదిక కీలకం కానుంది. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా సహకారం అందించాలని కోరనున్నాయి.

అత్యంత ప్రమాదకర జాబితాలో 463 జిల్లాలు..

సీఈఈడబ్ల్యూ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 463 జిల్లాల్లో వైపరిత్యాలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉందని, వీటిలో దాదాపు 183 హాట్‌స్పాట్ జిల్లాలు ఒకటి కంటే ఎక్కువ తీవ్రమైన ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది. క్లైమేట్ వల్నరబిలిటీ ఇండెక్స్ కూడా 60 శాతం కంటే ఎక్కువ భారతీయ జిల్లాలు మధ్యస్థం నుండి తక్కువ అనుకూల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని వెల్లడించింది.

అసోంలోని ధేమాజీ, నాగావ్, తెలంగాణలోని ఖమ్మం, ఒడిశాలోని గజపతి, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, మహారాష్ట్రలోని సాంగ్లీ, తమిళనాడులోని చెన్నై ప్రాంతాలు వాతావరణానికి అత్యంత హాని కలిగించే జిల్లాలుగా ఉన్నాయని పేర్కొంది. CEEW సీఈవో అరుణాభా ఘోష్ మాట్లాడుతూ, ‘‘పెరుగుతున్న ఫ్రీక్వెన్సీ, విపరీతమైన వాతావరణ మార్పుల కారణంగా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. అందుకే, అభివృద్ధి చెందిన దేశాలు 2009లో వాగ్దానం చేసిన USD 100 బిలియన్​ డాలర్లను అందించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది.

రాబోయే దశాబ్దంలో వాతావరణ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు రావాలి. మరోవైపు, గ్లోబల్ రెసిలెన్స్ రిజర్వ్ ఫండ్‌ను క్రియేట్​ చేయడానికి భారతదేశం చొరవ చూపాలి. ఇది ప్రకృతి వైపరిత్యాలకు బీమాగా పనిచేస్తుంది. ఇది అత్యంత హాని కలిగించే దేశాలపై, ముఖ్యంగా దక్షిణాది దేశాలపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించగలదు.”అని ఘోష్ చెప్పారు.

200 శాతం పెరిగిన ప్రమాదాలు..

CEEWలో ప్రోగ్రామ్ లీడ్, అధ్యయన ప్రధాన రచయిత అబినాష్ మొహంతి మాట్లాడుతూ, 2005 నుండి భారతదేశంలో తీవ్రమైన ప్రకృతి ప్రమాదాలు దాదాపు 200 శాతం పెరిగాయి. ప్రమాదాల తీవ్రతను గుర్తించేందకు బాధితుల నుంచి జిల్లా-స్థాయిలో తీసుకున్న నివేదికలను విశ్లేషించాలి. మౌలిక సదుపాయాల క్లైమేట్ ప్రూఫింగ్ కూడా ఇప్పుడు జాతీయ ఆవశ్యకతగా మారాలి.

పర్యావరణ డి-రిస్క్ మిషన్‌ను సమన్వయం చేయడానికి భారతదేశం కొత్త క్లైమేట్ రిస్క్ కమీషన్‌ను రూపొందించాలి." అని ఆయన అన్నారు. వాతావరణ సంక్షోభం కారణంగా నష్టాలు విపరీతంగా పెరుగుతుండటంతో, భారతదేశం తప్పనిసరిగా వాతావరణ ఫైనాన్స్‌ను డిమాండ్ చేయాలి. దీనికి కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంట గ్లోబల్ ఏజెన్సీల సహకారం తీసుకోవాలి.’’ మొహంతి జోడించారు.

CEEW అధ్యయనం భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు వరదలకు ఎక్కువగా గురవుతాయని, అయితే దక్షిణ, మధ్య ప్రాంతాలు తీవ్ర కరువుకు గురయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇంకా, తూర్పు, పశ్చిమ రాష్ట్రాల్లోని మొత్తం జిల్లాల్లో వరుసగా 59, 41 శాతం తీవ్ర తుఫానులు సంభవించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

కాగా, భారతదేశంలోని 63 శాతం జిల్లాల్లో మాత్రమే జిల్లా విపత్తు నిర్వహణ ప్లాన్లు ఉన్నాయని తెలిపింది. ఈ ప్లాన్‌లను ప్రతి సంవత్సరం అప్‌డేట్ చేయాల్సి ఉండగా, వాటిలో 32 శాతం మాత్రమే 2019 వరకు అప్‌డేట్ చేశారు. అయితే, వీటిలో మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఈ రాష్ట్రాల్లో ఇటీవలి సంవత్సరాలలో తమ సంబంధిత డీడీఎంసీలను, క్లైమెట్​ -ప్రూఫ్డ్మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది.

First published:

Tags: Andhra, Assam, Bihar, Karnataka, Maharashtra

ఉత్తమ కథలు