ARTICLE 142 PERARIVALAN RELEASED WITH SPECIAL POWERS WHAT IS THE SIGNIFICANCE OF THIS ARTICLE MENTIONED BY THE SUPREME COURT GH VB
Explained: ఆర్టికల్ 142 ప్రత్యేక అధికారంతో పేరరివాలన్ విడుదల.. ఈ ఆర్టికల్ ప్రాధాన్యం ఏంటి..?
Supreme Court
రాజీవ్ గాంధీ హత్య కేసులో 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పేరరివాలన్‌ను సుప్రీం కోర్టు విడుదల చేసింది. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం లభించిన అసాధారణ అధికారాన్ని ఉపయోగించింది.
రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) హత్య కేసులో 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పేరరివాలన్‌ను సుప్రీం కోర్టు(Supreme Court) విడుదల చేసింది. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం లభించిన అసాధారణ అధికారాన్ని ఉపయోగించింది. ముఖ్యంగా మాజీ ప్రధాని(Prime Minister) హత్యకు కారణమైన బెల్ట్ బాంబును యాక్టివేట్ చేయడానికి అవసరమైన బ్యాటరీలను(Batteries) కొనుగోలు చేసినందుకు 1991లో పేరరివాలన్‌ను అరెస్టు చేశారు. అప్పుడు అతని వయసు(Age) 19 సంవత్సరాలు. ఈ కేసులో మొత్తం ఏడుగురు(Total Seven Members) దోషులను ముందస్తుగా విడుదల చేయాలని తమిళనాడు(Tamilanadu) రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది.
దీనిపై నిర్ణయం తీసుకొనే అధికారం రాష్ట్ర గవర్నర్‌కు(Governor) ఉందని జస్టిస్(Justice) ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీం కోర్టు(Supreme Court) బెంచ్ పేర్కొంది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ (Section) 302 ప్రకారం ఒక కేసులో క్షమాభిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్రపతికి(President) మాత్రమే ఉందన్న కేంద్రం(Central Government) వాదనను కూడా సుప్రీంకోర్టు(Supreme Court) తోసిపుచ్చింది. ఇలా అయితే ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్‌కు ఉన్న క్షమాభిక్ష అందించే అధికారం ఉపయోగం లేకుండా పోతుందని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది.
తీర్పును వెలువరిస్తున్నప్పుడు, "పూర్తి న్యాయం" చేయడానికి తన ముందు పెండింగ్‌లో ఉన్న ఏదైనా కేసు విషయంలో తన ప్రత్యేక అధికారాలను వినియోగించుకోవడానికి ఆర్టికల్ 142 సుప్రీం కోర్టుకు అవకాశం కల్పిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం, సుప్రీం కోర్టు తన అధికార పరిధిని ఉపయోగించి నిర్ణయాలను తీసుకోవచ్చు. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న ఏదైనా కారణం లేదా కేసు విషయంలో పూర్తి న్యాయం చేయడానికి అవసరమైన ఆర్డర్స్(Orders) ఇవ్వవచ్చు. 142వ అధికరణం ప్రకారం, రాష్ట్ర గవర్నర్‌కు క్షమాభిక్ష, శిక్ష తగ్గింపు, శిక్ష రద్దు వంటి నిర్ణయాలు తీసుకొనే అధికారం ఉంటుంది. గవర్నర్‌కు ఇలాంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం(State Government) సలహాలు, సూచనలను సిఫార్సు చేయవచ్చు.
సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ను ఎప్పుడు ఉపయోగించింది?
1989 యూనియన్ కార్బైడ్ వ్యవహారం, 2019 అయోధ్య రామమందిర తీర్పు సహా అనేక కేసుల్లో సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ప్రకారం తన అధికారాన్ని ఉపయోగించింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులో బాధితులకు 470 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్‌ను న్యాయస్థానం ఆదేశించింది. రామమందిర తీర్పులో సుప్రీం కోర్టు భూమిని విభజించడానికి నిరాకరించింది. బదులుగా 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించింది.
ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు ఎలా అధికారం ఇస్తుంది?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 అనేది.. విచారణ సమయంలో న్యాయవాదులు అన్యాయానికి గురైన సందర్భాల్లో పూర్తి న్యాయం చేయడానికి సుప్రీంకోర్టుకు అపరిమిత అధికారాన్ని ఇస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.