Insurance Rules: పొగ తాగుతున్నారా..అయితే బీమా విషయంలోనూ మీకు నష్టమే..ఎలాగంటే..

ప్రతీకాత్మక చిత్రం

స్మోకింగ్ ప్రభావం బీమాపై కూడా పడుతుంది. టర్మ్ కవర్ పాలసీలు కొనుగోలు చేసేవారు ఒకవేళ స్మోకింగ్ అలవాటు ఉంటే అధిక ప్రీమియంతో పాటు జరిమానాలు కూడా చెల్లించాల్సి వస్తుంది.

  • Share this:
"పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం.. క్యాన్సర్ కారకం" అని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ ధూమపానాన్ని మాత్రం వదిలేయడం లేదు చాలామంది. ఇది ఆరోగ్యంపై ప్రభావం పడటమే కాకుండా ప్రాణానికి ముప్పు తీసుకొస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని కూడా చిన్నాభిన్నం చేస్తుంది. ఎందుకంటే పొగతాగేవారు సాధారణ వ్యక్తులు పెట్టే ఖర్చు కంటే రెట్టింపు ఖర్చును ఎదుర్కొవాల్సి ఉంటుంది. కష్టపడి సంపాదించిన మొత్తాన్ని ధూమపానం కోసం ఖర్చు చేయడం చూస్తూనే ఉంటాం. అయితే మనకు తెలియకుండానే ఆరోగ్య సమస్యల కోసం కూడా ఎక్కువ మొత్తం కేటాయించాల్సి వస్తుంది. కేవలం వీటిపైనే కాదు.. స్మోకింగ్ ప్రభావం బీమాపై కూడా పడుతుంది. టర్మ్ కవర్ పాలసీలు కొనుగోలు చేసేవారు ఒకవేళ స్మోకింగ్ అలవాటు ఉంటే అధిక ప్రీమియంతో పాటు జరిమానాలు కూడా చెల్లించాల్సి వస్తుంది.

పొగతాగే వారిలో మరణాల రేటు అధికంగా ఉంటుంది, అందుకే ధూమపానం అలవాటున్న వారు టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ కొనుగోలు చేసేవారు అత్యధిక ప్రీమియం చెల్లించాలి. అంతేకాకుండా ఈ అలవాటు ఉన్నవారు నిర్దిష్ట పరిమితికి మించి బీమా మొత్తాన్ని ఎంచుకుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మామూలుగా అయితే సాధారణ వ్యక్తులతో పోల్చితే పొగతాగే వారు 50 శాతం అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందట.

పొగ తాగని వారితో స్మోకింగ్ చేసే వారికి పోల్చి చూస్తే పాలసీల ప్రీమియం రేటు ఎంత ఉంటుందో చూద్దాం. 30 సంవత్సరాల వ్యక్తి సంవత్సరానికి 10 లక్షల ఆదాయం ఉండి, కోటి రూపాయల టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే వారికి ఎంత ప్రీమియం ఉంటుందంటే..

ఇన్సురర్ వార్షిక ప్రీమియం మొత్తం
పొగతాగేవారు పొగతాగనివారు అత్యధిక శాతం లైఫ్ కవరేజ్
HDFC లైఫ్ ఇన్సురెన్స్ 27,056 17,546 54 శాతం 85 ఏళ్ల వరకు
మ్యాక్స్ లైఫ్ ఇన్సురెన్స్ 20,066 13,116 53 శాతం 80 ఏళ్ల వరకు
ICICI ప్రుడెన్షియల్ లైఫ్ 35,537 23,535 51 శాతం 85 ఏళ్ల వరకు

ధూమపానం అలవాటు ఉంటే తప్పకుండా చెప్పాలి..
టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ కొనుగోలు చేసేటప్పుడు పొగతాగే అలవాటు ఉంటే తప్పకుండా బహిర్గతం చేయాలి. ఈ పాలసీలో ఇది ప్రధాన నిబంధన. వినియోగదారుడికి ధూమపానం అలవాటు ఉందా లేదా అని గత 12 నెలల్లో వారికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయని ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చే ముందు ఆరా తీస్తారు, కొన్ని సందర్భాల్లో మెడికల్ రిపోర్టు ఇవ్వమని అడుగుతారట. వైద్య పరీక్షల్లో నికోటిన్ ఆనవాళ్లు దాచడం అసాధ్యం కాబట్టి ఇలా అలవాట్లు దాచి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే అవకాశం ఉండదు.

ఆ తేడాను గుర్తించవు.
ఈ-సిగరెట్లు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్నప్పటికీ ఇన్సురెన్స్ సంస్థలు ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించవు. అందువల్ల ఏ రూపంలోనైనా పొగాకు లేదా సిగరెట్లు వాడితే కస్టమర్ ను స్మోకర్ గా గుర్తిస్తారు.

దాచిపెడితే ఏమవుతుంది?
బీమా కోసం దరఖాస్తు చేసేటప్పుడు సరైన, నిజమైన సమాచారాన్ని పొందుపరచడం మంచిది. ఎందుకంటే సమాచారాన్ని తప్పుగా ధ్రువీకరిచడం వల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో ఇబ్బందిగా మారుతుంది. ఇది కాకుండా మీ సమాచారాన్ని తప్పుగా చూపించడం మోసంతో సమానం. ఇన్సురెర్ కు ఏదైనా కస్టమర్ పై ఏమైనా సందేహం కలిగితే దర్యాప్తు చేసే అధికారం కలిగి ఉంటుంది.
Published by:Krishna Adithya
First published: