ARE YOU DOING THESE MISTAKES WHILE FILING ITR AND DONT WORRY HERE HOW TO CORRECT THOSE ERRORS GH SRD
ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు దొర్లిన తప్పులను ఎలా కరెక్ట్ చేసుకోవాలి? రూల్స్ ఎలా ఉన్నాయ్?
ప్రతీకాత్మక చిత్రం
ITR Filing: ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139(5) అనేది పన్ను చెల్లింపుదారులు తమ తప్పులను రెక్టిఫై చేసుకోవడానికి రివైజ్డ్ ఇన్కమ్ టాక్స్ రిటర్న్(revised income tax return)ను దాఖలు చేయడానికి అనుమతిస్తుంది.
ఇన్కమ్ టాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చేసేటప్పుడు పొరపాట్లుజరగకుండా పన్ను చెల్లింపుదారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొందరు పన్ను రిటర్న్‌లను చివరి నిమిషంలో ఫైల్ చేస్తుంటారు. దాని వల్ల ఎక్కువగా తప్పులు దొర్లే అవకాశం ఉంది. తప్పుగా బ్యాంక్ ఖాతా నంబర్‌ను పేర్కొనడం, వడ్డీ ఆదాయాన్ని డిక్లేర్ చేయకుండా మర్చిపోవడం వంటి పొరపాట్లు చాలా మంది చేస్తుంటారు. ఒకవేళ మీరు ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు తప్పులు చేసినట్లయితే ఆందోళన పడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాలు మిస్టేక్స్ సరిదిద్దడానికి మీకు వెసులుబాటును కల్పిస్తున్నాయి.
మీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్‌ను దాఖలు చేశాక మీరు ఏదైనా మిస్టేక్‌ను గుర్తిస్తే.. ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం మీరు మీ తప్పును సరిదిద్దుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139(5) అనేది పన్ను చెల్లింపుదారులు తమ తప్పులను రెక్టిఫై చేసుకోవడానికి రివైజ్డ్ ఇన్కమ్ టాక్స్ రిటర్న్(revised income tax return) ను దాఖలు చేయడానికి అనుమతిస్తుంది.
సెక్షన్ 139(5) ప్రకారం, పన్ను రిటర్న్‌ను దాఖలు చేసిన తర్వాత ఏదైనా లోపాన్ని లేదా తప్పుడు స్టేట్మెంట్ను గుర్తించినప్పుడు.. పన్ను చెల్లింపుదారులు రివైజ్డ్ రిటర్న్‌ను దాఖలు చేయొచ్చు. ఈ రివైజ్డ్ రిటర్న్‌ను సంబంధిత అసెస్మెంట్ ఇయర్ ముగియడానికి మూడు నెలల ముందు లేదా అసెస్మెంట్ పూర్తయ్యే ముందుగా అయినా ఫైల్ చేయవచ్చు. మీ ఐటీఆర్‌లో తప్పులు దొర్లిట్లయితే.. మీరు రివైజ్డ్ రిటర్న్‌ను ఎలా ఫైల్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.
* రివైజ్డ్ రిటర్న్ అంటే ఏంటి?
ఒరిజినల్ ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినా లేదా ఏదైనా ఫ్యాక్ట్స్ డిక్లేర్ చేయడం మర్చిపోయినా.. వాటిని సరిదిద్దుకోవడానికి రివైజ్డ్ రిటర్న్ అనుమతిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే రివైజ్డ్ రిటర్న్‌ను ఫైల్ చేయడం అంటే మీ రిటర్న్‌ని సరైన సమాచారంతో మళ్లీ ఫైల్ చేయడం అని అర్థం. రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు.. పన్ను చెల్లింపుదారులు తమ ఒరిజినల్ రిటర్న్ వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఐటీఆర్‌కు సంబంధించిన అన్ని వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.
* రివైజ్డ్ రిటర్న్‌ను ఎవరు ఫైల్ చేయవచ్చు?
సెక్షన్ 139(5) కింద పన్ను శాఖకు సరైన సమాచారాన్ని అందించడానికి ప్రతీ చెల్లింపుదారుడు రివైజ్డ్ రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్‌ను ఫైల్ చేసే వారు రివైజ్డ్ రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. గతంలో గడువు ముగిసేలోపు ఐటీఆర్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు మాత్రమే తమ రిటర్నులను సవరించుకునే అవకాశం ఉండేది.
* రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ
కరోనా కారణంగా ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరం కోసం రివైజ్డ్ ఐటీఆర్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీని మార్చి 31, 2022 వరకు పొడిగించింది. ఈ గడువు సాధారణంగా డిసెంబర్ 31వ తేదీ వరకు ఉంటుందని గమనించాలి.
* రివైజ్డ్ ఐటీఆర్‌ను ఎలా ఫైల్ చేయాలి
రివైజ్డ్ ఐటీఆర్‌ను అచ్చం ఒరిజినల్ ఐటీఆర్‌ను దాఖలు చేసినట్లుగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే రివైజ్డ్ ఐటీఆర్‌ను ఫైల్ చేస్తున్నప్పుడు.. చెల్లింపుదారులు దానిని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(5) కింద ఫైల్ చేయాల్సి ఉంటుంది. రివైజ్డ్ ఐటీఆర్‌ను దాఖలు చేసేటప్పుడు చెల్లింపుదారులు 'రిటర్న్ ఫైల్ అండర్(Return file under)' కాలమ్‌లో 'Revised u/s 139(5)' ఎంచుకోవాలి. అలాగే ఐటీఆర్ ఫారమ్ ఫైల్ చేసే సమయంలో ఒరిజినల్ ఐటీఆర్ వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. అంటే ఒరిజినల్ ఐటీఆర్ రిసిప్ట్ నంబర్, దాఖలు చేసిన తేదీ తెలపాలి.
* రివైజ్డ్ రిటర్న్‌ని ఎన్నిసార్లు ఫైల్ చేయవచ్చు
రివైజ్డ్ రిటర్న్ దాఖలుకు ప్రత్యేకించి లిమిట్ అంటూ ఏమీ ఉండదు. అయితే రివైజ్డ్ రిటర్న్‌ను ఫైల్ చేసిన ప్రతిసారీ ఒరిజినల్ ఐటీఆర్ వివరాలను అందించాల్సి ఉంటుంది. పన్ను రిటర్న్‌ను రివైజ్ చేయడం ద్వారా తప్పులను సరిదిద్దుకోవచ్చు. కానీ ఒరిజినల్ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల మరోసారి ముందు నుంచి ప్రక్రియను అనుసరించాల్సిన బాధ తప్పుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది.
* గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు
రివైజ్డ్ ఐటీఆర్‌ను ఫైల్ చేసిన తర్వాత దానిని ధ్రువీకరించాల్సి ఉంటుంది. లేని పక్షంలో దానిని ఆదాయపు పన్ను శాఖ ఆమోదించదు. ఆధార్, ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈవీసీ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతులను ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చు. లేదా ITR-V (అక్నాలెడ్జ్మెంట్ రసీదు)ను సంతకం చేసిన కాపీని సీపీసీ, బెంగళూరుకు పంపడం ద్వారా వెరిఫికేషన్ చేయవచ్చు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.