Andhra Pradesh: ఏపీకి అదనపు రుణం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కష్టకాలంలో ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. జీఎస్టీ పరిహారంతో పాటు అదనపు రుణ సౌకర్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • Share this:
    తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సమస్య్లలతో కొట్టుమిట్టాడుతున్నాయి. లోటు బడ్జెట్ తో కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాలని కేంద్రాన్ని పదే పదే కోరుతున్నాయి కూడా. ఇలాంటి సమయంలో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు కాస్త తీపి కబురే అందించింది. ముఖ్యంగా కరనో సంక్షోభం, రాబడి కాస్త తగ్గడం, సంక్షేమ పథకాలు భారీగా అమలు చేస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో అప్పులు పెరిగాయి. అందుకే  ఈ పరిస్థితి ఏర్పడింది. తాజాగా కేంద్రం విడుదల చేసిన 18వ విడత జీఎస్టీ పరిహారంలో ఏపీ, తెలంగాణలకు అదనపు రుణ సౌకర్యాన్ని కల్పించింది.

    కేంద్ర ప్రభుత్వం 18వ విడత జీఎస్టీ పరిహారం కింద మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. 23 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించేలా నాలుగు వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో 2020 అక్టోబర్ నెల నుండి విడుదల చేస్తున్న జీఎస్టీ పరిహారంతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 1.04 లక్షల కోట్లకు జీఎస్టీ పరిహారం చేరుకుంది.

    ఇప్పటి వరకు ఏపీకి 2306.59 కోట్ల రూపాయలు, తెలంగాణ రాష్ట్రానికి 2027.33 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్రం ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. అయితే ఏపీకి అదనపు రుణ సౌకర్యం కింద 5,051 కోట్ల రూపాయలు, స్పెషల్ విండో ద్వారా 2, 306 కోట్ల రూపాయలు, స్పెషల్ విండో ద్వారా 2,306 కోట్ల రూపాయలను ఇవ్వడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి అదనపు రుణ సౌకర్యం కింద 5,017 కోట్ల రూపాయలు కేటాయించగా, స్పెషల్ విండో ద్వారా 2,027 కోట్ల రూపాయలు మంజూరు చేయనుంది.

    ఓవరాల్ గా గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు మాత్రం ఆంధ్రప్రేదేశ్ లో మూడు శాతం పెరిగాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక శాతం తగ్గింది. ఫిబ్రవరికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన జీఎస్టీ వసూళ్ల లెక్కల ప్రకారం 2020 ఫిబ్రవరిలో ఏపీకి 2563.33 కోట్ల రూపాయలు వసూలు కాగా.. ఈసారి అది 2652.57 కోట్ల రూపాయలకు చేరింది. ఇక తెలంగాణ రాష్ట్ర వసూళ్లు చూస్తే 3665.13 కోట్ల రూపాయల నుంచి 3636.44 కోట్ల రూపాయలకు తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ జీఎస్టీ లెక్కలు ఎలా ఉన్నా.. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తెలుగు రాష్ట్ర్రాలకు 18 విడత జీఎస్టీ పరిహారాన్ని కేద్రం విడుదల చేయడం నిజంగా గుడ్ న్యూస్  లాంటిదే అనే చెప్పాలి.
    Published by:Nagesh Paina
    First published: