హోమ్ /వార్తలు /Explained /

Andhra Pradesh: మే ఆరున ముహూర్తం! విశాఖ నుంచే ఇక పరిపాలన! సీఎం క్యాంపు కార్యాలయం సిద్ధమైందా? ఎక్కడో తెలుసా?

Andhra Pradesh: మే ఆరున ముహూర్తం! విశాఖ నుంచే ఇక పరిపాలన! సీఎం క్యాంపు కార్యాలయం సిద్ధమైందా? ఎక్కడో తెలుసా?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం

అన్ని అనుకున్నట్టు జరిగితే సీఎం జగన్ త్వరలోనే వైజాగ్ వచ్చేస్తున్నారు.. ఇప్పటి వరకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ పాలనా వ్యవహారాలు చూస్తున్నారు. కానీ ఇకపై వైజాగ్ నుంచే పాలన జరిపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మే ఆరున ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

విశాఖ నుంచి ఇక పాలన ప్రారంభించడం లాంఛనమేనా..? ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. ఎందుకంటే మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడు రాజధానుల్లోనూ వైసీపీకే జనం జై కొట్టారు. వైసీపీ ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించింది. అయితే ఆ మూడు రాజధానుల ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకే జనం జైకొట్టారు. దీంతో మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజా మద్దతు ఉందని వైసీపీ ప్రకటించుకోంటోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పదేపదే ఇదే మాట చెబుతున్నారు.

ఇప్పటివరకు కోర్టు తీర్పులు అడ్డంకిగా ఉన్నాయని వైసీపీ ప్రభుత్వం కాస్త వెనుకడుగు వేస్తూ వచ్చింది. గతంలో అనేక ముహూర్తాలు పెట్టినా అన్నీ వాయిదా పడ్డాయి. తాజా ఎన్నికల తీర్పుతో ఇక రాజధాని వికేంద్రీకరణ ఆలస్యం చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. కోర్టు కేసుల విచారణలో తాజా ఎన్నికల ఫలితాలను ఉదహరణగా చెప్పొచ్చని.. ప్రజామోదంతోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పొచ్చని భావిస్తోంది. మొత్తం రాజధానిని తరలించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాకపోయినా.. సీఎం జగన్ మాత్రం త్వరలో విశాఖ నుంచే పాలన ప్రారంభించేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. సీఎం క్యాంపు కార్యాలయం కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. మే ఆరున ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది. విశాఖకు చెందిన ఓ స్వామీజీ దీనికి సంబంధించిన ముహూర్తం పెట్టినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నర్సాపురం  ఎంపీ రఘురామ సైతం ఇదే విషయం చెప్పారు. ఇప్పటికే ముహూర్తం పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు.

అన్ని అనుకున్నట్టు జరిగితే సీఎం జగన్ త్వరలోనే వైజాగ్ వచ్చేస్తున్నారు.. ఇప్పటి వరకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ పాలనా వ్యవహారాలు చూస్తున్నారు. కానీ ఇకపై వైజాగ్ నుంచే పాలన జరిపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. అందుకు కసరత్తు కూడా పూర్తైనట్టు సమాచారం.. ఇప్ప‌టికే ఈ అంశానికి సంబంధించి ప‌లు పిటీష‌న్లు కోర్టులో ఉన్న‌ప్ప‌టికి.. రాజధాని తరలింపు ఆలస్యమైనా సీఎం మాత్రం వైజాగ్ నుంచి పాల‌న చేయ‌డానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: విశాఖ మేయర్ గా మహిళ? ఎవరో తెలుసా? ఆరుగురు లేదా నలుగురు డిప్యూటీ మేయర్లు?

ప్రభుత్వ భవనాలు పూర్తిగా సమకూరే వరకు.. పాలనకు ఇబ్బంది లేకుండా.. అంతా అనుకూలంగా ఉండే ప్లేస్ ను సీఎం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మే మొద‌టి వారంలో కీల‌క పాల‌నా విభాగ‌మంత విశాఖ‌ వెళ్ల‌డానికి రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణానికి ఉగాధి రోజు శంకుస్థాప‌న చేసే అవ‌కాశం ఉంద‌ని తెల‌స్తోంది. మొన్నటి వరకు ఆలస్యం అవుతుందని భావించినా.. తాజా ఫలితాల తరువాత ఇక తొందరపడడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే మంత్రులకు జగన్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎం విశాఖ వచ్చిన వెంటనే.. అక్కడ నుంచి పరిపాలించేందుకు అన్ని వసతులతో కూడిన క్యాంప్ కార్య‌ల‌యం స్థానికంగా రెడీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. నగరంలో ఉన్న ప్రముఖ వెల్ నెస్ రిసార్ట్ ను అందుకు ఎంపిక చేశారని తెలుస్తోంది. అది దేశంలోనే మంచి గుర్తింపు పొందిన రిసార్ట్స్ కూడా...

పూర్తిగా అన్ని సదుపాయాలు స‌మకూరే వ‌ర‌కు ముఖ్య‌మంత్రి ఇక్క‌డ నుంచే ప‌రిపాల‌న కొన‌సాగించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. వైజాగ్ లో చాలా ప్రదేశాలు పాలనకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఈ రిసార్ట్ ఉన్నది ప్ర‌భుత్వ స్థ‌లం కావ‌డంతో దిన్నే ఎంపిక చేసిన‌ట్లు సీఏంవో వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. సుమారు 28 ఎకారాల్లో విస్త‌రించి ఉన్న ఈ వెల్ నెస్ రిసార్ట్ ను ప్రపంచంలోనే అత్యున్న‌త ప్రమాణాల‌తో క‌ట్టారు. పూర్తి స్థాయి విలాసావంత‌మైన సౌక‌ర్య‌లు ఇందులో ఉన్నాయి. బీచ్ కు అనుకుని ఉండే ఈ రిసార్ట్ మ‌న దేశంలో అత్యంత పేరొందినదిగా గుర్తింపు పొందింది.

First published:

Tags: Andhra Pradesh, Ap capital, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, AP News, Municipal Elections, Visakha, Visakhapatnam, Vizag, Ys jagan

ఉత్తమ కథలు