హోమ్ /వార్తలు /Explained /

Anti NEET Bill: యాంటీ నీట్‌ బిల్‌ అంటే ఏంటి? మెడికల్ కాలేజీ అడ్మిషన్‌లు ఎలా ప్రభావితం అవుతాయి?

Anti NEET Bill: యాంటీ నీట్‌ బిల్‌ అంటే ఏంటి? మెడికల్ కాలేజీ అడ్మిషన్‌లు ఎలా ప్రభావితం అవుతాయి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జాతీయ స్థాయిలో మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు పోటీ పరీక్ష నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET) నిర్వహిస్తారు. నీట్‌ ద్వారా ప్రవేశాలు కల్పించకూడదని కోరుతూ యాంటీ నీట్‌ బిల్‌ను తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

ఇంకా చదవండి ...

జాతీయ స్థాయిలో మెడికల్‌(Medical) కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు పోటీ పరీక్ష నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET) నిర్వహిస్తారు. నీట్‌(NEET) ద్వారా ప్రవేశాలు కల్పించకూడదని కోరుతూ యాంటీ నీట్‌ బిల్‌ను(Anti Neet Bill) తమిళనాడు(Tamilanadu) ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తమిళనాడుకు నీట్‌ మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. 12వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా కూడా వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించవచ్చని తమిళనాడు ప్రభుత్వం(Government) ప్రతిపాదించింది. ఈ పద్ధతిలోనే సామాజిక న్యాయాన్ని కాపాడవచ్చని, వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియలో బలహీన వర్గాలు వివక్షకు గురి కాకుండా ఉంటాయని పేర్కొంది.

* తమిళనాడు నీట్‌ని ఎందుకు వ్యతిరేకిస్తోంది?

విద్యార్థుల ప్రతిభను లెక్కించడానికి నీట్ సరైన పద్ధతి కాదని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. కోచింగ్ తీసుకొనేందుకు ఆర్థిక స్థోమత ఉన్న సంపన్న కుటుంబాల పిల్లలకు మాత్రమే నీట్ ప్రయోజనాలు అందుతున్నాయని చెబుతోంది. ప్రతి రాష్ట్రానికి సిలబస్‌ మారుతుండగా.. కేంద్ర స్థాయిలో ప్రవేశపరీక్ష నిర్వహించడం అన్యాయమని, దీని కారణంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆరోపిస్తోంది.

నీట్‌ కారణంగా కలుగుతున్న ప్రయోజనాలను, నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం విశ్రాంత న్యాయమూర్తి ఏకే రాజన్‌ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 'తమిళనాడులో మెడికల్ అడ్మిషన్లపై నీట్ ప్రభావం' పేరిట ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. నీట్ ద్వారా అడ్మిషన్‌లు కల్పించడం సరైన మార్గం కాదనే రాష్ట్ర వైఖరికి కమిటీ మద్దతు ఇచ్చింది. 165 పేజీల నివేదిక ప్రకారం.. నీట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత గ్రామీణ, పట్టణ పేద కుటుంబాల నుంచి తక్కువ మంది పిల్లలు వైద్య కళాశాలల్లో చేరారు. నీట్‌కు ముందు జరిగిన అడ్మిషన్‌లో గ్రామీణ విద్యార్థులు సగటున 61.45 శాతం ఉండగా, నీట్ ప్రవేశపెట్టిన తర్వాత 2020-21లో అది 49.91 శాతానికి పడిపోయింది.

Russia: మాస్కో సమీపంలో కనిపించిన పుతిన్ 'డూమ్‌ డే' విమానం.. ఆందోళనలో పశ్చిమ దేశాలు.. కారణం ఏంటంటే..


నీట్‌లో ఉత్తీర్ణత సాధించి వైద్య కోర్సుల్లో చేరిన విద్యార్థులు 12వ తరగతి మార్కుల ఆధారంగా నమోదు చేసుకున్న వారి కంటే తక్కువ మార్కులు సాధించారని నివేదిక పేర్కొంది. ప్రవేశ పరీక్షను సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగా నిర్వహించడంతో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. చాలా మంది ఆర్థిక సమస్యల కారణంగా కోచింగ్ సెంటర్లలో కూడా చేరలోకపోతున్నట్లు స్పష్టం చేసింది.

* యాంటీ నీట్ బిల్‌ గురించి ఇప్పటివరకు ఏం జరిగింది?

నీట్ ప్రతికూలతలపై నివేదికను రూపొందించిన డీఎంకే: నీట్‌ నుంచి తమిళనాడుకు మినహాయింపు సాధించడం ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఎన్నికల వాగ్దానంలో భాగం. అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వే నిర్వహించింది. పరీక్షను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని నివేదిక పేర్కొంది. నీట్‌ను రద్దు చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించవచ్చు. అయితే, భారత రాష్ట్రపతి ఆమోదం అవసరం.

బిల్లును రూపొందించి, గవర్నర్‌కు పంపిన తమిళనాడు ప్రభుత్వం: రాష్ట్ర ప్రభుత్వం నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్ ఆర్‌ఎన్ రవికి పంపింది, ఆ తర్వాత సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. దీనిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. రిటైర్డ్ జస్టిస్ ఎకె రాజన్ గతంలో News18.comతో మాట్లాడుతూ..‘విశ్వవిద్యాలయాలను స్థాపించడానికి, నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు. ఆ పని చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉంది. 2007లో తీసుకొచ్చిన చట్ట సవరణ ప్రకారం నీట్ పరీక్ష నుంచి మినహాయింపు పొందవచ్చు.’ అని చెప్పారు.

బిల్లును తిరిగి పంపిన గవర్నర్: నీట్‌ను రద్దు చేయడానికి సంబంధించిన బిల్లును గవర్నర్ తమిళనాడు ప్రభుత్వానికి తిరిగి పంపారు.

మరో బిల్లును పంపనున్న సీఎం: రాష్ట్ర విద్యార్థులకు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీఎం ఎంకే స్టాలిన్ మరో బిల్లును ముందుకు తెచ్చారు. డీఎంకే సమావేశంలో, రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును మళ్లీ గవర్నర్‌కు పంపాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

బిల్లును కేంద్రానికి పంపినట్లు చెబుతున్న స్టాలిన్‌: నీట్ మినహాయింపు కోసం తదుపరి దశలో రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని అసెంబ్లీలో తెలిపిన స్టాలిన్‌.

* బిల్‌ పాస్ అయితే ఏమి జరుగుతుంది?

యాంటీ నీట్ బిల్‌ను రాష్ట్రపతి ఆమోదించి, కేంద్రం ఆమోదించినట్లయితే, జాతీయ స్థాయిలో మెడికల్‌ కళాశాలల్లో చేరడానికి నీట్‌ మాత్రమే మార్గంగా ఉండదు.

Explained : PPF అకౌంట్ అంటే ఏంటి..? PPF అకౌంట్‌ను ఎందుకు ఓపెన్ చేయాలి..? దీని ప్రయోజనాలు ఏవి..?


* నీట్‌పై కేంద్రం కొన్ని చర్యలు

అనేక ఆత్మహత్యలు, తమిళనాడు ప్రభుత్వం నుంచి ఒత్తిడి తర్వాత, కేంద్ర ప్రభుత్వం కూడా నీట్‌ను తక్కువ-స్థాయి పరీక్షగా మార్చాలని ఆలోచిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటికే NTA NEET కోసం హాజరు కావడానికి గరిష్ట వయోపరిమితిని తొలగించింది. అంతకుముందు విద్యార్థులు సంవత్సరానికి ఒక పరీక్ష మాత్రమే ఉండటం, తక్కువ కళాశాలలు ఉండటం వల్ల నీట్‌లో అర్హత సాధించడం కఠినంగా మారిందని ఫిర్యాదులు వచ్చేవి. గరిష్ట వయోపరిమితిని సడలించడంతో ఇప్పుడు ఎక్కువ మంది పరీక్షకు సిద్ధం కావడానికి వీలు కలిగింది. వైద్య ప్రవేశ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని గతంలో విద్యాశాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్చలు జరిపాయి. అయితే, ఈ ప్రతిపాదన ఈ సంవత్సరం అమలు కాలేదు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

First published:

Tags: Explained, NEET, NEET 2022, State Government Jobs, Tamilanadu

ఉత్తమ కథలు