Home /News /explained /

YSR Kapu Nestham: వైఎస్ఆర్ కాపునేస్తం సర్వేకు సిద్ధం.., ఇలా దరఖాస్తు చేస్తే రూ.15వేలు

YSR Kapu Nestham: వైఎస్ఆర్ కాపునేస్తం సర్వేకు సిద్ధం.., ఇలా దరఖాస్తు చేస్తే రూ.15వేలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం (Andhra Pradesh Government) రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. సంక్షేమ క్యాలెండర్ కు అనుగుణంగా అర్హుల ఖాతాల్లో ఆర్ధిక సాయాన్ని జమ చేస్తోంది.

    ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా, చేయూత పేరుతో పలు పథకాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని లోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం వైఎస్ఆర్ కాపునేస్తం పథకాన్ని అందిస్తోంది. ఏడాదికి రూ.15వేలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తోంది. 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆర్థికసాయం అందిస్తోంది. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 2,35,873 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 354 కోట్లు జమ చేసిన ప్రభుత్వం., అర్హులైనా పథకం అందని వారికి గతేడాది నవంబర్ లో మరోసారి రూ.142 కోట్లు జమ చేసింది. ఈ పథకంలో అర్హులకు ప్రభుత్వం ఏటా రూ.15వేల చొప్పున అయిదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయాన్ని చేస్తుంది.

    ఇటీవలే వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు రూ.18.750 చొప్పున వారిఖాతాల్లో జమచేసిన ప్రభుత్వం.. త్వరలో రెండో విడత కాపు నేస్తం అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా జూలై 1 నుంచి 7వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. అనంతరం జాబితాను సచివాలయాల్లో ప్రదర్శి సామాజిక తనిఖీ చేస్తారు. జూలై 24వ తేదీన అర్హులైన వారి ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ చేస్తారు.

    వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి అర్హతలు

    • కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మించకూడదు.

    • ఆ కుటుంబానికి 3 ఎకరాలలోపు తరి లేదా 10 ఎకరాల లోపు మెట్ట భూమి ఉండాలి. లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి

    • అదే పట్టణ ప్రాంతాల వారికి అయితే ఎలాంటి ఆస్తి లేదా 1000 చదరపు అడుగులకు మించిన ఇల్లు, ఇతర ఏ నిర్మాణాలు ఉండకూడదు.

    • కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. అలాగే ప్రభుత్వ పెన్షన్‌ కూడా పొందరాదు.

    • కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. అయితే ఆటో, టాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు ఉంటుంది.

    • ఆ కుటుంబంలో ఎవరూ కూడా పన్ను చెల్లింపుదారులై ఉండకూడదు.


    కొత్తగా దరఖాస్తు చేసుకునే విధానం
    అర్హత కలిగిన కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరి కులాలకు చెందిన మహిళలు తమ ఆధార్ కార్డ్ జిరాక్స్, కులధృవీకరణ పత్రం జత చేసి దరఖాస్తును గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలాయాలకు సమర్పించాలి. అర్హులైన వారికి వైఎస్ఆర్ రిక్వెస్ట్ నెంబర్ కేటాయిస్తారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం 1902 హెల్ప్ లైన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap welfare schemes, YSR Kapu Nestham

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు