• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • ANDHRA PRADESH CS ADITHYANATH OREDRS TRANSFR OF 21 DEPUTY COLLECTORS NGS

Andhra Pradesh: సింహాచలం ఈవో బదిలీకి కారణం అదేనా? వరుస ఎన్నికల ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh: సింహాచలం ఈవో బదిలీకి కారణం అదేనా? వరుస ఎన్నికల ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం

సింహాచలం పుణ్యక్షేత్రం

  • Last Updated:
  • Share this:
    ఏపీ వ్యాప్తంగా ఒకేసారి 21 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీలు చేయడం హాట్ టాపిక్ గామారింది. రాష్ట్రంలో వరుస ఎన్నికల నేపథ్యంలో ఈ భారీ మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్‌ ఆదిత్యనాధ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ దేవాలయాల్లో ఈవోలుగా డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. సింహాచలం దేవస్థానం ఈవోగా ఎంవీ సూర్యకళను ప్రభుత్వం నియమించింది.

    సింహాచలం ఈవో మార్పుపై స్థానికంగా ఉన్న విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇటీవల నియమించిన ఈవోను ఇంత అకస్మాత్తుగా మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నాయి.. తాజాగా విశాఖపట్నం నేషనల్‌ హైవే-16లో భూసేకరణలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎంవి సూర్యకళను సింహాచలం వరహా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరుగా నియమించారు. గత ఈవో బాధ్యతలు తీసుకుంటునే దేవస్థానం భూములు భారీగా కబ్జాకు గురవుతున్నాయని.. ఇకపై అలాంటి వాటిని ఉపేక్షించని ఆయన స్పష్టం చేశారు. దేవస్థానం భూములన్నీ కాపడడం తన బాధ్యత అన్నారు. ఇప్పటికే ఆయన చాలామంది నేతలు దేవస్థానం భూములు ఆక్రమించినట్టు గుర్తించారని.. అందుకే ఆయన్ను తప్పించారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు.

    ఇక వెలుగొండ ప్రాజెక్టు భూసేకరణలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్‌.విజరుకుమార్‌ను నెల్లూరులోని తెలుగు గంగ ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు. వీరితో పాటు మరో 19 మంది డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులు, బదిలీలిస్తూ ఉత్తర్వులిచ్చారు.

    ద్వారకా తిరుమల దేవస్థానం ఈవోగా జీవీ సుబ్బారెడ్డి, నెల్లూరు జేసీగా బాపిరెడ్డి, ప్రకాశం జేసీగా కె.కృష్ణవేణి, ఏపీ ఎన్నార్టీ సొపైటీ సీఈవోగా కె. దినేష్ కుమార్ ను మచిలిపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా కె. ఆదయ్యను ప్రభుత్వం నియమించింది.

    శాఖల వారిగా బదిలీలు చూస్తే.. ఎం.వి.సూర్యకళను దేవాదాయ శాఖ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం ఈఓగా బదిలీ చేశారు. ఎం. విజయకుమార్‌ను తెలుగుగంగా ప్రాజెక్ట్‌ నెల్లూరు విభాగం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేశారు. జె. శివశ్రీనివాస్‌ను అసిస్టింట్‌ సెక్రటరీగా చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌, విజయవాడకు బదిలీ జరిగింది. డి. కోదండరామిరెడ్డిని చిత్తూరు ఫారెస్ట్‌ సెంటిల్‌మెంట్‌ ఆఫీసర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఎ. శ్రీరామచంద్రమూర్తిని ఆంధ్రప్రదేశ్‌ విజిలెన్స్‌ కమీషన్‌కు బదిలీ చేశారు. వీరితో పాటు ఎం. శ్రీదేవి కృష్ణపట్నం హైదరాబాద్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌కు కాంపిటెంట్‌ అధారిటీగా ఒంగోలుకు బదిలీ అయ్యారు. జె. అద్దయ్యను మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీకి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులిచ్చారు. జి.వి. సుబ్బారెడ్డిని శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్ధానం, ద్వారకతిరుమలకు ఈ.ఓగా బదిలీ చేశారు. ఎ.బి.వి.ఎస్‌.బి. శ్రీనివాస్‌ను తూర్పుగోదావరి జిల్లా కెఆర్‌ఆర్‌పికి స్పెషల్‌ డిప్యూటీ కలెలక్టర్‌గా బదిలీ చేశారు.

    ఎన్‌. శ్రీనివాసులు తిరుపతి లీగల్‌ సెల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఎ.మహాలక్ష్మీదేవిని చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ విజయవాడకు అసిస్టెంట్‌ సెక్రటరీగా బదిలీ చేశారు. అమరావతి మెట్రోపాలిటన్‌ రివిజన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా ఏ.సాధన బదిలీ అయ్యారు. డి. రామూనాయక్‌ జిఎన్‌ఎస్‌ఎఫ్‌ యూనిట్‌ 3 ముద్దనూరు కడప జిల్లా కు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బి. చిన్న ఓబులేసు నెల్లూరు జిల్లా డిస్ర్టిక్ట్‌ రెవెన్యూ ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు. ఇక కె. హేమలతను నేషనల్‌ హైవే 16 విశాఖపట్నం భూ సమీకరణకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేశారు. టి.బాపిరెడ్డి నెల్లూరు జిల్లాలో ఆసరా, సంక్షేమ పథకాల అమలుకు జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

    కె.కృష్ణవేణి ప్రకాశం జిల్లా ఆసరా, సంక్షేమ పధకాల అమలుకు జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. జి.వి. సత్యవాణి తూర్పుగోదావరి జిల్లా ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. కె.ఎం. బర్తారోస్మాండ్‌ నెల్లూరు జిల్లా ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఎస్‌.భాగ్యరేఖ చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌, విజయవాడలో అసిస్టెంట్‌ సెక్రటరీగా బదిలీ చేశారు. కె. దినేష్‌ కుమార్‌ను ఏపీఎన్‌ఆర్‌టి సొసైటీ సీఈఓగా డిప్యూటేషన్‌ పై నియామకం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వరుస ఎన్నికలకు ముందు ఒకేసారి 21 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులియ్యడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు