Home /News /explained /

ANDHRA PRADESH CM YS JAGAN PLANS TO ANNOUNCE PRC SOON HERE IS DETAILS OF WHAT IS PRC NS

What is PRC: మొన్నటి వరకు తెలంగాణలో, ఇప్పడు ఏపీలో పీఆర్సీ పంచాయితీ.. అసలు పీఆర్సీ అంటే ఏమిటో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మొన్నటి వరకు తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో పీఆర్సీకి (PRC) సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది. త్వరలోనే ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు పీఆర్సీ అంటే ఏంటో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో పీఆర్సీ (Telangana PRC) అంశంపై కొన్ని నెలల క్రితం వరకు తీవ్రంగా చర్చ జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతో అక్కడ పీఆర్సీ వివాదం ముగిసిపోయింది. అయితే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోనూ పీఆర్సీ పంచాయితీ మొదలైంది. అయితే మరో రెండు మూడు రోజుల్లో సీఎం జగన్ (CM Jagan) పీఆర్సీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. ఈ పీఆర్సీ అంటే ఏమిటో తెలియక అనేక మంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. పీఆర్సీ అనగా పే రివిజన్ కమిషన్. ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగులు, టీచర్లకు ఎంత మేర జీతం ఇవ్వాలి? ఎంత భత్యం ఇవ్వాలి? తదితర అంశాలను అధ్యాయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసే కమిటీ ఇది. ప్రతీ ఐదేళ్లకు ఒక సారి ప్రభుత్వం ఈ కమిటీని నియమించాల్సి ఉంటుంది.

    ఈ కమిటీ ఇచ్చే సిఫార్సు ఆధారంగా ప్రభుత్వం వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ కమిటీ సిఫార్సులు ఖచ్చితంగా అముల చేయాలన్న నిబంధన ఏమీ లేదు. సాధారణంగా కమిటీ సిఫార్సుల్లో సూచించిన మొత్తానికి కంటే ఎక్కువగానే ప్రభుత్వాలు వేతనాలను పెంచుతుంటాయి. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (AP Government Employees) వేతన సవరణకు సర్కార్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
    AP CM vs Employees: సీఎం ప్రకటనపై ఉద్యోగులు అసంతృప్తి.. ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరిక..

    ఉద్యోగులు కోరుతున్న విధంగా పీఆర్సీతో పాటు ఇతర డిమాండ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan) ఆర్ధిక శాఖ అధికారులతో చర్చించారు. ఉద్యోగులు కోరుతున్న విధంగా పీఆర్సీపైనే సీఎం ప్రధానంగా చర్చించారు. పీఆర్సీపై కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించిన జగన్.. ఎంతమేర పెంచాలనే అంశాన్ని ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా.. ఎంతమేర ఫిట్ మెంట్ ఇచ్చేందుకు సాధ్యమవుతుందనే అంశంపై అధికారులను ఆరా తీశారు.
    cm jagan గాలి తీశారుగా! -విపక్షాలు కాదు, వైసీపీ సర్కారును మేమే కూల్చేస్తాం.. ఇవిగో ఓట్ల లెక్కలు

    ఉద్యోగులకు ఇప్పటికే 27శాతం మధ్యంతర భృతి ఇస్తుండగా.. దానిపై ఎంతమేర ఫిట్ మెంట్ ఇస్తే ఖజానాపై భారం పడుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ అంశంపై సిద్ధం చేసిన నివేదికను అధికారులు సీఎంకు ఇచ్చారు. ఇటీవల తిరుపతిలో పర్యటించిన సందర్భంగా పది రోజుల్లో పీఆర్సీ ఇస్తామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జీతాలు ఎంతమేరకు పెంచాలనే అంశంపై ముఖ్యమంత్రి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో దీనిపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Cm jagan, CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు