school drivers shortage : అమెరికాలో స్కూలు డ్రైవర్ల కొరత.. గంటల లెక్కల్లో జీతాలు...

school drivers : అమెరికాలో స్కూలు డ్రైవర్ల కొరత.. గంటల లెక్కల్లో జీతాలు...

school drivers : అమెరికాలో స్కూలు బస్సుల కొరత ఏర్పడినట్టు ఓ సర్వే రిపోర్టు వెల్లడించింది. కరోనా ప్రభావంతో తిరిగి ప్రారంభమైన స్కూళ్లలో సుమారు 30 నుండి 50 శాతం మేర డ్రైవర్ల కొరత ఏర్పడింది. దీంతో వారికి గంటకు 21 డాలర్లు ఇచ్చేందుకు ఆయా స్కూలు యాజమాన్యాలు నిర్ణయించాయి.

 • Share this:
  కరోనా ప్రభావంతో ( corona effect ) అనేక మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా కరోనా ప్రభావం స్కూలు ( school ) జీవితం పై అధారపడిన వారిని అనేక ఇబ్బందుకులకు గురి చేసింది. కరోన సమయంలో స్కూలు,కాలేజీలు మూత పడడంతో వాటిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారు అనేక మందికి ఉపాధి కరువైంది. దీంతో యాజమాన్యాలు తమ విద్యా సంస్థల్లో పని చేసే అనేక మంది ఉద్యోగులను తమ విధుల నుండి తప్పించింది. అయితే ఇలా చాలా దేశాల్లో కరోనా ప్రత్యక్షంగా అనేక మంది మీద ప్రభావం చూపించింది.

  ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికా ( america ) కూడా కరోనా దాటికి బలైంది.. సుమారు ఏడు లక్షల మంది అక్కడ మృత్యువాత పడ్డారు. అయితే అలాంటి అగ్రరాజ్యంలోనే ఓ సమస్య వచ్చి పడింది. కరోనా పరిస్థితుల తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే అక్కడి స్కూళ్లు, కాలేజీలే తిరిగి ప్రారంభమయ్యాయ. అయితే స్కూళ్లకు పిల్లలను తీసుకువెళ్ల బస్సుల డ్రైవర్ల కొరత తీవ్రంగా పీడిస్తోంది. మొత్తం బస్ డ్రైవర్లలలో కనీసం 50 శాతం మంది మేర తిరిగి విధుల్లోకి ( duty )హజరు కాలేదు.. ఎందుకంటే కరోనా సమయంలో డ్రైవర్లు ఇతర ప్రత్యమ్నాయాలపై దృష్టి సారించారు.. తమ ఉపాధి కోసం ఇతర పనుల్లో స్థిరపడ్డారు. దీంతో తిరిగి వారు డ్రైవర్ ( drivers ) వృత్తిలోకి వచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తినట్టు ఓ సర్వే నివేదిక రిపోర్టు వెళ్లడించింది.

  ఇది చదవండి : డేరా బాబాకు జీవిత ఖైదు.. 20 సంవత్సరాల తర్వాత తేలిన మర్డర్ కేసు.. !


  దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వా ల గవర్నర్‌లు నేరుగా డ్రైవర్స్‌ను తమ బోస్టన్ స్కూళ్ల కోసం రిక్రూట్ చేసుకున్నాయి.ఇలా ఇప్పుడు అగ్రరాజ్యం అంతా.. స్కూల్‌ బస్‌ డ్రైవర్ల కొరతతో అల్లాడుతోంది! ఇటీవల మాసాచుసెట్స్‌లో పిల్లలను బడులకు తీసుకెళ్లేందుకుగానూ అక్కడి గవర్నర్ సైన్యంలోని 250 మందిని డ్రైవర్లుగా నియమించడం.. అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. టెక్సాస్‌లో స్కూల్‌ డిస్టిక్స్‌(పాఠశాలల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంగణాలు).. తమ ఉపాధ్యాయులు, బాస్కెట్‌బాల్ కోచ్‌లను బస్సులు నడపమని కోరుతున్నారట. పెన్సిల్వేనియాలో అయితే కొన్ని స్కూల్‌ డిస్టిక్స్‌.. స్వచ్ఛందంగా బస్సు సేవలు వదులుకోవాలని కోరుతూ విద్యార్థుల కుటుంబాలకు నెలకు 300 డాలర్లు చెల్లిస్తున్నాయి

  అమెరికావ్యాప్తంగా ఏటా ఒకటినుంచి 12వ తరగతిలోపు విద్యార్థుల్లో దాదాపు 55 శాతం(2.5 కోట్లు) మంది స్కూల్‌ బస్సులను ఆశ్రయిస్తారు. మొత్తం 5 లక్షలకు పైగా బస్సులు ఉన్నాయి. దాదాపు 13,800 స్కూల్‌ డిస్టిక్స్‌ అన్ని కలిపి ఏడాదికి రూ.2200 కోట్లు విద్యార్థుల రవాణాపై ఖర్చు చేస్తాయి. మొత్తం బస్సుల్లో 60 శాతం ఆయా స్కూళ్లవే కాగ, మిగతా 40 శాతం ప్రైవేటువి.ఇప్పుడు స్కూళ్లు పునః ప్రారంభమైనా.. డ్రైవర్ల కొరత 30 శాతంనుంచి 50 శాతానికి పెరగడంతో ఇక్కట్లు మొదలయ్యాయి.

  ఇది చదవండి : ఉల్లి ధరలు మళ్లీ కొండెక్కుతాయా? భారీ వర్షాలతో పొరుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉల్లి ధరలు


  అయితే డ్రైవర్ల కొరతకు సంబంధంచి కారణాలు ఓ నివేదిక ద్వార వెళ్లడించారు.. అసలు సమస్యకు కారణం కరోనా నేపథ్యంలో గతేడాది అమెరికాలోని 95 శాతం పాఠశాలలు ఆన్‌లైన్‌ విద్యాబోధన వైపు మళ్లాయి. దీంతో బస్సులు మూలకు చేరాయి. ఏడాదిలో 180 రోజులు స్కూళ్లపై ఆధారపడే ప్రైవేటు బస్సు సంస్థలూ తమ డ్రైవర్లను తొలగించాయి. కొన్ని లే ఆఫ్‌ విధించాయి. దీంతో సదరు డ్రైవర్లు ఇతర ఉద్యోగాలు వెతుక్కున్నారు. ఇప్పుడు వారు తిరిగి రావడం లేదు ప్రస్తుతం పాఠశాలలు పునఃప్రారంభమైనా.. మిగిలిన కొంతమంది డ్రైవర్లు కూడ ఆరోగ్య సమస్యలతో స్వచ్ఛందంగా విధులకు స్వస్తి పలికారు. కఠినమైన పని వేళలు, తక్కువ వేతనాలు, రెండు షిఫ్టుల్లో విధుల కారణంగా ఇతర ఆదాయ మార్గాలు కష్టతరమవుతుండటంతో చాలామంది వెనకడుగు వేస్తున్నారు.

  ఇక కొత్తవారు ఈ రంగంలోకి రావాలంటే వేలాది రూపాలయలు ఖర్చు కావడం కావడంతో పాటు లైసెన్స్ పొందేందుకు సమయం కూడా పడుతుండంతో స్థానిక డ్రైవర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో వారికి జీతాలు పెంచెందుకు ఆయా స్కూళ్ల యాజమాన్యాలు జీతాలు పెంచేందుకు ముందుకు వచ్చాయి. కరోనా పరిస్థితులు ఉన్నా వారిక జీతాలు పెంచాలని నిర్ణయించాయి. దీంతో గంటకు 16 డాలర్ల నుండి 21 డాలర్ల వరకు చెల్లించేందుకు సిద్దమయ్యాయి.
  Published by:yveerash yveerash
  First published: