Home /News /explained /

AMERICAN AIRLINES WARN OF A SERIOUS THREAT TO FLIGHTS WITH 5G TECHNOLOGY DETAILS HERE GH VB

5G Effect: 5G టెక్నాలజీతో పొంచి ఉన్న ప్రమాదం.. ఈ రంగానికి ముప్పు తప్పదా..? నివేదికలు ఏం చెబుతున్నాయి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

5జీ టెక్నాలజీ రేడియో సిగ్నల్స్‌పై ఆధారపడి పనిచేస్తుంది. అమెరికాలో 5G కోసం ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీలు(5G radio frequency) C-బ్యాండ్ స్పెక్ట్రమ్‌లో భాగంగా ఉన్నాయి.

5G టెక్నాలజీతో (5g Technology) విమానాలకు తీవ్ర ముప్పు ఉందని హెచ్చరిస్తున్నాయి అమెరికాకు చెందిన విమానయాన సంస్థలు. కొత్త టెక్నాలజీతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతాయని.. అలాగే చాలా విమానాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 5జీతో వచ్చిన సమస్యేంటి? నిజంగానే 5జీ సాంకేతికతతో విమాన రాకపోకలకు ముప్పు ఏర్పడుతుందా? తెలుసుకుందాం. 5జీ టెక్నాలజీ రేడియో(Radio) సిగ్నల్స్‌పై(Signals)  ఆధారపడి పనిచేస్తుంది. అమెరికాలో 5G కోసం ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీలు(5G radio frequency) C-బ్యాండ్ స్పెక్ట్రమ్‌లో భాగంగా ఉన్నాయి. ఇవి విడుదల చేసే ఫ్రీక్వెన్సీలు విమానాల్లో ఉపయోగించే రేడియో ఆల్టిమీటర్ల ఫ్రీక్వెన్సీలకు దగ్గరగా ఉంటాయి. 5జీ వల్ల విమాన నావిగేషన్ వ్యవస్థ(Flight Navigation System), భద్రతా సాధనాలు సరిగ్గా పనిచేయకుండా పోతాయని.. ముఖ్యంగా ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని విమానయాన సంస్థలు వాదిస్తున్నాయి.

Smartphones Under 15000: రూ. 15 వేలలోపు టాప్​ స్మార్ట్​ఫోన్లు ఇవే.. 40 శాతం డిస్కౌండ్ కూడా.. ఒక్క రోజే ఛాన్స్..


ప్రమాదం తీవ్రత ఎంత?
వాస్తవానికి 5జీ టెక్నాలజీ-విమానాల రాకపోకలు అనే సమస్య తీవ్రమైనదేనని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికా ఫ్లైట్ల(USA flights) కార్యకలాపాలపై 5జీ సాంకేతికత దుష్ప్రభావాలు అధికమేనని విమానయాన సమస్యలపై సాంకేతిక మార్గదర్శకాలను రూపొందించే RTCA అనే సంస్థ 2020లో ఓ నివేదికలో తెలిపింది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వరుస వైఫల్యాలతో పాటు పెద్దఎత్తున మరణాలు సంభవించే అవకాశంతో ఉందని హెచ్చరించింది. అంతేగాక 5Gసాంకేతికత వల్ల బోయింగ్-787 డ్రీమ్‌లైనర్‌(Boing Dreamliner) విమానంలోని పలు వ్యవస్థల్లో లోపం తలెత్తినట్లు యూఎస్ నియంత్రణ సంస్థ FAA సైతం హెచ్చరించింది. ల్యాండింగ్‌లో విమానం వేగాన్ని తగ్గించడం కష్టతరం అవుతోందని పేర్కొంది.

ఇక విమాన ప్రయాణం కలేనా?
భద్రతా వ్యవస్థలు ప్రమాదంలో ఉన్న సమయాల్లో రేడియో ఆల్టిమీటర్‌ల వినియోగానికి విమానాలకు అనుమతి లభించదు. దీనితో విమానాల ల్యాండింగ్ సామర్థ్యం పరిమితంగా ఉంటుంది. ఫలితంగా కొన్నిసార్లు పరిమిత సంఖ్యలో ప్రయాణికులను తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికే 5జీ వల్ల అమెరికాలోని(5G in USA) 10 ప్రధాన విమానయాన సంస్థలకు చెందిన 1,000 కంటే ఎక్కువ విమానాలు ఆలస్యం లేదా రద్దు అవుతాయనే వార్తలు వస్తున్నాయి.

ఇతర దేశాల మాటేంటి?
5G సాంకేతికత అందుబాటులోకి వచ్చే విధానం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది. ఉదాహరణకు యూరోపియన్ యూనియన్​(EU) దేశాల్లో ఉపయోగించే నెట్‌వర్క్‌లు అమెరికాలో వాడుతున్న వాటి కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీల వద్ద పనిచేస్తాయి. ఫలితంగా విమానాలకు 5జీ వల్ల కలిగే ముప్పు తగ్గుతుంది. ఏదేమైనప్పటికీ.. ప్రమాదాలను నివారించేందుకు కొన్ని దేశాలు చర్యలు చేపడుతున్నాయి. ఫ్రాన్స్‌లో ఎంపిక చేసిన విమానాశ్రయాల చుట్టూ "5జీ సిగ్నల్స్ బఫర్ జోన్‌లు" ఏర్పాటు చేశారు. ప్రమాదాన్ని నిరోధించేందుకు యాంటెన్నాలను కిందకు వంచారు.

అమెరికాలో చర్యలేంటి?
5జీ వల్ల అమెరికాలోని విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో అక్కడి నియంత్రణ సంస్థలు ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నాయి. 50 విమానాశ్రయాల చుట్టూ తాత్కాలిక బఫర్ జోన్‌లను ఏర్పాటు చేశాయి. అంతేగాక 5G సర్వీస్ ప్రొవైడర్లు తమ కార్యకలాపాలను పరిమితం చేయనున్నాయి.

Degree Jobs: మీరు డిగ్రీ పూర్తి చేశారా..? అయితే ఈ 500 పోస్టులు మీకోసమే.. ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు వివరాలివే..


5G సంస్థల మాటేంటి?
అమెరికాకు చెందిన దిగ్గజ టెలికాం సంస్థలు వేరిజోన్(Verizon) ఏటీ అండ్ టీ(AT&T) 5జీ లాంచింగ్​ను ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేశాయి. అంతేగాక విమానాల భద్రత కోసం తాత్కాలిక బఫర్ జోన్‌ల ఏర్పాటుకూ అంగీకరించాయి. ఇప్పటికే దాదాపు 40 దేశాల్లో 5జీ అమల్లోకి వచ్చిందని.. అమెరికాలో లాంఛింగ్​ను ఆలస్యం చేయడం వల్ల ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లుతుందని అవి ఆందోళన వ్యక్తం చేశాయి.

బ్రిటన్​లో పరిస్థితి ఎలా ఉంది?
యూకే టెలికాం నియంత్రణ సంస్థలు, విమానయాన సంస్థలు అనవసర ఆందోళన అవసరం లేదని చెబుతున్నాయి. ఈ మేరకు 5జీ సాంకేతికత వల్ల విమాన వ్యవస్థ పనిచేయకపోవడం లేదా విపరీత ప్రవర్తనకు సంబంధించి ఎటువంటి ఆధారాలూ లేవని పౌర విమానయాన అథారిటీ (CAA) భద్రతా నోటీసు స్పష్టం చేస్తోంది. ఈ సమస్యపై మరింత డేటాను సేకరించేందుకు అంతర్జాతీయ సంస్థలతో కలసి పని చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొంది.
Published by:Veera Babu
First published:

Tags: 5G, 5g technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు