Home /News /explained /

ALL YOU NEED TO KNOW ABOUT RELOS AGREEMENT BETWEEN INDIA AND RUSSIA HOW THE PACT BENEFITS TO INDIAN NAVY MKS

Explained: భారత్- రష్యా మధ్య RELOS ఒప్పందం.. దీని వల్ల మన దేశానికి కలిగే ప్రయోజనాలు ఏవి?

భారత్, రష్యా శిఖరాగ్ర సదస్సులో పుతిన్, మోదీ కరచాలనం

భారత్, రష్యా శిఖరాగ్ర సదస్సులో పుతిన్, మోదీ కరచాలనం

భారత్, రష్యా మధ్య కొద్ది గంటల కిందట జరిగిన తాజా సమావేశాల్లో సైనిక సహకారాన్ని మరో పదేళ్లు కొనసాగించడంపై ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయంలో RELOS ఒక ముఖ్యమైన ముందడుగు కానుంది. ఎందుకంటే లాజిస్టిక్స్‌ను పంచుకోవడం ఈ ఒప్పందం లక్ష్యంగా ఉంది. ఈ ఒప్పందంలోని వ్యూహాత్మక ప్రాధాన్యం, దీని వల్ల ఇండియాకు కలిగే మేలు ఏమిటంటే..

ఇంకా చదవండి ...
భారత్- రష్యాల 21వ వార్షిక శిఖరాగ్ర సమావేశాల కోసం మన దేశం చేరుకున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆ దేశ రక్షణ, విదేశాంగ మంత్రులు సైతం ఆయనతో పాటు భారత్‌కు వచ్చారు. రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు 2+2 ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ఇండో-రష్యా సమ్మిట్ ఎజెండాలో రక్షణ సహకారంపై ఇరు పక్షాలు ఎక్కువగా దృష్టిపెట్టాయి. మాస్కో నుంచి అధునాతన ఎయిర్ డిఫెన్స్ S400 ట్రయంఫ్ (S400 Triumf) యాంటీ మిస్సైల్ సిస్టమ్స్ యూనిట్ల డెలివరీ ప్రక్రియ ప్రారంభమైందని రష్యా మంత్రులు తెలిపారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో రెసిప్రోకల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ (RELOS) రూపంలో సైనిక సహకారంపై రెండు దేశాలు పరస్పర ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ సహకార ఒప్పందం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

* భారతదేశం, రష్యా RELOS ఒప్పందాన్ని ఎందుకు కొనసాగిస్తున్నాయి?
మిలిటరీ హార్డ్‌వేర్, టెక్నాలజీ విషయంలో భారత్ అమెరికాపై ఆధారపడటం పెరుగుతున్నప్పటికీ, రక్షణ వ్యవహారాల్లో భారత్- రష్యా మధ్య మొదటి నుంచి బలమైన సంబంధాలు ఉన్నాయి. వాస్తవానికి మన దేశానికి ముందు నుంచి రష్యాతోనే ఎక్కువ రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. భారతదేశం రష్యా నుంచి యుద్ధ విమానాలతో సహా క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసింది. దీంతోపాటు మాస్కో నుంచి దీర్ఘకాలిక లీజుపై అణుశక్తితో నడిచే జలాంతర్గామిని పొందాలని చూస్తోంది. అయితే చైనా, పాకిస్థాన్‌లకు రష్యా మరింత దగ్గరవుతున్న నేపథ్యంలో.. మాస్కో-న్యూఢిల్లీ సంబంధాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయనే వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజా పర్యటన, రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగమని నిపుణులు పేర్కొన్నారు.

Explained: భారత్​ చేతికి​ పవర్​ఫుల్​ AK-203 రైఫిల్స్​.. రష్యా సాంకేతికతతో అమేథీలో తయారీ..తాజా సమావేశాల్లో సైనిక సహకారాన్ని మరో పదేళ్లు కొనసాగించడంపై ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయంలో RELOS ఒక ముఖ్యమైన ముందడుగు కానుంది. ఎందుకంటే లాజిస్టిక్స్‌ను పంచుకోవడం ఈ ఒప్పందం లక్ష్యంగా ఉంది. వాస్తవానికి 2019లోనే ఈ ఒప్పందంపై రెండు దేశాలు సంతకం చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల పెండింగ్‌లో ఉండిపోయింది. ఈ ఒప్పందం రెండు దేశాలు తమ సైనిక-సైనిక సహకారాన్ని పెంచుకోవడానికి ఉద్దేశించినది. ఈ ఒప్పందాలు భారత సైనిక పరిధిని, ముఖ్యంగా వ్యూహాత్మక సముద్ర జలాల్లో భద్రత పరిధిని విస్తరించడంలో సహాయపడనున్నాయని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF) నివేదిక వెల్లడించింది.

మోసం గురూ!! -PM Modi, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్ పేర్లనూ వదల్లేదు -Vaccine Data Fraud* RELOS ఒప్పందంలో భాగంగా ఏం జరగనుంది?
లాజిస్టికల్ ఎక్స్ఛేంజ్ ఒప్పందాలను అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్‌వర్క్‌ కోసం రూపొందించారు. దీని ద్వారా భాగస్వామ్య దేశాలు ఓడరేవులు, స్థావరాలు, మిలిటరీ ఇన్‌స్టలేషన్స్ వంటి సైనిక సదుపాయాలను ఉపయోగించుకునే సౌలభ్యాన్ని పొందగలవు. పరస్పర సహకారం అంటే రష్యన్ నౌకలు, విమానాలు కూడా భారతీయ నౌకాశ్రయాలు, స్థావరాలను యాక్సెస్ చేయగలవు.

etela rajenderపై ప్రతీకారం.. టీఆర్ఎస్‌ క్లర్కుగా కలెక్టర్ హరీశ్.. cm kcrపైనా జమున ఫైర్ఇలాంటి ఒప్పందాలు కీలక వ్యవహారాల్లో ఎంతో సమయాన్ని ఆదా చేస్తాయని ORF పేర్కొంది. ఇంధనం నింపడం, బెర్టింగ్, విమానయాన మౌలిక సదుపాయాల ఉపయోగం వంటి అవసరాల కోసం సైనిక సహాయం పొందినప్పుడు.. ఖర్చులు, రుసుములను రోలింగ్ సెటిల్‌మెంట్ చేయడానికి పేపర్ వర్క్‌ అవసరం ఉండదు. ఇంధనం, రేషన్స్, విడిభాగాల భర్తీని మిలిటరీ లాజిస్టిక్స్ సులభతరం చేస్తుంది. అలాగే యుద్ధనౌకలు, సైనిక విమానాలు, దళాల పోర్ట్ సందర్శనలు, ఉమ్మడి సైనిక విన్యాసాల సమయంలో పరస్పరం బెర్త్ ఎక్స్ఛేంజ్, నిర్వహణను సులభతరం చేస్తుంది.

స్కూల్ పిల్లలు కూడా సిగ్గుపడతారు.. మీరిక మారరా? : బీజేపీ ఎంపీలకు PM Modi సీరియర్ వార్నింగ్* RELOS ఒప్పందం వ్యూహాత్మక ప్రాధాన్యం ఏంటి?
లాజిస్టికల్ ఎక్స్ఛేంజ్ ఒప్పందం నుంచి భారత నౌకాదళం ఎక్కువ ప్రయోజనం పొందుతుందని నిపుణులు భావిస్తున్నారు. భాగస్వామ్య దేశాల మౌలిక సదుపాయాలు మన నావికా దళానికి మెరుగైన కార్యాచరణ, పటిష్టమైన ఇంటర్‌ ఆపరేబిలిటీని అందిస్తాయని విశ్లేషిస్తున్నారు. మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసెస్ (IDSA) నివేదిక ప్రకారం.. రష్యాతో RELOS ఒప్పందం అనేది ఆర్కిటిక్‌లోని రష్యన్ నౌకాశ్రయాలు, సౌకర్యాలకు భారత్‌ను చేరువ చేస్తుంది. తద్వారా ధృవ ప్రాంతాలు, సమీప జలాల్లో భారత నౌకాదళం పరిధి, ఆపరేషనల్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపడుతుంది.

ఇప్పటికే భారతదేశం ఆర్కిటిక్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో ఆర్కిటిక్‌లోని ఉత్తర సముద్ర మార్గాలు, రష్యన్ ఓడరేవులకు భారత నౌకాదళానికి మెరుగైన యాక్సెస్‌ కల్పించడాన్ని భౌగోళిక వ్యూహాత్మక దృక్కోణంలో చూడవచ్చని IDSA చెప్పింది. రష్యా, భారతదేశం కూడా ఆర్కిటిక్ ప్రాంతంలో మెరుగైన ఇంధన సహకారాన్ని అన్వేషిస్తున్నాయి. ఇప్పటికే ఆర్కిటిక్ పరిధిలో మాస్కో- బీజింగ్ అవగాహనలు కుదుర్చుకున్న నేపథ్యంలో.. ఇక్కడ భారతదేశం ఉనికి చైనా వ్యూహాత్మక కార్యక్రమాలకు చెక్ పెట్టేలా ఉంటుందని IDSA విశ్లేషించింది.

ఇలాంటి Zoom Call నెవర్ బిఫోర్ -ఒకేసారి 900 మంది ఉద్యోగుల్ని పీకేసిన Better.com సీఈవో -ఇదే ఆ Video* ఇతర దేశాలతో భారత్‌కు ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయా?
లాజిస్టికల్ ఎక్స్ఛేంజ్‌కు సంబంధించి భారత్ మరో ఆరు దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమితో సహా సింగపూర్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాలతో మన దేశానికి ఇలాంటి ఒప్పందాలు ఉన్నాయి. 2016లో అమెరికాతో లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ (LEMOA)పై భారత్ సంతకం చేసింది. ఆ తర్వాత ఇతర దేశాలతో ఇలాంటి అవగాహన ఒప్పందాలపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం బ్రిటన్, వియత్నాంతో సైతం కొన్ని ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయి.

Shadnagar : చెత్త ఏరుకునే వ్యక్తితో వివాహిత అక్రమ సంబంధం.. భర్త బయటికెళ్లగానే ప్రతిరోజూ.. చివరికి ఏమైందంటే..అయితే ప్రస్తుతానికి ఇరుపక్షాలు RELOS ఒప్పందంపై ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. కొన్ని సమస్యలు పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుతానికి ఈ ఒప్పందాన్ని ఆపేస్తున్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. భవిష్యత్తులో ఈ పరస్పర సైనిక సహకార ఒప్పందంపై ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి రావచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: India, Pm modi, Russia, Vladimir Putin

తదుపరి వార్తలు