Home /News /explained /

AFTER USA EXITS IN AFGHANISTAN CHINA EYES TO CLINCH LUCRATIVE PROJECTS TO EXPLOIT MINERAL RICH AFGHAN WITH THE HELP OF TALIBANS GH SRD

China eyes on Afghan: మరోసారి డ్రాగన్ నైజం బట్టబయలు.. తాలిబన్లతో కలిసి నయా దందా..

తాలిబన్లు, జిన్‌పింగ్ (ఫైల్ ఫోటో)

తాలిబన్లు, జిన్‌పింగ్ (ఫైల్ ఫోటో)

China eyes on Afghan: దశాబ్దాలుగా ఎవరో ఒకరికబంద హస్తాల్లో నలిగిపోతున్నఅఫ్గానిస్థాన్ (Afghanistan).. రేపు చైనా (China) చేతుల్లో చిక్కుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల అమెరికా తన దళాలను అఫ్గాన్ నుంచి ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు ఆ దేశాన్ని తమ చేతిలోకి తీసుకున్నారు.

ఇంకా చదవండి ...
మొన్న సోవియట్ యూనియన్(రష్యా), నిన్న అమెరికా, నేడు తాలిబన్లు (Taliban).. ఇలా నాలుగు దశాబ్దాలుగా ఎవరో ఒకరికబంద హస్తాల్లో నలిగిపోతున్నఅఫ్గానిస్థాన్ (Afghanistan).. రేపు చైనా (China) చేతుల్లో చిక్కుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల అమెరికా తన దళాలను అఫ్గాన్ నుంచి ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు ఆ దేశాన్ని తమ చేతిలోకి తీసుకున్నారు. మరోవైపు, పరోక్షంగా తాలిబన్లకు సహకరిస్తున్న చైనా ఇప్పుడు అక్కడి ఖనిజ నిక్షేపాలపై కన్నేసింది. అక్కడ భారీగా పెట్టుబడులు ( China Investments) పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎందుకంటే, అఫ్గనిస్తాన్​లోప్రపంచంలోనే అత్యధిక లిథియం నిల్వలు అఫ్గాన్ లో ఉన్నాయి. వీటి విలువ దాదాపు 1 ట్రిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కవే ఉంటుంది. అరుదైన నేల సహా బ్యాటరీల ఉత్పత్తిలో వాడే లిథయం, అనేక రకాల ఖనిజాలతో తయారయ్యే హైటెక్ చిప్స్ తో ఆర్థిక వ్యవస్థ పురోగమించే అవకాశం ఉంది. దీంతో డ్రాగన్ కన్ను అఫ్గాన్ పై పడింది. కాగా,తాలిబన్​ను ఉగ్రవాద సంస్థగా పేర్కొని అనేక ఆంక్షలను అమెరికా విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అఫ్గాన్​లోదాదాపు అమెరికా 9.5 బిలియన్లను స్తంభింపజేసింది. ఐఎంఎఫ్ కూడా ఫైనాన్సింగ్ ను తగ్గించింది. తాలిబన్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత అఫ్గాన్ కు 500 మిలియన్ డాలర్లు ఐఎంఎఫ్ పంపిణీ చేయాల్సి ఉంది. అన్ని సరిగ్గా ఉంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాలిబన్లపై ఆంక్షలను సడలించేందుకు చైనా, రష్యా వీటో అధికారం ఉపయోగించే అవకాశమూ లేకపోలేదు. తాలిబన్లు కూడా చైనాకు సానుకూలంగా ఉండే అవకాశముంది.

తాలిబన్లు సంయమనం పాటించాలి..
ఈ నిధులను యాక్సెస్ చేయాలంటే తాలిబన్లు విదేశీయులు, బలహీన అఫ్గాన్లను సజావుగా తరలించాలి. అంతేకాకుండా మరో అంతర్యుద్ధం నివారించడానికి, అనేక మానవ హక్కుల ఉల్లంఘనను ఆపడానికి నాయకులతో చర్చలు జరపాలి.ఆగస్టు 31 గడువులోపు 'రెడ్ లైన్' అని పిలిచే యూఎస్ హెచ్చరికను తాలిబన్లు అధిగమించకూడదు. కాబట్టి వారు సంయమనం పాటించాల్సి ఉంటుంది.

ఆంక్షలు సడలించాలి..
అప్ఘానిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ఆంక్షలు ఎత్తివేయాలని తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహి ఇటీవలే చైనాకు చెందిన సీజీటీఎన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మరిన్ని ఆంక్షల కోసం ఒత్తిడి చేయడం పక్షపాత నిర్ణయమని, ఇది అఫ్గాన్ ప్రజల ఇష్టానికి విరుద్ధమని ఆయన తెలిపారు. ప్రత్యేకించి చైనాతో తమకు మంచి అంతర్జాతీయ సంబంధాలు కావాలని, అఫ్గాన్​లో పెట్టుబడులను డ్రాగన్ విస్తృతంగా పెంచాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరోపక్క చైనా ప్రభుత్వం కూడా తాలిబన్ల పట్ల సానుకూల ధోరణి కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి :  టీమిండియా కొంపముంచిన తప్పులు ఇవే..! ఈ మిస్టేక్స్ రిపీట్ అయితే ఇక అంతే సంగతులు..

పెట్టుబడి అవకాశాలు..
చైనా పెట్టుబడుల కోసం అఫ్గాన్ కూడావ్యూహాత్మకంగా వ్యవహరించనుంది. డ్రాగన్ పై ఉగ్రవాదులు దాడులకు కుట్రలు చేయకుండా నిరోధించాలని, బలమైన ఆర్థిక సంబంధాలను స్థిరత్వాన్ని నిర్ధారించడం కీలకమని బీజింగ్ నాయకులు తాలిబన్లకు పదే పదే చెబుతూ వస్తున్నారు. దీంతొ, అతి త్వరలోనే దేశంలోని ఖనిజ రంగంలో చైనా పెట్టుబడులు పెట్టే అవకాశముంది. అనంతరం పొరుగున ఉన్న పాకిస్థాన్ లో దాదాపు 60 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులతో పాటు చైనా-ఫైనాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను తిరిగి రవాణా చేసే అవకాశాలున్నాయి.కాగా, ఆఫ్గానిస్థాన్ లో 1 ట్రిలియన్ డాలర్ల విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని 2010లో అమెరికా అధికారులు అంచనా వేశారు. వాటి విలువ మూడు రెట్లు ఎక్కువ ఉంటుందని అప్గాన్ ప్రభుత్వం చెప్పింది. వాటిలో లిథియం, అరుదైన ఖనిజ నిక్షేపాలు, రాగి తదితర ఖనిజాలు ఉన్నాయి. అయితే దేశంలో సరైన మౌలిక సదుపాయా, భద్రత సరిగ్గా లేకపోవడం లాంటివి ఈ నిల్వల నుంచి లాభం పొందే ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయి.
Published by:Sridhar Reddy
First published:

Tags: Afghanistan, China, International news, Taliban, USA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు