Explained: కరోనా టీకా తీసుకున్న తర్వాత యాంటీబాడీలు శరీరంలో ఎన్ని రోజులు ఉంటాయి?

ప్రతీకాత్మక చిత్రం

శాస్త్రవేత్తల అధ్యయనంతో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రధానంగా SARS-CoV-2 వైరస్​కు వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీస్ ఆయా వ్యక్తులను బట్టి మారుతుంటాయని తేలింది. "మా అధ్యయనం COVID-19 నుండి రక్షణలో ముఖ్యమైన యాంటీబాటీస్​పై జరిగింది.

  • Share this:
కరోనా మహమ్మారికి చెక్​ పెట్టేందుకు వ్యాక్సినేషన్​ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వ్యాక్సినేషన్​తో శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే, శరీరంలోని యాంటీ బాడీలు అందర్లో ఒకేలా ఉండవు. ఇవి వేర్వేరు కాలాల్లో క్షీణిస్తాయి. కొంతమంది వ్యక్తుల్లో కేవలం రోజుల వ్యవధిలోనే ఇవి క్షీణిస్తే.. మరి కొంత మందిలో దశాబ్దాల కాలం పాటు కొనసాగుతాయి. శరీరంలో యాంటీబాడీలు ఎంత కాలం పాటు నిలిచి ఉంటాయనే విషయంపై సింగపూర్​ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. COVID-19 వ్యతిరేక పోరాటంలో కీలకపాత్ర పోషించే యాంటీబాడీలు దీర్ఘకాలం పాటు శరీరానికి రక్షణగా నిలుస్తాయని ది లాన్సెట్ మైక్రోబ్ జర్నల్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనంలో తేలింది.

తక్కువ యాంటీ బాడీస్ ఉన్నా సరే కరోనా నుంచి త్వరగా కోలుకున్న రోగుల విషయంలో.. వారికి తిరిగి కరోనా నిర్థారణ అయినప్పటికీ త్వరగా కోలుకుంటారని అధ్యయనం స్పష్టం చేసింది. ‘టి’ సెల్స్​ రూపంలో శరీరంలో ఉండే బలమైన రోగనిరోధక శక్తి వ్యక్తులను రక్షిస్తుందని అధ్యయనం పేర్కొంది. సింగపూర్‌లోని డ్యూక్-ఎన్‌యుఎస్ మెడికల్ స్కూల్‌ శాస్త్రవేత్తలు చేసిన ఈ అధ్యయనం 164 మంది కరోనా రోగులపై జరిగింది. వారిని ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు పరిశీలించారు. SARS-CoV-2 వైరస్, టి–కణాలు, రోగనిరోధక వ్యవస్థకు వ్యతిరేకంగా యాంటీబాడీస్​ను న్యూట్రలైజ్​ చేసి వారి రక్తంపై ఈ అధ్యయనం నిర్వహించారు. విశ్లేషణలో భాగంగా.. యాంటీబాడీస్​ ఎంతకాలం వారి శరీరంలో కొనసాగాయనే దాన్ని బట్టి వ్యక్తులను ఐదు గ్రూపులగా వర్గీకరించారు.

మొదటి గ్రూప్​లో, యాంటీబాడీస్​ అభివృద్ధి చేయని వారిని చేర్చారు. వీరికి - ‘నెగటివ్’ గ్రూప్ అని పేరు పెట్టారు. మొత్తం 11.6 శాతం మంది ఈ గ్రూపులో ఉన్నారు. ఇక, 26.8 శాతం మంది రోగులను కలిగి ఉన్న ‘రాపిడ్ వానిషింగ్’ గ్రూప్​కు చెందిన వారిలో యాంటీబాడీస్ త్వరగా తగ్గిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 29 శాతం మంది ‘నెమ్మదిగా క్షీణిస్తున్న’ గ్రూప్​లోకి వచ్చారు. వీరిలో ఆరునెలల పాటు యాంటీబాడీస్​ నిలిచి ఉన్నాయి. ఈ గ్రూప్​కు ‘పాజిటివ్’ అనే పేరు పెట్టారు. 31.7 శాతం వ్యక్తులతో కూడిన 'పర్​సిస్టెంట్​' గ్రూప్​180 రోజుల వరకు వారి యాంటీబాడీ లెవెల్స్​లో స్వల్ప మార్పును చూపించింది.'డిలేయిడ్​ రెస్పాన్స్​' గ్రూపులో మొత్తం 1.8 శాతం మందిని గుర్తించారు. వీరిలో యాంటిబాడీస్​ గణనీయమైన పెరుగుదలను చూపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

వ్యక్తులను బట్టి యాంటీబాడీస్​లో మార్పులు..
కాగా, శాస్త్రవేత్తల అధ్యయనంతో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రధానంగా SARS-CoV-2 వైరస్​కు వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీస్ ఆయా వ్యక్తులను బట్టి మారుతుంటాయని తేలింది. "మా అధ్యయనం COVID-19 నుండి రక్షణలో ముఖ్యమైన యాంటీబాటీస్​పై జరిగింది. SARS-CoV-2 వైరస్​కు వ్యతిరేకంగా యాంటీబాడీస్​ వేర్వేరు వ్యక్తులలో వేర్వేరు రేట్లతో తగ్గుతున్నాయని మేం కనుగొన్నాము.” అని సింగపూర్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్‌సిఐడి) రచయిత డేవిడ్ లై అన్నారు. కొంతమంది వ్యక్తులలో యాంటీబాడీస్​ వేగంగా క్షీణిస్తాయి కాబట్టి, వారు వ్యాక్సిన్​ తీసుకున్నప్పటికీ, తిరిగి కరోనా సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, వ్యాక్సినేషన్​ డ్రైవ్​ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నందున ఫలితాలను స్పష్టం చేయడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published: