హోమ్ /వార్తలు /Explained /

Explained: జర్మనీ Leopard 2 ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపుతుందా..? ఈ ట్యాంకులు ఎందుకంత ఫేమస్..

Explained: జర్మనీ Leopard 2 ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపుతుందా..? ఈ ట్యాంకులు ఎందుకంత ఫేమస్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యుద్ధం ప్రారంభమైన కొత్తలో స్కోల్జ్ ప్రభుత్వం ఆసక్తి చూపకపోయినా.. ఏప్రిల్ 28న ఉక్రెయిన్‌కు భారీ ఆయుధాలను సరఫరా చేసేందుకు జర్మన్ పార్లమెంట్ అంగీకరించింది. కానీ తమ అత్యంత విలువైన ఆయుధమైన లెపర్డ్ 2 యుద్ధ ట్యాంక్‌ను ఉక్రెయిన్‌లోని యుద్దానికి పంపడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఇంకా చదవండి ...

యుద్ధం ప్రారంభమైన కొత్తలో స్కోల్జ్ ప్రభుత్వం(Germany Government) ఆసక్తి చూపకపోయినా.. ఏప్రిల్ 28న ఉక్రెయిన్‌కు(Ukraine) భారీ ఆయుధాలను సరఫరా చేసేందుకు జర్మన్ పార్లమెంట్(Parliament) అంగీకరించింది. కానీ తమ అత్యంత విలువైన ఆయుధమైన లెపర్డ్ 2 యుద్ధ ట్యాంక్‌ను(Leopard 2 War Tanks) ఉక్రెయిన్‌లోని యుద్దానికి పంపడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ తనను తాను రక్షించుకోవడంలో సహాయపడటానికి ప్రత్యేకంగా జర్మన్ మేడ్ ట్యాంకుల కోసం వోల్డిమిర్ జెలెన్స్కీ అభ్యర్థించారు. లెపర్డ్ ట్యాంకులు(Leopard Tanks), సాయుధ సిబ్బంది క్యారియర్లు, హార్పూన్ యాంటీ-షిప్ క్షిపణులు ఐరోపా స్వేచ్ఛ, నాగరికతను రక్షించడంలో సహాయపడుతున్నాయని.. కాబట్టి వీటిని అందించి తమకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. కీవ్ నుంచి విజ్ఞప్తులు ఉన్నప్పటికీ, ఉక్రెయిన్‌కు లెపర్డ్ ట్యాంకులు లేదా మార్డర్ సాయుధ వాహనాలు అందిస్తామని మాత్రం హామీ ఇవ్వలేదు.

Explained: అప్పట్లోనే దేశద్రోహ చట్టాన్ని వ్యతిరేకించిన స్వతంత్ర సమరయోధులు.. దీనిపై తిలక్, గాంధీ, నెహ్రూ ఏమన్నారంటే..


రష్యాతో పోరాడటానికి ఉక్రెయిన్‌కు భారీ ఆయుధాలు ఎందుకు అవసరం..?

ప్రస్తుతం సంఘర్షణకు ఫలితాన్ని రూపొందించే దాడిని ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన తరువాత, ఉక్రెయిన్ తూర్పు, దక్షిణ భాగంలో భారీ దాడులకు రష్యా పాల్పడుతోంది. తమ వైమానిక దళం సామర్థ్యం తగ్గినందువల్ల ఉక్రెయిన్ అందుకునే ఆయుధాలు ఆ దేశానికి చాలా ముఖ్యమైనవి. రష్యా మెరుపుదాడిని ఆపడంలో ఉక్రేనియన్ మిలిటరీకి సహాయం చేయడంలో పాశ్చాత్య ఆయుధాలు కీలక పాత్ర పోషించాయి. అధునాతన పాశ్చాత్య ఆయుధాలను కలిగి ఉంటే ఉక్రేనియన్లు తమను తాము రక్షించుకోవచ్చని, రష్యా ఆక్రమించిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

లెపర్డ్ 2 బ్యాటిల్ ట్యాంక్ అంటే ఏంటి..?

మ్యూనిచ్ ఆధారిత రక్షణ సంస్థ క్రాస్-మాఫీ వెగ్‌మాన్ తయారు చేసిన లెపర్డ్ ట్యాంక్.. 1978 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. అప్పటి నుంచి అనేక మార్పులకు గురైన ట్యాంక్.. 2030 వరకు దానిని భర్తీ చేయడానికి జర్మనీ రక్షణ శాఖ బుండెస్వెహ్ర్ ప్లాన్ చేయలేదు. లెపర్డ్ 2 ఉద్దేశం శత్రువు ట్యాంక్ నిర్మాణాలకు వ్యతిరేకంగా రక్షించడం. దీని 120-మిమీ ఫిరంగి స్థిరమైన, కదిలే లక్ష్యాలను రెండింటినీ టార్గెట్ చేయగలదు. టైగర్ 2 ఫిరంగి కఠినమైన భూభాగాలపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా లక్ష్యాన్ని లాక్ చేయగలదు. లెపర్డ్ 2 నాలుగు మీటర్ల లోతు వరకు నీటిలో కూడా నడవగలదు. అణు, జీవ, రసాయన ఆయుధాల రక్షణతో వచ్చే ఈ ట్యాంక్‌ను 48 గంటల వరకు ఉండేలా డిజైన్ చేశారు నిపుణులు. లెపర్డ్ 2 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 1,500-హార్స్ పవర్ల ఇంజిన్, వేగం- 60 km/h, బరువు - 60 టన్నులు ఉంటుంది. దాడి జరిగినప్పుడు లెపర్డ్‌ అందించే అధిక స్థాయి రక్షణ కోసం దీన్ని ఆఫ్ఘనిస్తాన్‌లో సైన్యం ఉపయోగించింది. దీనికి ముందున్న లెపర్డ్ 1ను మాత్రం ఇప్పటికీ వివిధ దేశాల సైన్యం ఉపయోగిస్తున్నాయి.

Explained: భారీగా క్షీణిస్తున్న రూపాయి విలువ.. ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? తెలుసుకోండి..


లెపర్డ్ 2ను ఉక్రెయిన్‌కు పంపడానికి జర్మనీ ఎందుకు ఇష్టపడటం లేదు..?

ఫిబ్రవరి చివర్లో దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి, మాస్కోతో ఘర్షణను నివారించడానికి జర్మని ప్రభుత్వం ప్రయత్నించింది. రష్యా సరఫరా చేసే సహజ వాయువు జర్మనీకి కీలకమైన శక్తి వనరుగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. చెక్ రిపబ్లిక్ ద్వారా ఉక్రెయిన్‌కు భారీ ఆయుధాలను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సూచించింది జర్మనీ. ట్యాంకుల సరఫరాపై బెర్లిన్‌తో పరాగ్వే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.. చెక్‌లు తమ సోవియట్-కాలం నాటి ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపేందుకు ఇది వీలు కల్పించగలదు. బదులుగా చెక్ రిపబ్లిక్ జర్మనీ నుంచి లెపర్డ్ ట్యాంకులను పొందవచ్చు, కానీ ఇవి మోస్ట్ రీసెంట్ ట్యాంకులు కాకపోవచ్చు. ఇప్పటికే ఆధునీకరించని కొన్ని ట్యాంకులను ఉక్రెయిన్ అందుకుంది.

ఈ ఏర్పాటుపై జర్మనీ ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. ఎందుకంటే మూడో దేశం ద్వారా ట్యాంకుల సరఫరా అనేది మాస్కో నుంచి నేరుగా ఎదురుదెబ్బ పడకుండా కాపాడవచ్చు. సోవియట్ కాలం నాటి ఆయుధాలను పంపడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని వాదించిన జర్మనీ.. ఇప్పటికే వాటిని ఉపయోగించడానికి ఉక్రేనియన్లు శిక్షణ పొందారు. ఉక్రెయిన్‌కు లెపర్డ్ ట్యాంకులను పంపడం వల్ల జర్మన్, రష్యా ట్యాంకుల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతుంది బెర్లిన్. జర్మనీ తన సొంత మిలిటరీని రీస్టాక్‌కు సిద్ధం చేస్తున్నందువల్ల.. తమ సొంత రక్షణ కోసం ఈ ట్యాంకులు అవసరమని జర్మనీ ప్రభుత్వం చెబుతోంది.

Sri Lanka Crisis: శ్రీలంకలో అరాచకత్వం.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు.. పారిపోయిన రాజపక్స కుటుంబం

ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాలపై జర్మనీ వైఖరి ఎలా మారింది..?

కీవ్‌కు ఆయుధాలు అందించాలనే పిలుపును ముందు ప్రతిఘటించిన జర్మనీ.. మానవతా సహాయం అందించడానికి మాత్రమే అంగీకరించింది. సంక్షోభ ప్రాంతాలకు మారణాయుధాలను సరఫరా చేయకూడదనే దశాబ్దాల నాటి విధానాన్ని అనుసరిస్తామని ప్రకటించింది. ఉక్రెయిన్‌కు మందుగుండు సామగ్రి సహాయం చేయాలనే నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినందుకు కొత్త జర్మన్ ఛాన్సలర్‌కు నిరసనలు ఎదురయ్యాయి. మిత్రదేశాలు, జర్మన్ ప్రజల నుంచి ఒత్తిడిని ఎదుర్కొన్న తర్వాత నిబంధనలను స్కోల్జ్ ప్రభుత్వం సవరించింది. ఏప్రిల్ చివర్లో, ఉక్రెయిన్‌కు యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ ట్యాంకులను అందించడానికి బెర్లిన్ అంగీకరించినట్లు జర్మనీ రక్షణ మంత్రి ప్రకటించింది. జర్మనీ ఇప్పటికే ఉక్రెయిన్‌కు తేలికపాటి ఆయుధాలను సరఫరా చేస్తుండగా.. మరి కొన్ని భారీ ఆయుధాల కోసం జర్మనీ నుంచి కీవ్ ఎదురుచూస్తోంది.


ఉక్రెయిన్‌కు జర్మనీ సరఫరా చేసిన ఆయుధాలు ఇవే..

100 మెషిన్ గన్స్, 100,000 హ్యాండ్ గ్రెనేడ్లు, 2,000 మైన్స్, 5,300 ఎక్స్‌ప్లోసివ్ ఛార్జీలు, 16 మిలియన్ రౌండ్ల మందుగుండు సామగ్రి. ట్యాంకులు, ఫిరంగి వంటి భారీ వ్యవస్థలను తదుపరి దశలో బెర్లిన్ ఉక్రెయిన్‌కు అందించే అవకాశం ఉంది.

First published:

Tags: Explained, Germany, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు