Afghanistan: తాలిబన్ ముఖ్య నేతల మధ్య కుమ్ములాటలు.. అధ్యక్ష భవనం వద్దే రచ్చరచ్చ! కారణాలివే 

ప్రతీకాత్మక చిత్రం

Afghanistan Taliban: ప్రభుత్వ ఏర్పాటులో విభేదాల వల్ల ముఖ్య నేతల మధ్య తగాదాలు పెరిగిపోయాయని ఆప్ఘనిస్థాన్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ముఖ్యంగా ప్రభుత్వ చీఫ్ పదవి తనకు దక్కుతుందని ఆశించిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు ప్రస్తుత కేబినెట్‌లోని సభ్యులకు అసలు పొసగడం లేదట.

  • Share this:
Taliban internal fight in Afghanistan: ఆప్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు (Talibans) అంతర్గత కుమ్ములాటల్లో మునిగిపోయారని సమాచారం. ప్రభుత్వ ఏర్పాటులో విభేదాల వల్ల ముఖ్య నేతల మధ్య తగాదాలు పెరిగిపోయాయని ఆప్ఘనిస్థాన్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ముఖ్యంగా ప్రభుత్వ చీఫ్ పదవి తనకు దక్కుతుందని ఆశించిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు  (Abdul Ghani Baradar) ప్రస్తుత కేబినెట్‌లోని సభ్యులకు అసలు పొసగడం లేదట. ఉప ప్రధాని పదవి దక్కినా బరాదర్ మాత్రం ఇంత వరకు ప్రమాణ స్వీకారం చేయలేదని సమాచారం. ఇటీవల కాబుల్ (Kabul) లోని అధ్యక్ష భవనం ఆవరణలోనే బరాదర్‌కు.. తాలిబన్ కేబినేట్‌లోని ఓ సభ్యుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందన్న విషయం బయటికి వచ్చింది. మరోవైపు ఆఫ్ఘన్‌ను తాలిబన్లు చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించిన బరాదర్ కొంత కాలంగా ప్రజల ముందుకు కూడా రావడం లేదు.

తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను గత నెల స్వాధీనం చేసుకున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్స్ అంటూ ఆఫ్ఘన్ పేరును ప్రకటించారు. అలాగే పూర్తిగా పురుషులతోనే మధ్యంతర కేబినేట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు సీనియర్ తాలిబన్ నేతలందరూ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన ఉగ్రవాదుల జాబితాలో ఉన్న వారు కేబినేట్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే హక్కానీ గ్రూపు సభ్యుల ఆధిపత్యం ఎక్కువై పోవడంతో బరాదర్ అసంతృప్తిగా ఉన్నారు. బరాదర్ ప్రధాని కావడం ఖాయమని తొలుత బలమైన అంచనాలు రాగా.. పరిస్థితులు తారుమారై ముల్లా హసన్ అఖుంద్‌కు ప్రధాని పదవి దక్కింది. దీంతో బరాదర్ ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.

Rashid Kahn: అఫ్గాన్ క్రికెట్ బోర్డుపై రషీద్ ఖాన్ ఆగ్రహం.. సంచలన నిర్ణయం తీసుకున్న మిస్టరీ స్పిన్నర్ఈ క్రమంలో బరాదర్‌కు.. కేబినేట్ సభ్యుడు, హక్కానీ మిలిటెంట్ గ్రూపు ప్రధాన నేత ఖలీల్ ఉర్ రహ్మన్ హక్కానీకి మధ్య ఆఫ్ఘన్ అధ్యక్ష భవనంలో తీవ్ర వాగ్వాదం జరిగినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. పరుష పదజాలంతో దూషించుకోవడంతో పాటు ఓ దశలో వారి అనుచరుల మధ్య ఘర్షణ జరిగిందని తెలిసింది. ఖతార్‌లో ఉంటున్న ఓ సీనియర్ తాలిబన్ నేతతో పాటు ఈ ఘర్షణలో పాలుపంచుకున్న ఓ నాయకుడు సైతం దీన్ని ధ్రువీకరించారని ఆ మీడియా పేర్కొంది.

Women Education: మహిళలు పీజీలు.. పీహెచ్ డీలు చేయొచ్చు.. కానీ అది తప్పని సరిముఖ్యంగా తాత్కాలిక ప్రభుత్వ నిర్మాణంపై ఉప ప్రధాని బరాదర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకోవడం వెనుక ఎవరి పాత్ర ఎంత విషయంలో జరిగిన వాదనలో కూడా తాలిబన్ నేతల మధ్య తీవ్ర విబేధాలు వచ్చాయట. తన లాంటి నేతలు దౌత్య, శాంతి చర్చలు జరపడం వల్లనే ఆఫ్ఘన్ హస్తగతమైందని బరాదర్ లాంటి నేతలు అంటుంటే.. తమ పోరాటాల వల్లనే దేశాన్ని చేజిక్కించుకున్నామని తాలిబన్‌లో కీలక పాత్ర పోషిస్తున్న హక్కానీ నెట్ వర్క్ సభ్యులు వాదిస్తున్నారు. ఈ విషయంపైనా గ్రూపు తగాదాలు తీవ్రమైనట్టు సమాచారం.

ఘోర పాపం చేసిన తాలిబన్లు.. ఆరు నెలల బాబు తల్లి భుజాలపై ఉండగానే...అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిన ఏకైక తాలిబన్ నేత బరాదర్. 2020లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో బరాదర్ శాంతి చర్చలు జరిపారు. అంతకు ముందే ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లేలా తాలిబన్ల తరఫున దోహా ఒప్పందంపై బరాదర్ సంతకం చేశారు. మరోవైపు హక్కానీ నెట్‌వర్క్ తీవ్రమైన హింసాత్మక గ్రూపు. తాలిబన్ గ్రూపుకు కీలక నేతలుగా ఉంటున్న ఈ నెట్‌వర్క్ నేతలు దూకుడుగా ఆఫ్ఘనిస్థాన్ దళాలపై దాడులు చేశాయి. హక్కానీ నెట్‌వర్క్ అమెరికా ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉంది. ప్రస్తుతం హక్కానీ నెట్‌వర్క్ నేత సిరాజుద్దీన్ హక్కానీ ఆఫ్ఘన్ తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. తాజాగా వచ్చిన విబేధాల కారణంగా బరాదర్.. కాబూల్‌ను విడిచి, కాందహార్ కు వెళ్లారని కథనాలు వెలువడుతున్నాయి.

మరోవైపు తాలిబన్ల అగ్రనేత హుబతుల్లా అఖుందజద అసలు ఎక్కడున్నారనే విషయంపై చర్చ జరుగుతోంది. ఆప్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నాక ఆయన ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదు.
Published by:Krishna Adithya
First published: