Afghanistan: ఎవరీ అబ్దుల్ ఘనీ బరాదర్.. ఆఫ్ఘన్ అధ్యక్ష పీఠం ఎలా దక్కుతోంది?

అబ్దుల్ ఘనీ బరాదర్ (image credit - twitter - reuters)

Mullah Abdul Ghani Baradar: తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో ఎవరు అధ్యక్షుడు అవుతారో ఆ వ్యక్తిని బట్టీ భారత్ నెక్ట్స్ నిర్ణయాలు ఉంటాయి. మరి అబ్దుల్ ఘనీ బరాదర్ ఎలాంటి వ్యక్తి?

  • Share this:
Afghanistan Crisis: ఆఫ్ఘనిస్థాన్‌లో ఏర్పడ్డ తాలిబన్ల ప్రభుత్వానికి ముల్లా అబ్దుల్​ఘనీ బరాదర్​ (Mullah Abdul Ghani Baradar) నేతృత్వం వహించనున్నారు. త్వరలోనే ఆయన అధికార పీఠం ఎక్కడం దాదాపు ఖరారైంది. తాలిబన్ల అధినేత హిబాతుల్లా అఖుంద్​జమ్... ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ బాస్‌గా ఉండేందుకు సుముఖంగా లేరనే వార్తలు వస్తున్న తరుణంలో బరాదర్​కే పగ్గాలు దక్కనున్నాయని తెలుస్తోంది. 2016 నుంచి తాలిబన్ల బాస్‌ (Taliban Chief)గా ఉంటున్న హిబతుల్లా ఆ పదవిలోనే ఉండాలని అనుకుంటున్నారు. ఆఫ్ఘన్​ప్రభుత్వాన్ని నడపనున్న ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్.. తాలిబన్ల సహ వ్యవస్థాపకుడు. అలాగే ప్రస్తుతం అత్యంత సీనియర్ నాయకుడి (Senior Leader)గా ఉన్నారు. శాంతి చర్చల్లో తాలిబన్లకు నాయకత్వం వహించి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. అసలు అబ్దుల్ ఘనీ బ్యాక్​గ్రౌండ్ ఏంటి? బరాదర్ అనే పేరు ఎలా వచ్చింది? హిబతుల్లా ఎందుకు పగ్గాలు చేపట్టడం లేదు? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

హిబతుల్లా ఎందుకు అధికారం చేపట్టడం లేదు:
తాలిబన్ల ప్రస్తుత అధినేత హిబతుల్లా అఖుంద్​జదమ్... దౌత్యానికి, చర్చలకు మొదటి నుంచి దూరంగానే ఉంటున్నారు. అలాగే ప్రజలకు పెద్దగా పరిచయం లేని నేత. దీంతో తాలిబన్ల అధినేతగానే ఉంటూ.. మతపరమైన అంశాలను బలపరచడంపైనే ఆయన దృష్టి సారించారు. మరోవైపు ఆఫ్ఘన్​ప్రభుత్వాన్ని నడపనున్న బరాదర్​ ప్రజలకు బాగా పరిచయం ఉన్న పేరు. మిలటరీ లీడర్ (Militery Leader) అనే కాకుండా రాజకీయ నేతగా ఆయనకు అంతర్జాతీయంగా పేరుంది. దీంతో తాలిబన్ల ప్రభుత్వానికి అతనే సరైనోడని హిబతుల్లా కూడా భావిస్తున్నట్లు సమాచారం.

Mullah Abdul Ghani Baradar, Afghanistan, Afghanistan Government leader, Baradar Background, Hibatullah Akhundzadam, Taliban Leader, Taliban Government, ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్​, ఆఫ్ఘనిస్థాన్​, ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం, ప్రభుత్వ అధినేత, బరాదర్ బ్యాక్​గ్రౌండ్​, హిబతుల్లా అఖుంద్​జదమ్, తాలిబన్ నేత, తాలిబన్ ప్రభుత్వం,
అబ్దుల్ ఘనీ బరాదర్ (image credit - twitter - reuters)


అబ్దుల్​ఘనీ బరాదర్ ఇన్నాళ్లు ఎక్కుడున్నారు?
2001లో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారం కోల్పోయాక ముల్లా అబ్దుల్​ఘనీ బరాదర్ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. రెండు దశాబ్దాల తర్వాత ఈ ఏడాది ఆగస్టులోనే తొలిసారి ఆఫ్ఘన్‌లో అడుగుపెట్టారు. 2010లో పాకిస్థాన్ ఆయన్ని అరెస్ట్ చేశాక.. అమెరికా జోక్యంతో 2018లో బరాదర్ విడుదలయ్యారు (Released).

బరాదర్ అనే పేరు ఎలా వచ్చింది?
తాలిబన్ల వ్యవస్థాపకుడు ముల్లా మహమ్మద్​ఒమర్ ప్రేమతో అబ్దుల్ ఘనీని బరాదర్ అని పిలిచేవారు. బరాదర్ అంటే సోదరుడు అని అర్థం. మహమ్మద్ ఒమర్ స్వయంగా తన డిప్యూటీగా నియమించుకున్న వారిలో ప్రస్తుతం ఉన్నది అబ్దుల్​ఘనీ ఒక్కరే. దీంతో బరాదర్ తాలిబన్ల దిగ్గజంగా మారారు. అలాగే, ముల్లా మహమ్మద్​ఒమర్​ కుటుంబానికి చెందిన అమ్మాయిని బరాదర్ పెళ్లి (Marriage) చేసుకోవడంతో​బంధువుగానూ మారారు.

అంతర్జాతీయంగా గుర్తింపు:
2020లో ఖతార్‌లో జరిగిన శాంతి ఒప్పంద చర్చలకు తాలిబన్ల తరఫున నాయకత్వం వహించింది అబ్దుల్ ఘనీ బరాదరే. అప్పటి అమెరికా రక్షణ మంత్రి మైక్ పాంపియోను కలిసి చర్చించడం సహా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తోనూ బరాదర్ మాట్లాడారు. ప్రక్రియ మొత్తం సజావుగా సాగేలా చూశారు. అలాగే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వీను కూడా బరాదర్ కలిశారు. మొత్తంగా ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాలు వెళ్లిపోవడంలోనూ బరాదర్​దే కీలకపాత్ర.

స్వాధీనం తర్వాత తొలి ప్రసంగం
గత నెల కాబుల్​ను స్వాధీనం చేసుకున్నాక అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రసంగించారు. ఆప్ఘన్‌లో విజయం సాధిస్తామని అనుకోలేదనీ, అయితే తమకు పరీక్ష ఇప్పుడే మొదలైందని చెప్పారు. దేశాన్ని కాపాడడంతో పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సవాళ్లు తమ ముందున్నాయని వెల్లడించారు.

1996 నుంచి 2001 మధ్య ఆఫ్ఘన్‌లో తాలిబన్ల ప్రభుత్వంలో అబ్దుల్ ఘనీ బరాదర్... రక్షణ శాఖ డిప్యూటీ మంత్రిగా కీలకంగా వ్యవహరించారు. అయితే తనను జైలు పాలుచేసిన పాకిస్థాన్‌తో బరాదర్‌కు సంత్సంబంధాలు లేవని సమాచారం. బారాదర్​పరిపాలన ఎలా ఉంటుందోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

ఇది కూడా చదవండి: వ్యాక్సిన్ వేసేందుకు వచ్చారు.. ఆ తర్వాత ఇంట్లోవాళ్లకు షాక్!

భారత్ వైఖరి ఎలా ఉంటుంది?
తాలిబన్లు ప్రకటించినట్లు బరాదర్ సరికొత్త మార్పుతో కూడిన పాలన అందిస్తే ప్రపంచ దేశాలు స్వాగతిస్తాయి. అలా కాకుండా తమ ఛాందసవాదాన్ని బలంగా రుద్దాలని చూస్తే మాత్రం ప్రపంచ దేశాలు వ్యతిరేకించే అవకాశాలున్నాయి. అమెరికా వారిని వ్యతిరేకిస్తున్న సమయంలో... చైనా వారికి మద్దతివ్వడం సమస్యను పెంచుతోంది. భారత్ విషయానికి వస్తే తాలిబన్లు... కాశ్మీర్ జోలికి రానంతవరకూ సమస్య ఉండదు. అలాకాకుండా పాకిస్థాన్‌తో దోస్తీ కొనసాగిస్తూ... భారత్‌కి వ్యతిరేకంగా పావులు కదిపితే మాత్రం... తాలిబన్లకు అది సమస్యగానే మారుతుందనుకోవచ్చు.
Published by:Krishna Kumar N
First published: