హోమ్ /వార్తలు /Explained /

Afghanistan: కాబూల్ పేలుళ్ల వెనుక IS-K హస్తం.. అసలు వీళ్లెవరు? తాలిబన్లతో లింకేంటి?

Afghanistan: కాబూల్ పేలుళ్ల వెనుక IS-K హస్తం.. అసలు వీళ్లెవరు? తాలిబన్లతో లింకేంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kabul blasts: అప్ఘానిస్తాన్‌ (Afghanistan) రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. గురువారం ఎయిర్‌పోర్టు వెలుపల వరుస పేలుళ్లతో బీభత్సం సృష్టించారు. ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడింది తామేనని ఐఎస్-కే (IS-K) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అసలు ఎవరు వీళ్లు? తాలిబాన్లతో సంబంధముందా?

ఇంకా చదవండి ...

తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన ఆఫ్ఘానిస్థాన్ (Afghanistan)​లో సంక్షోభం ముదురుతోంది. కాబూల్ (Kabul blasts)విమానాశ్రయం బయట జరిగిన భీకర బాంబు పేలుళ్లలో 90 మందికి పైగా చనిపోయారు. 150 మందికి పైగా గాయపడ్డారు. కాళ్లు, చేతులు తెగిపోయి నరకయాతన అనుభవిస్తున్నారు. మృతుల్లో అమెరికా సైనికులు కూడా ఉన్నారు. కాబూల్ ఎయిర్ పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్లేందుకు వేచిచూస్తున్న ప్రజలను టార్గెట్‌గా చేసుకొని మారణహోమం సృష్టించారు. ఐతే ఈ పేలుళ్లకు తామే పాల్పడినట్టు ఐసిస్​-కే (Isis-K) ప్రకటించింది. అసలు ఐసిస్​-కే అంటే ఏంటి.. వీళ్లెవరు.. తాలిబన్లతో వీరికి సంబంధముందా..?

ఐసిస్​-కే పూర్తి పేరు ఇస్లామిక్​ స్టేట్​ ఖొరాసన్​ ప్రావిన్స్​ (ISKP). ఐసిస్​ (ISIS​)కు ఇది ప్రాంతీయ అనుబంధ సంస్థ​. ఐసిస్​-కే ఉగ్రవాద సంస్థ ఆఫ్ఘానిస్థాన్​, పాకిస్థాన్​లో యాక్టివ్​గా ఉంది. ఆప్ఘనిస్థాన్​లో ఉన్న అన్ని ఉగ్రవాద గ్రూపుల కంటే ఐసిస్​-కే చాలా ప్రమాదకరమైన, హింసాత్మకమైన గ్రూపు. ఇరాక్​, సిరియాలో ఐఎస్​ తిరుగులేని శక్తిగా ఉన్న 2015లో ఐసిస్​-కే ప్రారభమైంది. ఆఫ్ఘనిస్థాన్​, పాకిస్థాన్​ జిహాదిస్టులను ఐసిస్​-కే చేర్చుకుంటుంది. అలాగే తమ సంస్థ సరైన తీవ్రతతో లేని భావించే తాలిబన్లు కూడా ఆ గ్రూపులో చేరుతుంటారు.

Kabul: కాబూల్ పేలుళ్లలో 90 మంది మృతి.. అమెరికా ఆగ్రహం.. ప్రతీకారం తప్పదని వార్నింగ్

క్రూరత్వం, అత్యంత హింసాత్మకతకు ఐసిస్​-కే మారుపేరుగా మారిపోయింది. కొన్నేళ్లుగా చాలా భయానక పేలుళ్లకు ఈ గ్రూపు పాల్పడింది. బాలికల పాఠశాలలు, ఆసుపత్రులు, అందులోనూ మెటర్నటీ వార్డులే లక్ష్యంగా బాంబు పేలుళ్లు, మానవ బాంబు దాడులకు ఐసిస్​-కే పాల్పడింది. వీరి దాడుల్లో చాలా మంది బాలికలు, గర్భవతులు, నర్సులు చనిపోయారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్​కే పరిమితం కాగా.. ఐసిస్​-కే ప్రపంచవ్యాప్త ఐఎస్ నెట్​వర్క్​తో భాగస్వామ్యమై ఉంది. పాశ్చాత్య, అంతర్జాతీయ దేశాల్లో దాడులతో పాటు మానవతావాదులను కూడా లక్ష్యంగా చేసుకుంటుంది.

ఎక్కడ ఉంటారు?

ఆప్ఘనిస్థాన్​ నాన్​గర్హర్​ ప్రావిన్స్​లోని తూర్పు ప్రాంతం ఐసిస్​-కే ఉగ్ర సంస్థకు ప్రధాన కేంద్రంగా ఉంది. పాకిస్థాన్ నుంచి ప్రజలను తరలించేందుకు సౌకర్యంగా ఉంటుందని ఐసిస్​-కే అక్కడ మకాం ఏర్పరుచుకుంది. ఐసిస్​-కేలో దాదాపు 3వేల ఉగ్రవాదులు ఉంటారు. అయితే అమెరికా, ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాలు జరిపిన దాడుల్లో గతంలో ఐసిస్​-కే ఉగ్రవాదులు చాలా మంది హతమయ్యారు.

తాలిబన్ల షరియా చట్టం అంటే ఏంటి..మహిళ ఎందుకంతగా భయపడిపోతున్నారు?

తాలిబన్లతో లింక్ ఉందా..?

తాలిబన్లతో ఐసిస్​-కేకు సంబంధాలు ఉన్నాయా అంటే అవుననే చెప్పవచ్చు. అయితే నేరుగా కాకుండా హక్కానీ నెట్​వర్క్ ద్వారా థర్ట్​పార్టీ కనెక్షన్లు ఉన్నాయి. తాలిబన్లకు అత్యంత దగ్గరి సంబంధాలు ఉన్న హక్కానీ నెట్​వర్క్​కు, ఐసిస్​-కేకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. పాకిస్థాన్​లో 2019 నుంచి 2021 మధ్య జరిగిన చాలా బాంబు పేలుళ్లు ఐసిస్​-కే, హక్కానీ నెట్​వర్క్ కలిసి చేశాయని డాక్టర్ సజ్జన్ గోయెల్ చెప్పారు. ఆసియా పసిఫిక్ ఫౌండేషన్​కు చెందిన సజ్జన్ గోయల్​.. ఆఫ్ఘనిస్థాన్​లో మిలిటెంట్ నెట్​వర్క్​ల గురించి చాలా ఏళ్లుగా మానిటర్​ చేస్తున్నారు. ఆగస్టు 15న ఆఫ్ఘనిస్థాన్​ను చేజిక్కించుకున్న తాలిబన్లు ఐఎస్​, ఆల్​ఖైదా మిలిటెంట్లతో పాటు కొందరు ఉగ్రవాదులను జైళ్ల నుంచి విడుదల చేశారు. అయితే ఆప్ఘనిస్థాన్​లో తాలిబన్లకు ఐఎస్ ఉగ్రవాదుల నుంచి సవాళ్లు ఎదురవుతాయన్న అంచనాలు కూడా వెలువడుతున్నాయి.

First published:

Tags: Afghanistan, Kabul, Kabul blast, Taliban, Terror attack, Terrorists

ఉత్తమ కథలు