హోమ్ /వార్తలు /Explained /

Afghanistan: భారత్ పట్ల తాలిబన్ల వైఖరేంటి? CNN న్యూస్18తో ప్రత్యేక ఇంటర్వ్యూ

Afghanistan: భారత్ పట్ల తాలిబన్ల వైఖరేంటి? CNN న్యూస్18తో ప్రత్యేక ఇంటర్వ్యూ

అప్ఘాన్ యువత(ఫైల్ ఫొటో)

అప్ఘాన్ యువత(ఫైల్ ఫొటో)

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌ను తమ వశం చేసుకున్న తాలిబన్లు తొలిసారిగా... CNN న్యూస్18కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఇంటర్వ్యూ పూర్తి సారాంశం ఇదీ.

Afghanistan: అమెరికాకు తాలిబన్లు ఇచ్చిన డెడ్‌లైన్ రేపటితో ముగుస్తుంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ 100 శాతం తాలిబనిస్థాన్ అవుతుంది. ఆ తర్వాతేంటి అన్నదే అసలు సమస్య. తాలిబన్లు అరాచకాలు చేస్తారా... బుద్ధిగా పరిపాలిస్తారా అన్నది తేలాల్సిన ప్రశ్న అయితే... భారత్ పట్ల తాలిబన్లు ఎలా వ్యవహరిస్తారన్నది మరో అంశం. ఇన్నాళ్లూ తాలిబన్లను పోషించిన పాకిస్థాన్... భారత్‌కి వ్యతిరేకంగా తాలిబన్లను వాడుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. మరి తాలిబన్లు ఏమంటున్నారు. తాలిబన్ల టాప్ లీడర్, ఆఫ్ఘనిస్థాన్ ఇస్లామిక్ ఎమిరేట్ డిప్యూటీ పొలిటికల్ ఆఫీసర్, అమెరికాతో సంప్రదింపులు జరిపే బృందానికి హెడ్ అయిన షేర్ మహ్మద్ స్థానాక్‌జాయ్ తొలిసారిగా CNN న్యూస్18కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రశ్న: భారత్ పట్ల తాలిబన్ నిర్వహణా యంత్రాంగం ఎలాంటి వైఖరితో ఉందని మీరనుకుంటున్నారు?

సమాధానం: ఆఫ్ఘనిస్థాన్ ఇస్లామిక్ ఎమిరేట్‌కి విదేశీ పాలసీ ఉంది. మేము మా చుట్టుపక్కల దేశాలు, ప్రపంచంతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి అనుకుంటున్నాం. అమెరికా సంయుక్త దళాలు ఇక్కడ 20 ఏళ్లుగా ఉన్నాయి. ఇప్పుడు వైదొలగిపోతున్నాయి. కాబట్టి ఇకపై మేము అమెరికాతో స్నేహ సంబంధాలు కలిగివుంటాం. అలాగే నాటోతో కూడా. అందువల్ల వారు తిరిగి వచ్చి ఆఫ్ఘనిస్థాన్‌లో పునరావాస కార్యక్రమాలు చేపడతారని భావిస్తున్నాం. అలాగే ఇండియా విషయంలోనూ. భారత్‌తో మేము సాంస్కృతికంగా, ఆర్థికంగా, అన్ని రకాలుగా ఇంతకుముందులాగే స్నేహపూర్వక సంబంధాలు కలిగివుండాలి అనుకుంటున్నాం. ఇండియాతో మాత్రమే కాదు... చుట్టుపక్కల దేశాలైన తజకిస్థాన్, ఇరాన్, పాకిస్తాన్‌తోనూ అలాగే ఉండాలనుకుంటున్నాం.

షేర్ మహ్మద్ స్థానాక్‌జాయ్

ప్రశ్న: తాలిబన్లు భారత్‌కి వ్యతిరేకంగా మారతారనే భయం ఉంది. ఇండియా లక్ష్యంగా పాకిస్థాన్‌తో చేతులు కలుపుతారనే అభిప్రాయం ఉంది. దీన్ని ఎలా చూస్తారు? ఇది కరెక్టా, రాంగా?

సమాధానం: మీడియాలో వస్తున్నది చాలా వరకు రాంగే. మావైపు నుంచి అలాంటి ప్రకటన గానీ, సంకేతం గానీ లేదు. మేమీ ఈ ప్రాంతంలో మా చుట్టుపక్కల అందరితోనూ సత్సంబంధాలు కోరుకుంటున్నాం.

ప్రశ్న: లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలతో తాలిబన్లు కలిసి ఆఫ్ఘనిస్థాన్‌లో ఓ గ్రూపుగా ఏర్పడి ఇండియాకి ప్రమాదకరంగా మారతారనే భయం ఉంది. దీనిపై మీ కామెంట్ ఏంటి?

సమాధానం: మా చరిత్రను చూస్తే... ఆఫ్ఘనిస్థాన్ వైపు నుంచి భారత్ సహా చుట్టుపక్కల దేశాలకు ఎలాంటి హానీ ఎప్పుడూ జరగలేదు. ఇండియా, పాకిస్థాన్ మధ్య రాజకీయంగా, భౌగోళికంగా సుదీర్ఘమైన వివాదం ఉంది అనడంలో అనుమానం అక్కర్లేదు. వారి అంతర్గత యుద్ధంలో ఆఫ్ఘనిస్థాన్‌ను వాడుకోరని మేం కోరుకుంటున్నాం. వారికి పొడవైన సరిహద్దు ఉంది. వారు సరిహద్దు దగ్గర వారికి వారు యుద్ధం చేసుకోవచ్చు. వారు దానికి ఆఫ్ఘనిస్థాన్‌ను వాడుకోకూడదు. అలాగే మేము కూడా ఏ దేశాన్నీ ఇందుకోసం మా భూభాగాన్ని వాడుకోనివ్వం.

ప్రశ్న: లష్కరే, జైషేలకు మీ భూమిపై చోటు లేదని మీరు బలమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. దాన్ని మీరు నిర్ధారస్తున్నారా (confirming)?

సమాధానం: ఇది మా బాధ్యత. మేము ఆఫ్ఘన్ సైడ్ నుంచి ప్రపంచంలోని ఏ దేశానికీ వ్యతిరేకంగా పనిచేయడానికి ఎవర్నీ అనుమతించం.

ప్రశ్న: సార్, మీరు కొన్ని దశాబ్దాల కిందట IMAలో ట్రైనింగ్ పొందారు. ఆ ప్లేస్ గురించి ఏదైనా గుర్తుందా? మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీకు ఎలా గడిచింది?

సమాధానం: నా చిన్నప్పుడు, రష్యన్లు ఆఫ్ఘనిస్థాన్‌కి రాకముందు నేను ఇండియాలో ట్రైనింగ్ పొందాను. IMA ట్రైనింగ్‌లో ఉన్నాను. IMA నుంచే గ్రాడ్యుయేషన్ చేశాను.

ప్రశ్న: ఇప్పటికీ వారితో మీరు టచ్‌లో ఉన్నారా?

సమాధానం: లేదు. ఇండియాలో లేరు.

ప్రశ్న: కొన్ని రోజుల కిందట కాబూల్‌లో దాడిపై మీరు ఎవర్ని నిందిస్తారు?

సమాధానం: మీడియాలో చూశాను... తామే దాడి చేశామని దాయిష్ (Daish) చెప్పింది.

ప్రశ్న: కానీ రిపోర్టులు, నిఘావర్గాలు ఏం సూచించాయంటే.. హక్కానీ ఈ దాడికి పాల్పడగా, ఐసిస్ (ISIS) తామే చేశామని అంటోందని సూచించాయి. మీరేమంటారు?

సమాధానం: బహుసా ఆప్ఘన్ ప్రజలకు శత్రువులే ఇలా అని ఉంటారు. ఇది నిజంకాదు. పూర్తిగా అబద్ధం. దాయిష్ తామే చేసామని ప్రకటించుకుంది కాబట్టి... ఇది దాయిష్ చేసినట్లే.

ప్రశ్న: ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటికీ చాలా మంది హిందువులు, సిక్కులు ఉన్నారు. వారు భారత్ వెళ్లేందుకు ఇండియాకి మీరు సాయం చేస్తారా?

సమాధానం: నేననుకోవడం అసలు వాళ్లను ఖాళీ చేయించాల్సిన పని లేదు. ఆఫ్ఘనిస్థాన్ వారి దేశం. వారు ఇక్కడ ప్రశాంతంగా బతకొచ్చు. వారికి ఎలాంటి హానీ జరగదు. ఇంతకు ముందు వారు ఎలా బతికారో, అలాగే బతకొచ్చు. వారు గత 20 ఏళ్లుగా ఆఫ్ఘనిస్థాన్‌కి వచ్చి ఉంటున్నారు. ఆల్రెడీ వెళ్లిన వారు కూడా తిరిగి ఆఫ్ఘనిస్థాన్ రావాలని మేము కోరుకుంటున్నాం.

ప్రశ్న: తాలిబన్లను ప్రపంచ దేశాలు, ఇండియా గుర్తించేందుకు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు.

సమాధానం: మేము ఆశిస్తున్నాం. వాస్తవంలో క్షేత్రస్థాయిలో ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మా పొరుగు దేశాలు, ప్రపంచ దేశాలు మాతో మంచి సత్సంబంధాలు కలిగివుండాలి. మేము కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించగానే... అమెరికా సహా అన్ని దేశాలూ మాకు సపోర్టుగా ఉంటాయని భావిస్తున్నాం.

ప్రశ్న: ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధికి ఇండియా చాలా చేసింది. దానికి ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు?

సమాధానం: ఆఫ్ఘనిస్థాన్‌లో ఇండియా చేసిన అభివృద్ధి ఇప్పుడు మా జాతీయ సంపద. మేము దాన్ని అలాగే ఉంచుతాం. అంతేకాదు... భవిష్యత్తులో పెండింగ్ ఉన్న పనులు కూడా భారత్ పూర్తి చేస్తుందని ఆశిస్తున్నాం. ఆగిపోయిన ప్రాజెక్టులను తిరిగి కంప్లీట్ చెయ్యమని మేము భారత్‌ను ఆహ్వానిస్తున్నాం.

ఇది కూడా చదవండి: Paralympics: పారా ఒలింపిక్స్‌లో సంచలనం... గోల్డ్ సాధించిన అవనీ లేఖరా

ప్రశ్న: మీరు పూర్తి భద్రత కల్పిస్తారా?

సమాధానం: ఎస్. ఎవరైనా మా దేశానికి వచ్చి, మా దేశంలో పనిచేస్తే... మేము వారికి సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుంది. మీరు అలాంటి ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నాను.

First published:

Tags: Afghanistan, America, India, Kabul, Pakistan, Taliban

ఉత్తమ కథలు