హోమ్ /వార్తలు /Explained /

Explained: ఢిల్లీ ప్రభుత్వం, LG మధ్య మరో వివాదం.. దానికి కారణమైన ఫిన్లాండ్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ ట్రైనింగ్‌ ఏంటి?

Explained: ఢిల్లీ ప్రభుత్వం, LG మధ్య మరో వివాదం.. దానికి కారణమైన ఫిన్లాండ్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ ట్రైనింగ్‌ ఏంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Explained: ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) సక్సేనా మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. ఈ రాజకీయ చిచ్చుకు కారణమైన ఫిన్లాండ్‌ టీచర్‌ ట్రైనింగ్‌ అంశంపై ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది.  

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government), లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (LG) సక్సేనా మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. శిక్షణ కోసం ఉపాధ్యాయులను ఫిన్లాండ్‌కు పంపాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఎల్జీ అడ్డుకోవడాన్ని ఆప్‌ ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. ఎల్జీ తీరును నిరసిస్తూ సీఎం కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీ నుంచి సక్సేనా ఆఫీసుకు ర్యాలీ నిర్వహించారు. ఈ విషయంపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విలేకరులతో మాట్లాడారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం ఎల్జీకి లేదని చెప్పారు. టీచర్‌ ట్రైనింగ్‌ కోసం ఉపాధ్యాయులను ఫిన్లాండ్‌ పంపించాలనే ఆర్డర్ ఫైల్‌ను ఎల్జీ ఆపివేయడంతోపాటు ఖర్చులు తగ్గించుకునేలా చూడాలని సలహా ఇచ్చారన్నారు. ఈ రాజకీయ చిచ్చుకు కారణమైన ఫిన్లాండ్‌ టీచర్‌ ట్రైనింగ్‌ అంశంపై ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది.

* ఫిన్లాండ్‌ విద్యా వ్యవస్థ ప్రత్యేకమా?

మిగిలిన దేశాల విద్యా వ్యవస్థలతో పోలిస్తే ఫిన్లాండ్‌ ఎడ్యుకేషన్‌ సిస్టం చాలా ప్రత్యేకమైనది. స్మిత్‌ సోనియన్‌ నివేదిక ప్రకారం... ఇక్కడ చిన్న పిల్లలకు చాలా తక్కువ పరీక్షలు ఉంటాయి. తొమ్మిదేళ్లలోపు పిల్లలకు ఒకసారి మాత్రమే పరీక్షలు పెడతారు. పాఠశాలలు, ప్రాంతాల మధ్య పోటీలు, ర్యాకింగులు అంటూ ఎలాంటి హడావిడీ ఉండదు. విద్యార్థితో పక్క విద్యార్థిని పోల్చడాలు ఉండవు. ఈ పాఠశాలలు ప్రభుత్వ సహకారంతో పని చేస్తాయి. వీటికి ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రజలు, ఎడ్యుకేటర్లు మాత్రమే ఇంఛార్జ్‌లుగా ఉంటారు.

* ఎగ్జామ్స్ ఉండవు

ఫిన్లాండ్‌లో నేషనల్ ఎడ్యుకేషనల్‌ గోల్స్‌ అన్ని స్కూళ్లకు ఒకలాగే ఉంటాయి. యూనివర్సిటీల్లో ట్రైన్‌ అయిన టీచర్లు అన్ని పాఠశాలల్లో ఉంటారు. దీంతో పట్టణాలు, నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని స్కూళ్లలోనూ ఒకే రకమైన నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుంది. ఫిన్లాండ్‌ విద్యా వ్యవస్థలో క్వాలిటీ అనేది చాలా ముఖ్యమని టీచర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఒల్లి లుక్కైనెన్ స్మిత్ సోనియన్‌తో అన్నారు. ఈ విషయంపై ఫిన్లాండ్‌ ఎడ్యుకేషన్‌, కల్చరల్‌ మినిస్ట్రీలో పని చేస్తున్న మాజీ ఫిజిక్స్‌ టీచర్‌ పాసి షల్బర్గ్‌ మాట్లాడారు. తాము పిల్లలకు విషయాలను ఎలా అర్థం చేసుకోవాలో చెబుతాం తప్ప పరీక్షలు ఎలా రాయాలో కాదని చెప్పారు.

* భారీగా గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్

93శాతం ఫిన్లాండ్‌ పిల్లలు గ్రాడ్యుయేట్లు అవుతున్నారు. అది అమెరికా కంటే 17.5 శాతం ఎక్కువ. 66 శాతం మంది ఇంకా ఉన్నత చదువులకు వెళుతున్నారు. అది యూరోపియన్‌ యూనియన్‌లో హయ్యస్ట్‌ రేట్‌. అయినప్పటికీ యునైటెడ్ స్టేట్స్ కంటే ఫిన్లాండ్‌ విద్యార్థి చదువుకు 30% తక్కువ ఖర్చు పెడుతున్నాడు.

* ఇంత మంచి విద్యా వ్యవస్థ రూపుదిద్దుకోవడానికి కారణాలు ఏమంటే?

చాలా పాఠశాల వ్యవస్థలు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడంపైనే దృష్టి పెట్టేవి. అంతే తప్ప విద్యార్థులు నేర్చుకోవడానికి తగిన హెల్దీ వాతావరణాన్ని సృష్టించడం మరిచిపోయేవి. దీంతో కొన్ని సంవత్సరాల క్రితం ఫిన్లాండ్‌ విద్యా వ్యవస్థలో రిఫార్మ్స్‌ అవసరం అయ్యాయని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వెల్లడించింది. దీంతో అప్పుడు ఫిన్లాండ్‌ మళ్లీ బేసిక్‌ విద్యావ్యవస్థ వైపు రాకుండా కొత్తగా ప్రయత్నాలు చేసింది.

ఇది కూడా చదవండి : సీఎం సంచలన నిర్ణయం..పిల్లల్ని కనడానికి ప్రభుత్వమే రూ.3లక్షల సాయం,జీతం పెంపు!

* మార్పు ఎలా సాధ్యమైంది?

ఫిన్లాండ్ 1980ల నుంచీ కొన్ని విషయాలకు ప్రాముఖ్యత ఇచ్చింది. చాలా మంది పిల్లలు బడులకు వెళ్లడం అంటే తాము జైళ్లలో చిక్కుకున్న ఫీలింగ్‌లో ఉంటారు. అలాంటి వాతావరణం నుంచి వారిని బయటకు తేవడానికి రియల్‌ వరల్డ్‌కి దగ్గరగా తరగతులు ఉండేలా జాగ్రత్త పడింది. సామాజిక అసమానతలను విద్య ద్వారా రూపుమాపాలని తలచింది. మధ్యాహ్న భోజన పథకానికి అందరినీ అర్హులను చేసింది. వీరికి హెల్త్‌ కేర్‌ యాక్సెస్‌ను ఈజీ చేసింది. వ్యక్తిగతంగా సూచనలు ఇస్తూ విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడాలని తలచింది.

అయితే పాఠశాలల్లో పిల్లలు ఏడేళ్లకు జాయిన్‌ అవ్వవచ్చు. అంతకు ముందు బడికి రావాలన్న నిబంధన ఏమీ లేదు. తొమ్మిదేళ్లపాటు కంపల్సరీ స్కూలింగ్‌ నిబంధనను తీసుకువచ్చింది. 8th గ్రేడ్‌ ఆప్షనల్‌ గానీ తొమ్మిదో గ్రేడ్‌ మేండేటరీ. ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఫిన్లాండ్‌ విద్యా వ్యవస్థ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించుకుంది.

First published:

Tags: Delhi, EDUCATION, Finland

ఉత్తమ కథలు