• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • A STUDY SAYS ANIMALS FAKE DEATH FOR LONG PERIODS TO ESCAPE PREDATORS SK

అడవిలో వేట.. మృత్యు ముంగిట.. జంతువులు ఎలా తప్పించుకుంటాయో తెలుసా?

అడవిలో వేట.. మృత్యు ముంగిట.. జంతువులు ఎలా తప్పించుకుంటాయో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

పెద్ద పెద్ద మాంసాహార జంతువుల నుంచి తప్పించుకోవాలంటే.. చిన్న జంతువులు ఇలాంటి దాగుడు మూతల గేమ్ ఆడాల్సిందేనని.. బ్రిస్టల్ యూనివర్సీ ప్రొఫెసర్లు చెబుతున్నారు.

  • Share this:
    మనకు ఆకలేస్తే.. ఇంట్లో వండిన భోజనాన్ని.. ప్లేటులో పెట్టుకొని ఎంచక్కా తింటాం. లేదంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకొని లాగించేస్తాం. మరి అడవుల్లో ఉండే జంతువల పరిస్థితేంటి? శాకాహారం తినే జంతువులు ఆకులో, పండ్లనో తిని బతుకుతాయి. కానీ మాంసాహర జంతువులు అలా కాదు. వేటాడాలి. తమ కన్నా చిన్న జీవులను చంపుకు తినాలి. అవును... అడవిలో నిత్య యుద్ధం జరుగుతుంది. చిన్న జంతువులు, కీటకాలను పెద్ద మాంసాహార జీవులు వేటాడి తింటాయి. అలాంటప్పుడు చిన్న జీవులు విలవిల్లాడుతాయి. వాటికి ఆహారం కాకుండా ఉండేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటాయి. అందుకోసం ఏం చేస్తాయో తెలుసా..?

    అడవుల్లో చిన్న చిన్న జంతువులు, కీటకాలకు మనుషుల్లానే డ్రామాలు ఆడడం తెలుసు. అందుకే అవి బతుకుతున్నాయి. లేదంటే పుట్టిన కొన్ని రోజుల్లోనే చనిపోతాయి. పెద్ద జంతువులకు ఆహారగా మారిపోతాయి. అవును.. చాల జంతువులు తాము చనిపోయినట్లు నటించి.. వేటాడే జంతువుల నుంచి తమ ప్రాణాలు దక్కించుకుంటున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.

    ఇంగ్లండ్‌కు చెందిన బ్రిస్టల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. తమకు వద్దకు ఏదైనా పెద్ద జంతువు వస్తుందంటే.. చిన్న జంతువులు వెంటనే చనిపోయినట్లు నటిస్తాయి. చాలా సేపు కదలకుండా అలాగే ఉండిపోతాయి. అది నిజంగానే మరణించిందా? లేదంటే నటిస్తుందా? అని చెక్ చేసే టైమ్ పెద్ద జంతువులకు ఉండదు. ఎందుకంటే అవి బాగా ఆకలితో ఉంటాయి. వెంటనే ఏదో ఒకటి తినేయాలని భావిస్తాయి. ఆ సమయంలో ఏవైనా జంతువులు కదలకుండా ఉండిపోతే.. అవి చనిపోయినట్లుగా భావించి అక్కడి వేరొక ప్రాంతానికి వెళ్లిపోతాయి. మరొక జీవిని వేటాడేందుకు ప్రయత్నిస్తాయి.

    బ్రిస్టల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పలు కీటకాలపై ఈ ప్రయోగం చేశారు. ఓ బీటెల్ (పేడ పురుగు) దగ్గరకు పక్షిని పంపించగా.. వెంటనే అది కదలకుండా ఉండిపోయింది. దాదాపు 23 నిమిషాల పాటు ఏ మాత్రం కదలిక లేకుండా పడిపోయింది. యాంట్లియాన్ లార్వే అనే మరో కీటకం ఏకంగా గంట సేపు కదలకుండా ఉండింది. చనిపోయినట్లుగా నటించి తప్పించుకుంది. పెద్ద పెద్ద మాంసాహార జంతువుల నుంచి తప్పించుకోవాలంటే.. చిన్న జంతువులు ఇలాంటి దాగుడు మూతల గేమ్ ఆడాల్సిందేనని.. బ్రిస్టల్ యూనివర్సీ ప్రొఫెసర్లు చెబుతున్నారు. మనకు ఇలాంటి అనుభవం ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది. పక్షలు గానీ, జంతువు గానీ.. మనల్ని చూసి చనిపోయినట్లుగా నటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు