Andhra Pradesh: క్షణ క్షణం భయం భయం... నిద్రలేని రాత్రులు ఎన్నో.. ఈ మహానగరానికి ఏమైంది..?

ఈ మహా నగరానికి ఏమైంది.. క్షణ క్షణం భయం భయం

పేరుకు మహా నగరం.. ఎన్నెన్నో ప్రత్యేకతలు.. కానీ ప్రతి రోజూ భయం భయంగా ఉండాల్సి వస్తోంది. అసలు నిద్ర లేని రాత్రులే వెంటాడుతున్నాయి అంటున్నారు నగర వాసులు.. ఇంతకీ ఈ మహా నగరానికి ఏమైంది?

  • Share this:
    పేరుకు మహా నగరం.. మరోవైపు ప్రశాంతతంకు మారు పేరు అని గుర్తింపు.. టూరిజంలో నెంబర్ వన్ ప్లేస్.. ఐటీ హబ్ గా ఎదుగుతున్న వైనం.. ఇవన్నీ ఒకవైపు మాత్రమే.. త్వరలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని కాబోతున్న విశాఖనగరంలో ప్రస్తుతం పరిస్థితి క్షణ క్షణం.. భయం భయంగా మారింది. ముఖ్యంగా విశాఖ జిల్లాను వ‌ర‌స అగ్ని ప్ర‌మాదాలు భ‌య‌పెడుతున్నాయి. గ‌తేడాది నుంచి విశాఖ జిల్లాలో త‌ర‌చుగా అగ్నిప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. దీంతో జిల్లాలోని ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. స్థానిక ప్రజలు ఎన్నో నిద్రలేని రాత్రులు గిపామంటున్నారు. ప్ర‌శాంత‌త‌కు, ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌కు మారుపేరైన విశాఖ జిల్లాలో వ‌ర‌స ప్ర‌మాదాలు జ‌రుగుతుండటం ఆంధోళ‌న క‌లిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది నుంచి ఎందుకిలా జరుగుతోందని స్థానికులు భయం భయంగా గడుపుతున్నారు. ఇప్పటికైన ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండి.. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలిని కోరుతున్నారు. వరుస ప్రమాదాలకు అధికారుల వైఫల్యమే కారణమనే వాదన వినిపిస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు హెచ్చరించడం.. తరువాత నివేదికల పేరుతో కాలయాపన చేస్తూ.. కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే అంతా నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

    తాజాగా, అర్ధరాత్రి సింహాచ‌లం ఏపీ ట్రాన్స్ కో స‌బ్ స్టేష‌న్లో మంట‌లు చెల‌రేగాయి. స‌బ్ స్టేష‌న్లోని ట్రాన్స్ ఫార్మ‌ర్లు భారీ శ‌బ్దంతో పేలాయి. దీంతో స్టానిక ప్ర‌జ‌లు భ‌యాంధోళ‌న‌ల‌కు గుర‌య్యారు. పెద్ద ఎత్తున మంట‌లు ఎగ‌సిప‌డ‌టంతో ఫైర్ సిబ్బందికి స‌మాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కారణాలు ఎంటి అనే విష‌యంపై దర్యాప్తు చేస్తున్నారు.

    ఇటీవల విశాఖపట్నంలో పారిశ్రామిక ప్రమాదాలకు అంతం లేకుండా పోతోంది. ఏదో ఒక పరిశ్రమలో ప్రతి నెలా ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. పరవాడలోని ఫార్మాసిటీ, అచ్యుతాపురం, నక్కపల్లి పారిశ్రామికవాడలు, స్టీల్‌ప్లాంట్‌, హెచ్‌పీసీఎల్‌, దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది ఇదే మే నెలలో గోపాలపట్నంలో ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరిన్‌ గ్యాస్‌ లీకై 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత హిందూస్థాన్‌ షిప్‌యార్డులో క్రేన్‌ పనితీరు పరిశీలిస్తుండగా విరిగిపడి ఎనిమిది మంది మరణించారు. కరోనా సమంలో పరిశ్రమలను నడపడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని ఎంతవరకు పాటిస్తున్నదీ అధికారులు ఏనాడూ పరిశీలించిన దాఖలాలు లేవు. సరగ్గా రెండు వారాల క్రితం దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లో విదేశాల నుంచి తుక్కు తెచ్చే ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

    తాజాగా మొన్న ఆదివారం అర్థరాత్రి పరవాడ మండలం భరణికం గ్రామంలో అనన్య ఫార్మా కంపెనీలో లిక్విడ్‌ అమోనియం గ్యాస్‌ లీకై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళ్ల మంటలు, ఒళ్లంతా దురదలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌ కంపెనీని తాత్కాలికంగా షట్‌డౌన్‌ చేయించి, విచారణకు ఆదేశించారు. తాజాగా మంగళవారం హెచ్‌పీసీఎల్‌లో క్రూడాయల్‌ శుద్ధి చేసే యూనిట్‌-3లో మంటలు చెలరేగాయి. భారీ ప్రమాదమేనని అంతా భావించారు. అయితే అధికారులు తక్షణమే స్పందించడం, ఆ యూనిట్‌కు క్రూడాయిల్‌ సరఫరా నిలిపివేయడం, ఆరుకు పైగా అగ్నిమాపక శకటాలతో నీటిని విరజిమ్మడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.

    ఇదీ చదవండి: ఆంజనేయుడి జన్మస్థలం ఇదే.. నేడు క్లారిటీ ఇవ్వనున్న టీటీడీ.. కిష్కంద వాదన ఏంటి..?

    హెచ్‌పీసీఎల్‌, స్టీల్‌ప్లాంటు, షిప్‌యార్డు, ఫార్మా సిటీ వంటి భారీ పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే విచారణకు ఆదేశించినా, ఆ తరువాత నివేదిక బయటకు రాకుండా, ఎటువంటి చర్యలు లేకుండా కాలం గడిపేస్తున్నారు. గత ఏడాది షిప్‌యార్డులో జరిగిన క్రేన్‌ ప్రమాదానికి యాజమాన్యం పొరపాటే కారణమని తేలినా ఇప్పటివరకు ఏ ఒక్కరిపైనా చర్యలు చేపట్టలేదు. ఇక ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదానికి సంబంధించి హైపవర్‌ కమిటీ సిఫారసులను అమలు చేయలేదు. అలాగే స్టీల్‌ప్లాంటులో ఏమి జరిగినా బయటకు పొక్కనివ్వరు. అది ప్రభుత్వ సంస్థ అయినా, ప్రైవేటు సంస్థ అయినా గోప్యంగా ఉంచుతున్నారు. ప్రమాదం జరిగిన రెండు మూడు రోజులు హడావిడి చేసి ఆ తరువాత దానిని పక్కన పెట్టేస్తున్నారు. దాదాపుగా 20 వేల కోట్ల వ్యయంతో కొన్నేళ్లుగా విస్తరణ పనులు చేపడుతున్న హెచ్‌పీసీఎల్‌లో రోజూ వేయి మందికి తక్కువ లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ప్రమాదం జరిగిన యూనిట్‌లో కూడా 100 మంది వరకు విధుల్లో ఉన్నారు. సైరన్‌ మోగడం వల్ల వారంతా అప్రమత్తమై ప్రాణాలు దక్కించుకున్నారు. లేదంటే...కొందరు బలి అయిపోయి ఉండేవారు.

    ఇదీ చదవండి:భారత్ లో కియా పేరు మార్పు..? పేరు మార్చడానికి కారణం ఇదే..?

    పరిశ్రమల్లో భద్రత వ్యవహారాలు పరిశీలించే ఇన్‌స్పెక్టరీస్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్స్‌ ఆర్గనైజేషన్, బాయిలర్స్‌ విభాగం వంటివి పూర్తిస్థాయిలో అన్ని పరిశ్రమలను సకాలంలో తనిఖీ చేయలేకపోతున్నాయి. ఎవరికి వారు నిర్దేశించిన ప్రమాణాలు పాటిస్తూ, భద్రతకు తగిన జాగ్రత్తులు తీసుకోవాలని చెబుతున్నారు. కానీ కొన్ని సంస్థలు వాటిని పెడచెవిన పెడుతున్నాయి. అటువంటిచోట్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. హెచ్‌పీసీఎల్‌లో మంగళవారం జరిగిన ప్రమాదానికి కూడా నిపుణులు ఆ యూనిట్‌లో లేకపోవడమే కారణమని కార్మికులు చెబుతున్నారు. ఆ యూనిట్‌లో క్రూడాయిల్‌ శుద్ధి ప్రక్రియలో పొగలు, మంటలు వస్తుంటాయి. వాటిని నిపుణులు చాకచక్యంగా అదుపు చేసుకుంటూ పనిచేస్తారు. మంగళవారం సీనియర్లు లేకపోవడంతో ఇటీవలె విధుల్లో చేరిన వారికి ఆ బాధ్యత అప్పగించారని, వారు పొగలు వచ్చినప్పుడు సరిగ్గా వ్యవహరించకపోవడంతో అవి మంటలుగా మారి ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు
    Published by:Nagesh Paina
    First published: