5 STATE ELECTIONS CAN EXIT POLLS ENTER VOTERS MINDS AND GAUGE TRUE PICTURE PAST RECORDS MAY HOLD THE ANSWER GH VB
Five State Elections: ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు నిజం అవుతాయా..? గతంలో ఏం జరిగింది..? తెలుసుకుందాం..
ప్రతీకాత్మక చిత్రం
ఎన్నికల పండితులు ఓటర్ల నాడిని పట్టుకోగలిగారా? ఏ మేరకు వాస్తవాలకు దగ్గరగా వెళ్లగలిగారు? అనే అంశాలను తెలుసుకోవడానికి.. గత ఎన్నికల సమయంలో విడుదలైన ఎగ్జిట్‌పోల్స్, తర్వాతి ఫలితాలను పరిశీలిస్తే సరిపోతుంది. ఆ వివరాలు..
శాసనసభ ఎన్నికలు(Assembly Elections) జరిన ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సోమవారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ క్షేత్రస్థాయిలో ఓటర్ల నిర్ణయాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించాయి. యూపీలో(UP) 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ముఖ్యంగా బెల్వెదర్ నియోజకవర్గ ఫలితాలు ముఖ్యమైనవి. యూపీలో చివరి దశ ఓటింగ్ ముగియనుండటంతో ఎగ్జిట్ పోల్స్‌పై(Exit Polls) ఉన్న నిషేధాన్ని సాయంత్రం 6 గంటలకు ఎన్నికల సంఘం ఎత్తివేసింది. అయితే ఎన్నికల పండితులు ఓటర్ల నాడిని పట్టుకోగలిగారా? ఏ మేరకు వాస్తవాలకు దగ్గరగా వెళ్లగలిగారు? అనే అంశాలను తెలుసుకోవడానికి.. గత ఎన్నికల సమయంలో విడుదలైన ఎగ్జిట్‌పోల్స్, తర్వాతి ఫలితాలను పరిశీలిస్తే సరిపోతుంది.
ఉత్తరప్రదేశ్
2019 పార్లమెంట్ ఎన్నికలు:
ఉత్తరప్రదేశ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల విషయంలో అన్ని ఎగ్జిట్ పోల్స్ చాలా దూరం దూరంగా ఉన్నాయి. న్యూస్ నేషన్ BJP నేతృత్వంలోని NDAకి 37 సీట్లు ఇచ్చింది. SP, BSP మొదలైన వాటితో ఏర్పడిన మహాఘట్బంధన్(MGB)కు 41 కట్టబెట్టింది. ఇండియా TV-CNX NDAకి 41, MGBకి 35, ABP న్యూస్-నీల్సన్ NDAకి 36, MGBకి 42 వస్తాయని అంచనా వేశాయి. టైమ్స్ నౌ-VMX మాత్రం NDAకి 42, MGBకి 36, ABP News-CVoter NDAకి కేవలం 25 సీట్లు, MGB 51 సీట్లు ఇచ్చాయి. ఇండియా టుడే MGBకి ఏకంగా 58 సీట్లు, NDAకి 18 సీట్లు వస్తాయని అంచనా వేసింది. చివరికి మొత్తం 80 సీట్లలో ఎన్డీఏ 64 కైవసం చేసుకోగా, ఎంజీబీకి కేవలం 15 మాత్రమే మిగిలాయి.
2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేయలేకపోయాయి. ఎస్పీ, కాంగ్రెస్ కూటమి, భాజపా, మాయావతి బీఎస్పీ మధ్య త్రికోణ పోటీ ఉంటుందని చాలా మంది ముందే ఊహించారు. ABP న్యూస్ 403 సీట్లలో 185 సీట్లతో బీఎస్పీ విజయం సాధిస్తుందని, ఆ తర్వాత భాజపాకి 120, ఎస్పీ- కాంగ్రెస్ కూటమికి 93 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా టీవీ- సీవోటర్ బీఎస్పీకి 95-111, భాజపాకు 134-150, ఎస్పీ-కాంగ్రెస్‌కు 138-162 సీట్లు ఇచ్చింది. ఇండియా టుడే-యాక్సిస్ మాయావతి పార్టీకి 39-43 సీట్లు, భాజపాకు 180-191, ఎస్పీ-కాంగ్రెస్‌కు 168-178 సీట్లు వస్తాయని అంచనా వేసింది. తుది ఫలితాల్లో 403 స్థానాలకు గాను 312 స్థానాలను భాజపా గెలుచుకొంది. బీఎస్సీకి 19, ఎస్పీ, కాంగ్రెస్ కూటమికి 54 స్థానాలు వచ్చాయి.
పంజాబ్
2019 పార్లమెంట్ ఎన్నికలు:
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో టైమ్స్ నౌ- VMR 13 సీట్లలో.. బీజేపీ నేతృత్వంలోని NDAకి 2 సీట్లు, UPAకి 11, ఆప్‌కు జీరో ఇచ్చింది. NDAకి 5, UPAకి 7, ఆప్‌కి 1 సీటు వస్తాయని న్యూస్ నేషన్ అంచనా వేసింది. ఇండియా TV- CNX NDAకి 3, UPAకి 9, AAP 1 ఇచ్చాయి. రిపబ్లిక్ టీవీ- జన్ కీ బాత్ NDAకి 1-3 సీట్లు, UPAకి 9-10, AAPకి 0-1 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అంతిమ ఫలితాల్లో మొత్తం 13 సీట్లలో 8 సీట్లతో UPA విజయం సాధించింది. NDA 4, AAP 1 దక్కించుకొన్నాయి.
2017 అసెంబ్లీ ఎన్నికలు:
ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా సంస్థలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న మద్దతును ఎక్కువగా అంచనా వేశాయి. HuffPost- CVoter AAP స్పష్టమైన విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఆజ్ తక్-యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ+ఎస్ఏడీకి 18-22, కాంగ్రెస్‌కు 56-61, ఆప్‌కి 36-41 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇండియా టుడే-యాక్సిస్ బీజేపీ-ఎస్ఏడీ కూటమికి 18-22, కాంగ్రెస్‌కు 56-62, ఆప్‌కి 36-41 సీట్లు వస్తాయని తెలిపింది. తుది ఫలితాల్లో 117 స్థానాలకు గాను కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించగా, SAD-BJP 18, ఆప్ 20 స్థానాల్లో గగెలిచాయి.
ఉత్తరాఖండ్
2019 పార్లమెంట్ ఎన్నికలు:
లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు టైమ్స్ నౌ-VMR, రిపబ్లిక్ TV-CVoter, NewsX- Neta, News 24- టుడేస్ చాణక్య, న్యూస్ నేషన్, News18- IPSOS, ఇండియా టుడే-యా క్సిస్, ABP- నీల్సన్ కలిపి దాదాపు అన్నీ NDAకి దాదాపు 4-5 సీట్లు , UPAకి 0-1 వస్తాయని అంచనా వేశాయి. కౌంటింగ్ రోజున ఎన్డీఏ అన్ని స్థానాల్లోనూ విజయం సాధించగా, యూపీఏకు ఒక్కటి కూడా దక్కలేదు.
2017 అసెంబ్లీ ఎన్నికలు:
2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని చాలా మంది ఊహించారు. ఇండియా టుడే- యాక్సిస్ కాంగ్రెస్‌కు 12-21, బీజేపీకి 46-53, ఇతరులకు 2-6 సీట్లు ఇచ్చింది. న్యూస్ 24- టుడే చాణక్య కాంగ్రెస్‌కు 15, బీజేపీకి 53, ఇతరులకు 2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా టీవీ- సీవోటర్ కాంగ్రెస్‌కు 32, బీజేపీకి 29-35, ఇతరులకు 5 సీట్లు వస్తాయని లెక్కగట్టింది. తుది ఫలితాల్లో మొత్తం 70 సీట్లకు గాను 57 సీట్లతో భాజపా విజయం సాధించగా, కాంగ్రెస్‌కు 11, ఇతరులకు 2 వచ్చాయి.
గోవా
2019 పార్లమెంట్ ఎన్నికలు:
2019 ఎన్నికలకు ముందు వచ్చిన చాలా ఎగ్జిట్ పోల్స్‌లో గోవాలోని 2 లోక్‌సభ స్థానాలను NDA, UPA మధ్య సమానంగా విభజించారు. న్యూస్ఎక్స్- నేటా, టైమ్స్ నౌ-వీఎంఆర్, రిపబ్లిక్ టీవీ- సీవోటర్ అన్నీ రెండు కూటములకు ఒక్కో సీటును ఇచ్చాయి. ఇండియా టుడే-యాక్సిస్ మాత్రమే రెండు సీట్లు ఎన్డీయేకు వస్తాయని అంచనా వేసింది. కౌంటింగ్ రోజు అంచనాలకు తగ్గట్టుగానే యూపీఏ, ఎన్డీఏ ఒక్కో సీటును కైవసం చేసుకున్నాయి.
2017 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇండియా న్యూస్- ఎంఆర్సీ 40 సీట్లలో 15 బీజేపీకి, 10 కాంగ్రెస్‌కి, 7 కొత్తగా వచ్చిన ఆప్‌కి, ఇతరులకు 8 వస్తాయని అంచనా వేసింది. ఇండియా టీవీ- సీవోటర్ .. బీజేపీకి 15-21, కాంగ్రెస్‌కు 12-18, ఆప్‌కి 0-4, ఇతరులు 2-8 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా టుడే- యాక్సిస్ బీజేపీకి 18-22, కాంగ్రెస్‌కు 9-13, ఆప్‌కి 0-2, ఇతరులకు 4-9 సీట్లు ఇచ్చింది. కౌంటింగ్‌లో కాంగ్రెస్‌కు అత్యధికంగా 17 సీట్లు వచ్చాయి, ఆ తర్వాత బీజేపీకి 13, ఇతరులకు 10 రాగా ఆప్ ఖాతా తెరవలేదు.
మణిపూర్
2019 పార్లమెంట్ ఎన్నికలు:
రిపబ్లిక్ TV- CVoter, NewsX- Neta, India Today- Axis యొక్క ఎగ్జిట్ పోల్స్ 2019 ఎన్నికలకు ముందు మణిపూర్‌లోని రెండు లోక్‌సభ స్థానాలు NDAకి వస్తాయని అంచనా వేసింది. టైమ్స్ నౌ- VMR, ABP- CVoter, రిపబ్లిక్ భారత్- జన్ కీ బాత్ ఎన్డీయేకి ఒకటి, యూపీఏకి ఒకటి కేటాయించాయి. కౌంటింగ్‌లో ఎన్డీఎ రెండు స్థానాలను కైవసం చేసుకొంది.
2017 అసెంబ్లీ ఎన్నికలు:
2017 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందు ఇండియా టుడే- యాక్సిస్ 60 సీట్లలో 16-22 బీజేపీకి, 30-36 కాంగ్రెస్‌కు, ఇతరులకు 6- 11 వస్తాయని లెక్కగట్టింది. ఇండియా టీవీ- సీవోటర్ బీజేపీకి 25-31, కాంగ్రెస్‌కు 17-23, ఇతరులకు 9-15 సీట్లు వస్తాయని అంచనా వేసింది. న్యూస్18- గ్రామీనర్ బీజేపీకి 25, కాంగ్రెస్‌కు 24, ఇతరులకు 11 సీట్లు ఇచ్చాయి. చివరి ఫలితాల్లో కాంగ్రెస్ 28 సీట్లతో విజయం సాధించింది, బీజేపీకి 21, ఇతరులకు 11 వచ్చాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.