హోమ్ /వార్తలు /Explained /

Opinion: నయా కశ్మీర్‌లో మూడు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులు.. 1990 నాటి భీభత్సాన్ని గుర్తుకు తెస్తున్న కశ్మీరీ పండిట్స్ హత్యలు

Opinion: నయా కశ్మీర్‌లో మూడు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులు.. 1990 నాటి భీభత్సాన్ని గుర్తుకు తెస్తున్న కశ్మీరీ పండిట్స్ హత్యలు

1990 నాటి భీభత్సాన్ని గుర్తుకు తెస్తున్న కశ్మీరీ పండిట్స్ హత్యలు

1990 నాటి భీభత్సాన్ని గుర్తుకు తెస్తున్న కశ్మీరీ పండిట్స్ హత్యలు

కశ్మీర్ లోయలో గత మూడు రోజుల్లో ఐదుగురు పౌరులను కాల్చి చంపారు. వారిలో అత్యధికులు మైనారిటీ వర్గాలకు (ముస్లిమేతరులు) చెందినవారే ఉన్నారు. శ్రీనగర్‌లో ఆశ్రయం పొందిన ఇస్లామిక్ తీవ్రవాదులు ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారు.

ADITYA RAJ KAUL

(ఆదిత్య రాజ్ కౌల్)

జమ్ము కశ్మీర్‌ (Jammu and Kashmir) ప్రత్యేక స్వయంప్రతిపత్తిని రద్ధు చేసి.. ఆ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా (Union Terrority) మార్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కశ్మీర్ (Kashmir) మొత్తం భారత్‌తో భాగమైందని చాలామంది భావించారు. అయితే ఈ కొత్త కశ్మీర్‌లో ప్రస్తుతం 1990 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ ఏడాది జనవరి 19న రాత్రి వేళ.. కశ్మీర్‌లోని మసీదుల నుంచి హెచ్చరికలు వినిపించాయి. కశ్మీరీ పండిట్ (Kashmiri Pandits) పురుషులు లోయ నుంచి వెళ్లిపోవాలని.. మహిళలను అక్కడే వదిలి వెళ్లాలని కొందరు నినాదాలు చేశారు. పాకిస్థాన్ (Pakistan) మద్దతు ఉన్న ఇస్లామిస్టులు కశ్మీర్ వీధుల్లో ఆజాదీ నినాదాలు చేశారు. ఆ సమయంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.

ఆనాటి గందరగోళంలో ఎందరో ప్రముఖ కశ్మీరీ పండిట్లు హత్యకు గురయ్యారు. రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు సైతం ఈ జాబితాలో ఉన్నారు. జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) ఈ దారుణాలకు పాల్పడింది. ఉగ్రవాదులు యాసిన్ మాలిక్ (Yasin Malik), బిట్టా కరాటే (Bitta Karate), ఇతరులు కశ్మీరీ పండిట్ వర్గాలకు ప్రధాన విలన్‌లుగా మారారు. నిరాయుధులైన నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian AirForce) సిబ్బందిని సైతం JKLF చంపేసింది. అప్పటి భారత హోం మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తెను అపహరించడానికి కూడా సాహసించింది. అయితే మాజీ ప్రధానమంత్రులు అటల్ బిహారీ వాజ్‌పేయి (Vajpayee) , మన్మోహన్ సింగ్ (Manmohan Singh).. వివిధ సందర్భాల్లో ఉగ్రవాది యాసిన్ మాలిక్‌ను ఆహ్వానించి, ఆతిథ్యం ఇచ్చారు.

Srinagar Terror Attack: స్కూళ్లోకి చొరబడి ఉగ్రవాదుల కాల్పులు.. శ్రీనగర్‌‌లో ఇద్దరు టీచర్లు మృతి1990 నుంచి నాలుగు లక్షల మందికి పైగా కశ్మీరీ హిందువులు లోయను విడిచి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం.. మూడు దశాబ్దాల తర్వాత, కశ్మీర్ లోయ అంతటా మళ్లీ భయంకరమైన ప్రశాంతత నెలకొంది. కశ్మీర్‌లో ప్రస్తుతం హరుద్ లేదా శరదృతువు కొనసాగుతోంది. శ్రీనగర్ మొత్తం రాత్రి వేళ నిశ్శబ్దంగా ఉంది. సాధారణ సమయానికి ముందే మార్కెట్లను మూసివేస్తున్నారు. అక్కడ ఏదో తెలియని భయానక పరిస్థితులు ఉన్నాయనే భావన కనిపిస్తోంది. చీకటి పడకముందే లాల్‌చౌక్ పరిసరాల్లోని మార్కెట్లను మూసివేస్తున్నారు. మైనారిటీ కమ్యూనిటీకి (ముస్లిమేతరులు) చెందిన స్వీట్ షాప్ యజమానులు, పండ్ల విక్రేతలు ముందు జాగ్రత్త చర్యగా త్వరగా త్వరగా ఇళ్లకు వెళ్తున్నారు.

ఆ మృతదేహం నా కొడుకుదే.. ఆర్మీ జవాన్ తండ్రి ఆవేదన.. అసలేం జరిగిందంటే..లోయలో ఏం జరుగుతోంది?

కశ్మీర్ లోయలో గత మూడు రోజుల్లో ఐదుగురు పౌరులను కాల్చి చంపారు. వారిలో అత్యధికులు మైనారిటీ వర్గాలకు (ముస్లిమేతరులు) చెందినవారే ఉన్నారు. శ్రీనగర్‌లో ఆశ్రయం పొందిన ఇస్లామిక్ తీవ్రవాదులు ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారు. కశ్మీర్‌, అక్కడి మైనారిటీలను అస్థిరపరచాలనే లక్ష్యంతో వారు ఇలా చేస్తున్నారు. భారత ప్రజాస్వామాన్ని గౌరవించేవారు, కశ్మీర్‌లో సగర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వారినే ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు.

Kashmir: కశ్మీర్​లో కనిపించకుండా పోయిన 60 మంది యువత.. నిజమేనా..?ఇటీవల హత్యకు గురైన వారిలో 68 ఏళ్ల మఖన్ లాల్ బింద్రూ ఒకరు. గతంలో కశ్మీర్‌లో తీవ్రవాదం రాజ్యమేలిన సమయంలో కూడా ఆయన లోయను విడిచి వెళ్లలేదు. శ్రీనగర్ ఎస్‌ఎస్‌పీ కార్యాలయానికి 500 మీటర్ల దూరంలో ఉన్న ఇక్బాల్ పార్క్‌లోని మందుల షాపులో మఖన్‌ లాల్‌ను హత్య చేశారు. స్థానికులు అమితంగా గౌరవించే బింద్రూ.. కశ్మీరీ ముస్లింలకు సైతం ఎంతో సహాయం చేశారు.

శ్రీనగర్‌లోని లాల్ బజార్ ప్రాంతంలో బీరేందర్ పాశ్వాన్‌ను కూడా ఉగ్రవాదులు కాల్చి చంపారు. నవరాత్రి ఉపవాసంలో మొదటి రోజే ఆయన్ను వెనుక నుంచి కాల్చి చంపారు. ఈ హత్యకు సంబంధించిన 18 సెకన్ల క్లిప్పింగ్‌ను ISIS విడుదల చేసింది. శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ సుపీందర్ కౌర్, ఉపాధ్యాయులు దీపక్ చంద్‌ను గురువారం ఉదయం ఉగ్రవాదులు కాల్చి చంపారు.  ముస్లిం ఉపాధ్యాయులను బయటకు పంపించి మరీ వీరిని హత్య చేశారు.

BJP Leader Killed: అందరూ చూస్తుండగా తుపాకీతో కాల్పులు.. జమ్మూలో బీజేపీ నేత దారుణ హత్యసుపీందర్ కౌర్ అనాధ కశ్మీరీ ముస్లిం బాలిక విద్య, ఇతర ఖర్చుల కోసం సహాయం చేస్తున్నారు. ఆమె ప్రిన్సిపాల్‌గా ఉన్న పాఠశాలలోని కశ్మీరీ ముస్లిం సెక్యూరిటీ గార్డు వైద్య ఖర్చులకు కూడా కౌర్ సహాయం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ మైనారిటీలైన కశ్మీరీ పంటిట్ల వలసలు ప్రారంభం కావడం బాధాకరం. ఇటీవల జరిగిన దారుణ హత్యల తర్వాత అనేక హిందూ కుటుంబాలు శ్రీనగర్, అనంతనాగ్‌ ప్రాంతాలను వదిలి వెళ్లిపోయాయి.

జమ్మూలో కశ్మీరీ పండిట్ కమ్యూనిటీకి చెందిన యువ పోలీసు ఒక విషయం చెప్పారు. ప్రస్తుతం ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో.. తమ పూర్వీకుల ఇంట్లో ఉంటున్న తన కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం జమ్మూకు బయలుదేరుతున్నారని చెప్పారు. సింగర్ కావాలనుకున్న ఆ యువకుడు, తమ ప్రాంత పరిస్థితుల కారణంగా పోలీస్ అయ్యారు. ఇలా 2021లో కూడా ఎంతోమంది కశ్మీరీ పండిట్లు వలసపోతున్నారు.

ఆర్మీ స్థావరాల వద్ద 5 డ్రోన్లు.. కాశ్మీర్‌లో మళ్లీ కలకలం.. పాక్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది?సెంట్రల్, దక్షిణ కశ్మీర్‌లోని చాలా మంది కశ్మీరీ పండిట్ ప్రభుత్వ ఉద్యోగులు పోలీసు రక్షణ కోరుతున్నారు. ఇప్పటికే భద్రతను పటిష్టం చేశామని ప్రభుత్వం చెబుతోంది. అయినా కూడా కొందరు ఉగ్రవాదులకు ఈజీ టార్గెట్లుగా మారుతున్నారు.

ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిన సమాచారం

సెప్టెంబర్ 21న జమ్మూ కశ్మీర్ భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి ఒక సమాచారం అందింది. శ్రీనగర్‌లో కశ్మీరీ హిందువులపై దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జులైలో.. లాల్‌చౌక్ సమీపంలోని ఒక హిందూ స్వీట్ షాప్ యజమానిపై దాడి చేసే అవకాశం ఉందని సమాచారం అందింది. అంతకు ముందు దాల్ గేట్ ప్రాంతంలో ఒక హిందూ రసాయన శాస్త్రవేత్తకు కూడా ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు తెలిసింది.

కశ్మీరీ హిందువులకు బెదిరింపులు, దాడులు

శ్రీనగర్, ఇతర పక్క జిల్లాల్లోని కశ్మీరీ హిందువులు సైతం బెదిరింపులు, దేవాలయ భూముల ఆక్రమణ, దాడుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనగర్‌లోని దేవాలయ పూజారులు సైతం ఆందోళన చెందుతున్నారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్‌లో హిందూ జనాభా అధికంగా ఉండే ప్రాంతాల ప్రజలు, వ్యాపారవేత్తలకు భద్రత కల్పించారు. లోయ అంతటా హిందూ మెజారిటీ ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించడం తక్షణ అవసరం. రాడికల్ వేర్పాటువాదుల భద్రత కోసం ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వాలు ఖర్చు చేశాయి. ఇప్పుడు దేశభక్తులైన హిందువులకు, సిక్కులకు ఎందుకు భద్రత కల్పించకూడదు?

World’s Highest Road: ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మనదేశంలోనే.. ఎక్కడో తెలుసా..? ఎంటి ప్రత్యేకత


లెఫ్టినెంట్ గవర్నర్‌కు కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి లేఖ

తాజా పరిస్థితులపై స్పందించింది కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి. ఈ సంస్థ గత మూడు దశాబ్దాల నుంచి లోయలో నివాసం ఉంటున్న పండిట్స్ సంక్షేమం కోసం కృషి చేస్తోంది. ఈ సంస్థ తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఒక లేఖ రాసింది. ‘గత పది రోజుల నుంచి వ్యాపారవేత్తలు, ప్రముఖులు ప్రాణ భయంతో ఆందోళన చెందుతున్నారు. స్థానిక కశ్మీరీ పండిట్స్, లోయలో నివసిస్తున్న హిందువులను కశ్మీర్ లోయ నుంచి బలవంతంగా వెళ్లగొట్టే చర్యలకు ఆగంతకులు పాల్పడుతున్నారు. సంబంధిత ఏజెన్సీలు తీవ్ర నిద్రావస్థలో ఉన్నాయి. అందుకే వరుసగా హత్యలు జరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి, తక్షణ చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో కోరింది.

కశ్మీర్ లోయలో పనిచేస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీలు చూపించిన కఠినమైన విధానం.. వలసయేతర కశ్మీరీ పండిట్లు, లోయలో నివసిస్తున్న హిందువులపై ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశం గురించి ఈ సంస్థ ప్రశ్నలను లేవనెత్తింది.

Jammu and Kashmir: ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్‌లో ఇద్దరే ఆస్తులు కొన్నారు.. ఎందుకిలా? అంచనాలు ఎందుకు తప్పాయి?"ఒకవైపు ఈ సమస్యలపై చర్చించడానికి మేము కోరిన అపాయింట్‌మెంట్లను చెత్తబుట్టల్లో పడేస్తున్నారు. మరోవైపు, మీ అత్యున్నత కార్యాలయం, భద్రతా సంస్థలు కశ్మీర్ లోయలో నివసిస్తున్న మైనారిటీల ప్రాణాలను, ఆస్తులను కాపాడటంలో విఫలమయ్యాయి. పరిపాలనలో సమన్వయం లేదని, అధికార వ్యవస్థ నిద్రావస్థలో ఉందని ఈ చర్యలు రుజువు చేస్తున్నాయి” అని లేఖలో సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న కశ్మీరీ పండితులు

ప్రస్తుతం లోయలో నివసిస్తున్న కశ్మీరీ పండితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. గతంలో నెలకొన్న క్రూరమైన హింస, వివక్ష, వలసలు, ప్రక్షాళన తర్వాత.. 32 సంవత్సరాల అనంతరం కూడా ప్రభుత్వం వారి భద్రతకు హామీ ఇవ్వడంలో విఫలమైంది. లోయలో మిగిలిన హిందువులు, సిక్కులు సురక్షితంగా లేనప్పుడు.. కశ్మీరీ పండిట్స్ పునరావాసానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఎలా హామీ ఇస్తారు?

ఆర్మీ స్థావరాల వద్ద 5 డ్రోన్లు.. కాశ్మీర్‌లో మళ్లీ కలకలం.. పాక్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది?ఉగ్రవాద హత్యలపై కశ్మీరీ సమాజం నిశ్శబ్దం వహించడం మరింత భయంకరంగా ఉంది. ప్రముఖ రచయిత, కశ్మీరీ పండిట్ అయిన రాహుల్ పండిత ఇలాంటి పరిస్థితిపై ఒక విషయం చెప్పారు. ‘సామూహిక నిశ్శబ్దం అయోమయంగా ఉంది.. కానీ ఆశ్చర్యకరమైనది కాదు. న్యూఢిల్లీలోని పండారా రోడ్‌తో సహా భారతదేశంలో ఎక్కడైనా మీరు గోల్గప్ప (తినుబండారం) అమ్మవచ్చు. కానీ కాశ్మీర్‌లో గోల్గప్పలను అమ్మడానికి ఒక బిహారీ వ్యక్తి వస్తే మాత్రం అతడు బయటి వ్యక్తి అవుతాడు’ అని వివరించారు. ప్రజలు ఈ భావాన్ని గ్రహించాలి.

* కొత్త వాదనతో తప్పుడు ప్రచారం

ఇస్లామిస్ట్ తీవ్రవాదుల కపట నాటకాలను కశ్మీరీ సమాజం గుర్తించాలి. ఈ విషయంలో అందరూ విఫలమైనట్లు స్పష్టమవుతోంది. ఉగ్రవాద బాధితులు కేవలం కశ్మీరీ హిందువులు, సిక్కులు మాత్రమే కాదు. తమను తాము భారతీయులు అని చెప్పుకునే సాధారణ కశ్మీరీ ముస్లింలు కూడా ఇస్లామిస్ట్ టెర్రరిజం కారణంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో కొందరు కావాలనే ‘కాశ్మీరియత్’ అనే వాదనను ప్రచారం చేస్తున్నారు. అసలు కాశ్మీరియత్ అనేదే ప్రాథమికంగా తప్పుడు పేరు. కశ్మీర్ లోయలో కశ్మీరీ హిందువులు, సిక్కులకు వ్యతిరేకంగా వ్యాపించిన ఇస్లామిస్ట్ రాడికల్ భావజాలం, భీభత్సాన్ని దాచడానికి.. తప్పుడు సోదర భావాన్ని చూపించడానికి.. కాశ్మీరియత్ అనే పదాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

కశ్మీర్‌లో వెల్లివిరిసిన మతసామరస్యం.. కశ్మీరీ పండిట్ మహిళ‌ల ద‌హ‌న‌ సంస్కారాలు నిర్వహించిన ముస్లింలు..మీడియాలో మాత్రమే కాశ్మీరియత్ అనే వాదన

మీడియాలో ప్రచారం కోసం హిందువులు, సిక్కుల అంత్యక్రియల సమయంలో మాత్రమే కాశ్మీరియత్ అనే వాదన కనిపిస్తుంది. ఈ గత మూడు దశాబ్దాలుగా ముస్లిమేతరులే ఉగ్రవాదులకు లక్ష్యంగా ఉంటున్నారు. నడిమార్గ్ నుంచి వండహామా వరకు.. గూల్ నుంచి ఛట్టిసింగ్‌పోరా వరకు.. అన్ని వీధులూ ఎంతోమంది అమాయక కశ్మీరీ హిందువులు, సిక్కుల రక్తంతో తడిసిపోయాయి.

ప్రస్తుతం కశ్మీరీ పండిట్లు మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఒక్కటే.. రేపు వారు తమ కుటుంబాలతో సహా హత్యకు గురికావచ్చు. నయా కాశ్మీర్‌లో 2021 శరదృతువు హిందువులు, సిక్కులకు మూడు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయి. 1990 శీతాకాలం నాటి పరిస్థితులే ఇప్పుడు మళ్లీ లోయలో నెలకొన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాన మంత్రి దృష్టి పెట్టాలి.

Published by:John Kora
First published:

Tags: Explained, Jammu and kashmir bifurcation, Jammu kashmir

ఉత్తమ కథలు