1Gbps Broadband plans: 1Gbps స్పీడుతో ఇంటర్నెట్‌ను అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ సంస్థలు.. ధరలు ఎంతో తెలుసా?

13. వాల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రకారం ఈ 10 స్కిల్స్‌కు ఫ్యూచర్‌లో మంచి డిమాండ్ ఉండబోతోంది. వాల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంచనా ప్రకారం 2025 నాటికి 50 శాతం ఉద్యోగులు రీస్కిలింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

వినియోగదారుల ఆసక్తికి తగ్గట్టే కంపెనీలు అత్యధికంగా 1Gbps డేటా స్పీడ్‌తో కూడా ప్యాకేజీలను అందిస్తున్నాయి. ప్రస్తుతం రిలయన్స్ జియోఫైబర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్, స్పెక్ట్రా, ACT బ్రాడ్ బ్యాండ్, MTNL వంటి సంస్థలు 1Gbps ఇంటర్నెట్ కనెక్షన్లను అందిస్తున్నాయి. వీటి ధరలను పరిశీలిద్దాం.

  • Share this:
ఇంటినుంచి పనిచేసే వారు, ఆన్ లైన్ క్లాసులు వినేవారి సంఖ్య పెరగడంతో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య కూడా పెరిగింది. ఒకప్పటితో పోలిస్తే... ప్రస్తుతం వివిధ సంస్థలు తక్కువ ధరల్లోనే బ్రాండ్‌ బ్యాండ్ సేవలను అందిస్తున్నాయి. డేటా స్పీడ్, డేటా లిమిట్‌ను బట్టి ప్లాన్ల ధరలు మారుతున్నాయి. ప్యాకేజీ ధర కాస్త ఎక్కువగా ఉన్నా, మెరుగైన డేటా స్పీడ్‌నే కస్టమర్లు ఎంచుకుంటున్నారు. వినియోగదారుల ఆసక్తికి తగ్గట్టే కంపెనీలు అత్యధికంగా 1Gbps డేటా స్పీడ్‌తో కూడా ప్యాకేజీలను అందిస్తున్నాయి. ప్రస్తుతం రిలయన్స్ జియోఫైబర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్, స్పెక్ట్రా, ACT బ్రాడ్ బ్యాండ్, MTNL వంటి సంస్థలు 1Gbps ఇంటర్నెట్ కనెక్షన్లను అందిస్తున్నాయి. వీటి ధరలను పరిశీలిద్దాం.

* రిలయన్స్ జియోఫైబర్ 1Gbps ప్లాన్ ధర నెలకు రూ.3,999 గా ఉంది. ఈ ప్యాకేజీ కింద అన్‌లిమిటెడ్‌ డేటాను జియో అందిస్తోంది. దీంతోపాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్, హాట్ స్టార్, జియో సినిమా, జీ5.. వంటి 15 OTT యాప్‌లను కస్టమర్లు యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ 15 OTT సబ్‌స్క్రిప్షన్ల విలువే రూ.1,650 వరకు ఉంటుంది. అంటే ఈ మేరకు జియో ఫైబర్ కస్టమర్లు లబ్ధి పొందవచ్చు.

* ఎయిర్‌టెల్ ఎక్స్-స్ట్రీమ్ VIP ప్లాన్‌ పేరుతో అన్‌లిమిటెడ్ డేటా ప్యాకేజీని అందిస్తోంది. కస్టమర్లు 1Gbps స్పీడ్‌తో డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ ధర నెలకు రూ.3,999. ఈ ప్లాన్‌ కింద ల్యాండ్ లైన్ ఫోన్‌తో అపరిమిత లోకల్, STD వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్లను, కొన్ని డేటా స్ట్రీమింగ్‌ యాప్‌లకు యాక్సెస్‌ను కస్టమర్లు ఉచితంగా పొందవచ్చు.

* ప్రభుత్వరంగ సంస్థ MTNL బ్రాండ్‌బ్యాండ్ కనెక్షన్లు కొన్ని రాష్ట్రాల్లో మెరుగైన సంఖ్యలో ఉన్నాయి. దిల్లీ, ముంబైలలో యూజర్లకు రెండు రకాల 1Gbps ప్లాన్లను ఆ సంస్థ అందిస్తోంది. FTH-2990 ప్లాన్ ధర నెలకు రూ.2,990. ప్రారంభ ఆఫర్లో భాగంగా.. ఈ ప్లాన్‌ ద్వారా నెలకు 6000GB డేటాను MTNL అందిస్తోంది. FTH-4990 పేరుతో మరో ప్లాన్‌ను కూడా సంస్థ అందిస్తోంది. నెలకు రూ. 4,990 విలువ ఉన్న ఈ ప్లాన్‌ ద్వారా 12000 GB డేటాను పొందవచ్చు.

* స్పెక్ట్రా సంస్థ.. ‘స్పెక్ట్రా ఫాస్టెస్ట్ ప్లాన్’తో 1Gbps బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్లాన్‌ను ఎంచుకున్న యూజర్లు అంతకు ముందు నెలలో ఉపయోగించని డేటాను తదుపరి నెలల్లో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫాస్టెస్ట్ ప్లాన్‌తో నెలకు 500GB డేటాను స్పెక్ట్రా అందిస్తోంది. దీని ధర నెలకు రూ.1,549. దీంతోపాటు సెమీ యాన్యువల్, యాన్యువల్ ప్లాన్లతో అపరిమిత డేటా ప్యాకేజీని కూడా ఆ సంస్థ అందిస్తోంది.

* యాక్ట్ బ్రాడ్ బ్యాండ్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 1Gbps ప్లాన్‌ను అందిస్తోంది. యాక్ట్ గిగా ప్లాన్ పేరుతో నెలకు 2,500GB డేటాను ఆ సంస్థ అందిస్తోంది. ఈ ప్యాకేజీ ధర నెలకు రూ.5,999.

మరిన్ని వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ చానెల్  సబ్ స్క్రయిబ్ చేయండి..
First published: