Watch Video: సోషల్ మీడియా స్టార్‌పై జొమాటో డెలివరీ బాయ్ దాడి.. ముక్కు పగలగొట్టి.. డోర్ తోసి..

జొమాటో డెలివరీ బాయ్ దాడిలో గాయపడిన యువతి

ఈ ఘటన జరిగిన తర్వాత ఆమె మరో వీడియోను పోస్ట్ చేసింది. మొదటి వీడియోలో ఆమె ముఖం మొత్తం రక్తం కనిపిస్తూ ఉండగా, రెండో వీడియోలో ఆమె ఆస్పత్రికి వెళ్లి వచ్చిన తర్వాత పోస్ట్ చేసింది. అందులో ఆమె ముక్కుకు బ్యాండేజ్ వేసి ఉంది.

  • Share this:
    ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో బ్యూటీ ఇన్ ఫ్లుయన్సర్‌ మీద జొమాటో డెలివరీ బాయ్ దాడి చేశాడు. ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది.. ఇన్ స్టా పోస్ట్ ద్వారా ఆమె తనపై జరిగిన దాడి గురించి చెప్పింది. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. హితేష్ చంద్రానీ అనే ఇన్ స్టా ఇన్ఫ్లుయన్సర్ ఇన్ స్టాలో ఓ వీడియో పెట్టింది. అందులో ఆమె ఏడుస్తోంది. ముక్కు మీద రక్త గాయాలు అయ్యాయి. ఫుడ్ డెలివరీ విషయంలో వివాదం జరగడంతో డెలివరీ బాయ్ ఆమె ముక్కు మీద దాడి చేశాడని తెలిపారు. ఫుడ్ డెలివరీ ఎందుకు ఆలస్యం అయిందని ప్రశ్నించినందుకు అతడు దుర్మార్గంగా వ్యవహరించాడని తెలిపింది. తనను తిట్టడంతో పాటు చేయి చేసుకున్నాడని తెలిపింది. ఆలస్యంగా వచ్చిన జొమాటో డెలివరీ బాయ్‌ను వెయిట్ చేయమని చెప్పానని... ఆ సమయంలో తాను జొమాటో హెల్ప్ డెస్క్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నానని చెప్పింది. లేకపోతే అతను ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వెళ్లిపోవచ్చని కూడా చెప్పింది. అయితే, అందుకు నిరాకరించిన అతడు ఆమె మీద అరుస్తూ ‘నేనేమన్నా నీ బానిసనా?’ అని ప్రశ్నించినట్టు వెల్లడించింది.

    సహజంగా ఇంటికి ఎవరైనా వస్తే.. తాము పూర్తిగా డోర్ తెరవబోమని, కానీ, ఆ సమయంలో అతడు డోర్ తీసుకుని లోపలికి వచ్చేశాడని చెప్పింది. ‘అతడు డోర్ గట్టిగా వేసేసరికి భయం వేసింది. డోర్ తోసేశాడు. టేబుల్ మీద ఉన్న ఆర్డర్ లాక్కున్నాడు. నా ముఖం మీద గుద్దాడు. అంతలోనే పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు.’ అని బాధితురాలు పోస్ట్ చేసిన వీడియోలో వెల్లడించింది.

    తాను 3.30 గంటలకు ఫుడ్ ఆర్డర్ చేస్తే 4.30 గంటలకు వచ్చిందని, ఈ విషయం మీద తాను జొమాటో హెల్ప్ డెస్క్ తో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఫుడ్ ఆలస్యం అయింది కాబట్టి.. అయితే ఫ్రీగా ఇవ్వాలని లేకపోతే ఆర్డర్ క్యాన్సిల్ చేయాలని తాను కోరినట్టు తెలిపింది.




    ఈ ఘటన జరిగిన తర్వాత ఆమె మరో వీడియోను పోస్ట్ చేసింది. మొదటి వీడియోలో ఆమె ముఖం మొత్తం రక్తం కనిపిస్తూ ఉండగా, రెండో వీడియోలో ఆమె ఆస్పత్రికి వెళ్లి వచ్చిన తర్వాత పోస్ట్ చేసింది. అందులో ఆమె ముక్కుకు బ్యాండేజ్ వేసి ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: