Zero FIR: తాడేపల్లి ఎస్ఐ బాలకృష్ణ‌పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు.. పూర్తి వివరాలు..

ఎస్‌ఐ బాలకృష్ణ

కేసులో తనకు న్యాయం జరగలేదని మహిళ మరోసారి నిరసనకు దిగింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యకు యత్నించింది.

  • Share this:
    గుంటూరు జిల్లా తాడేపల్లి ఎస్‌ఐ బాలకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. తనను మోసం చేశారనే మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వివరాలు.. ఎస్‌ఐ బాలకృష్ణ తనను మోసం చేశారని ఓ మహిళ శుక్రవారం రాత్రి తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట హల్‌చల్ చేసింది. ఎస్‌ఐ బాలకృష్ణ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తల్లితో కలిసి ఆందోళనకు దిగింది. తల్లితో కలిసి పోలీస్‌స్టేషన్‌ ఎదుట రహదారిపై బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అయితే పోలీసులు ఆమెను అక్కడి నుంచి పంపించివేయాలని చూడగా.. ఆమె తన వెంట సీసాలో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే నీళ్లు పోసి ఆమెను పక్కకు తీసుకెళ్లారు.

    అయితే ఈ వ్యవహారంపై స్పందించిన ఉన్నతాధికారులు.. ఎస్ఐ బాలకృష్ణను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీచేశారు. ఇక, గతంలో ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే సమయంలో తనతో పరిచయం పెంచుకుని మోసం చేశాడని ఇదే మహిళ పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు ఎస్‌ఐ బాలకృష్ణపై శాఖపరమైన చర్యలు తీసుకన్నారు. అనంతరం తాడేపల్లికి బదిలీ చేశారు.

    ఇవి కూడా చదవండి: ప్రతీకారం పేరుతో పసి ప్రాణం బలి.. ఆరేళ్ల బాలుడి దారుణ హత్య.. పొదల్లో మృతదేహం..



    భార్యపై అనుమానంతో ఇంటికి వచ్చిన భర్త.. అక్కడ కనిపించిన సీన్ చూసి షాక్.. చివరకు ఏం జరిగిందంటే..

    ఇంటికి పిలిచి మరదలిని హత్య చేసిన బావ.. కీలక విషయాలు వెల్లడి.. ఆ బంధమే కారణం..!


     అయితే ఆ కేసులో తనకు న్యాయం జరగలేదని మహిళ మరోసారి నిరసనకు దిగింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. ఇక, ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్‌ఐ బాలకృష్ణపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: