హోమ్ /వార్తలు /క్రైమ్ /

Mummidivaram : గోదాట్లో దూకిన మహిళా వాలంటీర్.. కాపాడిన వైసీపీ కౌన్సిలర్.. కానీ విధి ఆట వేరేలా..

Mummidivaram : గోదాట్లో దూకిన మహిళా వాలంటీర్.. కాపాడిన వైసీపీ కౌన్సిలర్.. కానీ విధి ఆట వేరేలా..

ప్రజా ప్రతినిధి అంటే అసలైన అర్థంగా నిలవాలనుకున్నాడాతను. తన కళ్ల ముందే ఓ ఆడబిడ్డ నదిలో కట్టుకుపోతుంటే చూడలేకపోయాడు.. అమాంతం దూకేసి ఆమెను కాపాడాడు. కానీ ఆమె కస్టం అతని ప్రాణాలు తీసింది. మహిళా వాంటీర్ ను కాపాడిన అతని సాహసం చివరికి తన ప్రాణాలనే బలితీసుకుంది.

ఇంకా చదవండి ...

  సాటి మనిషి కళ్లెదురుగా విలవిల్లాడుతున్నా పట్టించుకోకుండా పక్కకు తప్పుకునే రోజులివి. మరీ ముఖ్యంగా ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో మనకెందుకొచ్చిన తలనొప్పిలే అని చాలా మంది జారుకుంటారు. కానీ విజయ్ మాత్రం అందుకు అతీతం. కావడానికి స్థాయి చిన్నదే అయినా ప్రజా ప్రతినిధి అంటే అసలైన అర్థంగా నిలవాలనుకున్నాడాతను. తన కళ్ల ముందే ఓ ఆడబిడ్డ నదిలో కట్టుకుపోతుంటే చూడలేకపోయాడు.. అమాంతం దూకేసి ఆమెను కాపాడాడు. కానీ ఆమె కస్టం అతని ప్రాణాలు తీసింది. మహిళా వాంటీర్ ను కాపాడిన అతని సాహసం చివరికి తన ప్రాణాలనే బలితీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో కొత్త ఏడాది తొలి రోజే చోటుచేసుకున్న విషాదమిది..

  తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీకి చెందిన వాలంటీర్ పెదపూడి లక్ష్మీ కుమారి కొత్త ఏడాది తొలి రోజే బలవన్మరణానికి ప్రయత్నించింది. అన్నంపల్లి అక్విడెక్ట్‌ పైనుంచి గోదావరి నదిలోకి దూకి చనిపోయే ప్రయత్నం చేసింది. ఆమె ఆత్మహత్య ప్రయత్నాన్ని గమనించిన స్థానికుడొకరు.. కౌన్సిలర్ విజయ్‌కి ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. ప్రజాసేవంటే క్షణాల్లో వాలిపోయే విజయ్.. ఇంటి నుంచి ఒక్క పరుగులో గోదావరి వద్దకు చేరుకున్నాడు..

  Vikarabad SI srinu naik : వారం కిందటే పెళ్లి.. అత్తారింట్లో ఒడి బియ్యం పోసుకొని వస్తుండగా..  కౌన్సిలర్ విజయ్ అక్విడెక్ట్ దగ్గరకు చేరుకునే సమమానికే మహిళా వాలంటీర్ లక్ష్మీ కుమారి నదిలోకి దూకేసింది. ఆమెను కాపాడాలనే ఉద్దేశంతో విజయ్ సైతం ముందూవెనకా చూసుకోకుండా నదిలోకి లంఘించాడు. కొద్ది నిమిషాల ప్రయత్నంలోనే నదిలో కొట్టుకుపోతున్న మహిళా వాలంటీర్‌ను కాపాడగలిగాడు విజయ్. కానీ అతనిలో సత్తువ క్షీణించి, ఈదలేని పరిస్థితిలో విజయ్ నీట మునిగాడు. కౌన్సిలర్ విజయ్ పరిస్థితిని గమనించిన స్థానిక యువకులిద్దరు వెంటనే నదిలోకి దూకారు..

  Modi ఉదారత : Afghanకు 5లక్షల Covaxin టీకాలు పంపిన భారత్.. థ్యాంక్స్ చెబుతోన్న Taliban  అతి కష్టం మీద ఆ ఇద్దరు యువకులు కౌన్సిల్ విజయ్ ను ఒడ్డుకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే అతను అచేతనుడిగా పడిపోయి ఉన్నాడు. ఇద్దరినీ హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా, విజయ్ చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మహిళా వాలంటీర్ లక్ష్మీ కుమారి పరిస్థితి నిలకడగా ఉంది. ఒకరి కష్టం మరొకరి ప్రాణాలు తీసిన ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. వైసీపీ పార్టీకి చెందిన విజయ్ సాహసాన్ని అక్కడి ప్రజలు శ్లాఘించారు. కాగా, అసలు వాలంటీర్ లక్ష్మికుమారి ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసిందనేది ఇంకా బయటపడలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  First published:

  Tags: East Godavari Dist, Ward Volunteers, Ysrcp

  ఉత్తమ కథలు