రోడ్డు యాక్సిడెంట్ కేసులో కుమారుడు.. వైసీపీ ఎమ్మెల్యే వివరణ

పబ్‌లో కానీ ప్రమాదం జరిగిన ప్రాంతంలో కానీ ఓబుల్ రెడ్డి ఉన్నట్టు తేలితే ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి తెలిపారు.

news18-telugu
Updated: November 14, 2020, 2:49 PM IST
రోడ్డు యాక్సిడెంట్ కేసులో కుమారుడు.. వైసీపీ ఎమ్మెల్యే వివరణ
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడు బయటకు రావడంపై వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి స్పందించారు. ఆ రోజు ప్రమాదం జరిగిన సమయంలో తన కుమారుడు అక్కడ లేడని ఆయన తెలిపారు. నాలుగు రోజుల క్రితం కారు రిపేర్ కోసం గ్యారేజ్ లో ఇచ్చామని... గురువారం ఉదయం మా దగ్గరికి కారు రావాల్సి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. అయితే తన కుమారుడి స్నేహితుడు కౌశిక్ గ్యారేజ్ నుండి కారు తీసుకున్నాడని అన్నారు. కారును కౌశిక్ తీసుకువచ్చి ఇస్తాడని అనుకున్నామని.. కానీ అతడు తన మరో స్నేహితుడు తో కలిసి పబ్‌కు వెళ్ళాడని అన్నాడు.

తిరిగి వచ్చే సమయంలో రోడ్డు ప్రమాదం చేశారని అన్నారు. ఈ కేసులో అనవసరంగా తన కుమారుడు ఓబుల్ రెడ్డి పేరును లాగాలని చూస్తున్నారని కాటసాని రాంరెడ్డి అన్నారు. పబ్‌లో కానీ ప్రమాదం జరిగిన ప్రాంతంలో కానీ ఓబుల్ రెడ్డి ఉన్నట్టు తేలితే ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని ఆయన తెలిపారు. సంబంధం లేని అంశంలో ఓబుల్ రెడ్డి పేరును ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. ప్రమాదం జరిగిన రోజు ఓబుల్ రెడ్డి బనగానపల్లెలో పాదయాత్రలో పాల్గొన్నాడని ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి తెలిపారు.

మాదాపూర్ సిగ్నల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సిగ్నల్ జంప్ చేసి మరీ బులెట్ మీద వెళుతున్న భార్య భర్తలను బెంజ్ కార్ ఢీ కొట్టింది. ఈ క్రమంలో బైక్ ఉన్న గౌతమ్ దేవ్ అక్కడిక్కడే మృతి చెందగా భార్య శ్వేతకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. కారు నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాశి విశ్వనాథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కార్ లో ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Published by: Kishore Akkaladevi
First published: November 14, 2020, 2:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading