వైఎస్ వివేకా హత్య కేసులో సంచలనం.. పోలీసుల వేధింపులతో..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులకు తాళాలేక తాను ఆత్మహత్య చేసుకున్నట్లు నిందితుడు శ్రీనివాసుల రెడ్డి సూసైడ్ నోట్ రాసి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 3, 2019, 7:07 AM IST
వైఎస్ వివేకా హత్య కేసులో సంచలనం.. పోలీసుల వేధింపులతో..
వైఎస్ వివేకానంద రెడ్డి
  • Share this:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులకు తాళాలేక తాను ఆత్మహత్య చేసుకున్నట్లు నిందితుడు శ్రీనివాసుల రెడ్డి సూసైడ్ నోట్ రాసి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భాస్కర్‌రెడ్డికి అతడు వేర్వేరుగా లేఖలు కూడా రాశాడు. మరోవైపు, శ్రీనివాసులరెడ్డిని సీఐ రాములు తీవ్రంగా వేధించినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా, ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాసుల రెడ్డి కడప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణను వేగంవంతం చేసింది. వివేకా ఇంటి వాచ్‌మన్‌ రంగయ్యకు నార్కో అనాలసిస్‌, పాలిగ్రాఫ్‌, బీప్‌ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరారు. దీనికి న్యాయమూర్తి కిశోర్‌కుమార్‌ అనుమతిచ్చారు. ఆ వెనువెంటనే పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌ ఆధ్వర్యంలో రంగయ్యను హైదరాబాద్‌ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పోలీసులు అప్పట్లో సుమారు 60 మందిని ప్రశ్నించారు.

First published: September 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>