YSRCP Leader Murder: నంద్యాలలో వైసీపీ నేత దారుణ హత్య

సుబ్బారాయుడు పొన్నాపురం రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నారు. న్యాయవాదిగానూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన హత్యను వైసీపీ నేతలు ఖండించారు.

news18-telugu
Updated: October 9, 2020, 10:14 AM IST
YSRCP Leader Murder: నంద్యాలలో వైసీపీ నేత దారుణ హత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది.  వైసీపీ నేత సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు.  శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సుబ్బారాయుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అతడిని కర్రలతో తీవ్రంగా కొట్టి దారుణం హత్యచేశారు. నంద్యాలలోని విజయ పాల డెయిరీ సమీపంలో ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. పాత కక్షల కారణంతోనే హత్య చేశారా? లేదంటే ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సుబ్బారాయుడు పొన్నాపురం రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నారు. న్యాయవాదిగానూ ప్రాక్టీస్ చేస్తున్నారు. సుబ్బారాయుడు హత్యను వైసీపీ నేతలు ఖండించారు. ఆయన్ను చంపిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సుబ్బారాయుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.
Published by: Shiva Kumar Addula
First published: October 9, 2020, 10:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading