వివేక హత్యకేసులో టార్చర్ పెడుతున్నారు... జగన్ సన్నిహితుడి భార్య

ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాలతో పోలీసులు శంకర్ రెడ్డిని తీసుకెళ్లారు. కానీ అప్పట్నుంచి ఆయన తిరిగి ఇంటికి రాలేదని తులసమ్మ చెబుతున్నారు.

news18-telugu
Updated: March 27, 2019, 9:16 AM IST
వివేక హత్యకేసులో టార్చర్ పెడుతున్నారు... జగన్ సన్నిహితుడి భార్య
ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాలతో పోలీసులు శంకర్ రెడ్డిని తీసుకెళ్లారు. కానీ అప్పట్నుంచి ఆయన తిరిగి ఇంటికి రాలేదని తులసమ్మ చెబుతున్నారు.
  • Share this:
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి 15 రోజులు గడుస్తున్నా... ఇంతవరకు కేసు కొలిక్కి రాలేదు. అయితే కేసుకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తుంది. తాజాగా వివేకానందరెడ్డి హత్యకేసులో తమను విచరాణ పేరుతో వేధిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి భార్య తులసమ్మ ఆరోపణలు చేస్తున్నారు. ఈ హత్యకేసులో తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తన భర్తను కేసు విచారణ ఉందంటూ ఈనెల 21న పోలీసులు తీసుకెళ్లారన్నారు. ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాలతో పోలీసులు శంకర్ రెడ్డిని తీసుకెళ్లారు. కానీ అప్పట్నుంచి ఆయన తిరిగి రాలేదని తులసమ్మ చెబుతున్నారు. తన భర్తను పోలీసులు చిత్ర హింసలు పెడుతున్నట్లు తనకు అనుమానాలు కల్గుతున్నాయన్నారు. నిజానికి తన భర్త ఆర్జేడీ అభ్యర్థిగా నామినేషన్ వేశారన్నారు. అయితే పోలీసుల నిర్బంధంలో ఉన్న కారణంగా అఫిడవిట్ సమర్పించలేకపోయినట్లు తెలిపారు. తన భర్తను విడిచిపెట్టాలని ఆమె పోలీసుల్ని ఈ సందర్భంగా కోరారు.

15 రోజల క్రితం తన సొంత నివాసంలోనే మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అయితే హత్య కేసు విచారణపై ఆయన కుటుంబ సభ్యుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ సహా వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతా రెడ్డి కేసు విచారణ జరుగుతున్న తీరుపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టును ఆశ్రయించిన వివేకా సతీమణి సౌభాగ్యమ్మ.. కేసును విచారిస్తున్న ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని.. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరుతూ ఇప్పటికే రెండు పిటిషన్లు దాఖలవగా.. తాజాగా సౌభాగ్యమ్మ కూడా పిటిషన్ ఫైల్ చేయడం గమనార్హం.

First published: March 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు