YS Viveka: వైఎస్ వివేక హత్య కేసులో ఆ ముగ్గురి చుట్టూ ఉచ్చు.. వాచ్ మెన్ రంగయ్యకు ముప్పు..!

వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)

వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురి పాత్రపై సీబీఐ అధికారులు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఆ ముగ్గురు వెనుక ఉన్నది ఎవరన్నదానిపైనే ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. మరోవైపు వాంగ్మూలం ఇచ్చిన వాచ్ మెన్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళలన చెందుతున్నారు.

  • Share this:
    YS Viveka Murder Case: ఏపీ సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 45 రోజుల విచారణలో అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. అసలు నిందితులను ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తోంది. అన్ని వైపుల నుంచి వారికి ఉచ్చు బిగించేందుకు అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ హత్య చేసింది ఆ ముగ్గురే అని గుర్తించిన అధికారులు.. ఆ ముగ్గురి వెనుక ఉన్నది ఎవరు..? ఎందుకు హత్య చేయించాల్సి వచ్చింది.. హత్యకు ముందు ఏం జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు ఈ కేసు గుట్టు విప్పిన వాచ్ మెన్ రంగయ్యకు థ్రెట్ ఉందని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకాలం నిజం తెలిసినా ఆయన అందుకే సీబీఐ అధికారులకు అసలు విషయం చెప్పలేకపోయారాని.. కానీ అధికారులు హామీ ఇవ్వడంతో రంగయ్య నోరు విప్పడని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే ఆయనకు ఎలాంటి భద్రత కల్పించలేదని ఆవేదన చెందుతున్నారు. ఆయనకు ఏదైనా అయితే ఎవరిది బాధ్యత అని నిలదీస్తున్నారు.

    మరోవైపు వైఎస్‌ వివేకాది హత్య అంటూ జమ్మలమడుగు కోర్టులో వాంగ్మూలం రికార్డు చేశారు. రెండున్నర గంటలపాటు కోర్టులో వాచ్‌మెన్‌ రంగయ్యను విచారించిన సీబీఐ అధికారులు.. అతని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. వివేక హత్య కేసులో తొమ్మిది మంది పాత్ర ఉందని, అందులో ఇద్దరు ప్రముఖులు ఉన్నట్లు రంగయ్య చెప్పినట్లు తెలుస్తోంది. సెక్షన్ 164 కింద రంగయ్య వాంగ్మూలం రికార్డు చేశారు.

    45 రోజుల నుంచి వివేకా హత్యకేసును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. మూడు రోజుల నుంచి వాచ్‌మెన్ రంగయ్య విచారణకు హాజరవుతున్నాడు. నిన్న రంగయ్యను కోర్టులో హాజరుపరిచారు. విచారణలో రంగయ్య కీలక విషయాలు వెల్లడించాడు. రంగయ్య ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉంది. అయితే, కోర్టులో ఏం ప్రశ్నించారు. తాను ఏం చెప్పానన్నది గుర్తు లేదని అంటున్నాడు రంగయ్

    ఐపీసీ సెక్షన్ 164 కింద రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం రికార్డయ్యింది. ఈ సెక్షన్ ప్రకారం రికార్డు చేసిన వాంగ్మూలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోవడానికి కుదరదు. ఒకవేళ మాటమార్చితే వారిపైనా చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. అందుకే కీలక ఆధారాలు లభించినప్పుడు పోలీసులు ఈ సెక్షన్ కింద న్యాయమూర్తి సమక్షంలో వాంగ్మూలాన్ని రికార్డు చేస్తారు. నేరాన్ని నిరూపించడంలో ఈ స్టేట్‌మెంటే కీలకం కాబోతోంది. అయితే ఈ కేసు ప్రస్తుతం వారి ముగ్గురి చుట్టే తిరుగుతోంది.

    వాచ్‌మన్‌ రంగయ్యతో పాటు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయతుల్లా, మాజీ డ్రైవర్‌ దస్తగిరి, పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్‌కుమార్‌ యాదవ్‌, కిరణ్ సోదరుడు సునీల్‌కుమార్‌ యాదవ్‌, తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రి, సోదరి నందిని, మైనింగ్‌ వ్యాపారి గువ్వల గంగాధర్‌, కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని లక్ష్మిరెడ్డి తదితరులను విచారించిన సీబీఐ.. రంగయ్య నుంచి కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. ముఖ్యంగా వివేకాను హత్య చేసింది ముగ్గురే అని వాచ్‌మెన్ రంగయ్య చెబుతున్నారు. కోర్టులో వాంగ్మూలం తర్వాత ముగ్గురి పేర్లు చెప్పారు ప్రత్యక్షసాక్షి వాచ్‌మెన్ రంగయ్య. ఎర్ర గంగిరెడ్డి, సునీల్, దస్తగిరిలే వివేకాను చంపినట్లుగా చెప్పారు రంగయ్య చెబుతున్నారు. అయితే తమ పేరు చెబితే చంపేస్తానంటూ ఎర్ర గంగిరెడ్డి ఇతర సభ్యులు బెదిరించారని, అందుకే ఇన్ని రోజులు ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదని చెప్పాడు రంగయ్య. అయితే, సీబీఐ అధికారులు తనకు భరోసా ఇవ్వడంతోనే వివరాలు చెప్పినట్లు రంగయ్య చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా కనిపించడం లేదు. ఆయనకు ఇప్పటికైనా భద్రత కల్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరోవైపు ఈ హత్య చేసింది ముగ్గురే అని గుర్తించి సీబీఐ అధికారులు.. వారి వెనుకాల ఎవరు ఉన్నారు అనే కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్టు ప్రచారం..

    దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత తమ్ముడైన వైఎస్ వివేకానంద రెడ్డి గతంలో కడప ఎంపీగా, కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు అనగా మార్చి 15న ఆయన పులివెందులలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను దారుణంగా నరికి హతమార్చారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం అప్పట్లో సిట్ ద్వారా దర్యాప్తుకు ఆదేశించగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన దర్యాత సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది.
    Published by:Nagesh Paina
    First published: