వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం.. బీజేపీ నేతకు చిక్కులు

ఇప్పటికే ఆయన న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదినారాయణ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని సిట్ అధికారులు భావిస్తున్నారు.

news18-telugu
Updated: December 10, 2019, 5:05 PM IST
వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం.. బీజేపీ నేతకు చిక్కులు
వైఎస్ వివేకానంద రెడ్డి
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  సిట్ విచారణకు రేపు బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది. మూడు సార్లు ఫోన్ ద్వారా సమాచారం అందించినా ఆయన స్పందించలేదు. దాంతో సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి బుధవారం సిట్ విచారణకు హాజరవుతారని సమాచారం. ఇప్పటికే ఆయన న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఓ మాజీ మంత్రి కోసం వెతుకుతోంది. కడప జిల్లా నేత, టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆది నారాయణరెడ్డికి ఇప్పటి వరకు సిట్ అధికారులు మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా కోరారు. అయితే, రెండు సార్లు ఆయన హాజరుకాలేదు. ఇక  ఇప్పటి వరకు వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలతో పాటు టీడీపీ నేతలు బీటెక్ రవి, నారాయణరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రఘనాథ రెడ్డి, పరమేశ్ రెడ్డిని సిట్ విచారించింది. ఆదినారాయణ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని సిట్ అధికారులు భావిస్తున్నారు.

First published: December 10, 2019, 5:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading