ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును ఏపీ పోలీసులు ముమ్మరం చేశారు. ఎంపీ అవినాష్ తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డిలతో పాటు కొందరు టీడీపీ నేత శివరామిరెడ్డిని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. మరో పది రోజుల పాటు వీరిని విచారిస్తామని ఎస్పీ అంబురాజన్ తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వైఎస్ వివేకా దర్యాప్తు కోసం మరో సిట్ ఏర్పాటు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సరిగా పని చేయడం లేదనే మరో బృందాన్ని నియమించింది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న పలువురికి ఇప్పటికే నార్కో అనాలిసిస్ టెస్టులు కూడా చేశారు. ఐతే వీరిలో శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు.
కాగా, వైఎస్ వివేకానందరెడ్డిని మార్చి 15న పులివెందులో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వివేకా నివాసంలోనే నరికి చంపారు. ఆయన మృతదేహంపై తల, చేతులు సహా పలు భాగాల్లో బలమైన గాయాలు ఉన్నాయి. గొడ్డలి లేదా వేటకొడవలితో ఆయనపై దాడిచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎన్నికల వేళ సంచలనం రేపిన ఈ కేసును ఏపీ పోలీసుల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని వివేకా హత్యపై కూపీలాగుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.