వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించిన కోర్టు

వివేకా హత్య కేసులో నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

news18-telugu
Updated: May 20, 2019, 6:10 PM IST
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించిన కోర్టు
వైఎస్ వివేకానంద రెడ్డి
  • Share this:
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు కోర్టు మరోసారి రిమాండ్‌ పొడిగించింది. ఈ హత్యకేసులో అరెస్టయిన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లను పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్టులో పోలీసులు ఈ రోజు హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు జడ్జి అశోక్ కుమార్ నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, కడపలోని కేంద్ర కారాగారం నుంచి పులివెందులలోని సబ్ జైలుకు తమను తరలించాలని నిందితులు పెట్టుకున్న పిటిషన్‌పై న్యాయమూర్తి విచారించారు. వారి అభ్యర్థనను పరిగణలోని తీసుకున్న కోర్టు.. ముగ్గురు నిందితుల్ని పులివెందులలోని సబ్ జైలుకు తరలించాలని ఆదేశించింది.

కాగా, రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించిన వివేకా హ‌త్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పోలీసులు విచార‌ణ సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వ‌ర‌కు ముగ్గురిని అరెస్ట్ చేయటం మిన‌హా హ‌త్య జ‌రిగి రెండు నెలలు అవుతున్నా ఏమీ బ‌య‌ట‌కు రాలేదు. వివేకా కుటుంబ స‌భ్యులు మౌనంగా ఉంటున్నారు. దీంతో.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకే వివేకా హ‌త్య కేసు ఒక కొలిక్కి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

First published: May 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>