వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వాచ్ మెన్ రంగయ్య కు నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది.

news18-telugu
Updated: July 3, 2019, 9:56 PM IST
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం
వైఎస్ వివేకానంద రెడ్డి
  • Share this:
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి వాచ్ మెన్ రంగయ్య కు నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. వైఎస్ వివేకానంద రెడ్డి ఇంట్లోని వాచ్ మొన్ రంగయ్యను మూడు రోజుల పాటు పోలీసులు విచారించారు. అనంతరం రంగయ్యను నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు అనుమతించాలని కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేశారు. మొదటిసారి నార్కో అనాలసిస్ కు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేయగా, దాన్ని కోర్టు తిరస్కరించింది. తర్వాత మళ్లీ పిటిషన్ వేయడంతో వారికి ఈ రోజు కోర్టు అనుమతి ఇచ్చింది.

First published: July 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు